Author: Sujanaranjani

తెలుగు భాష చేదా?

కవితా స్రవంతి
- ఎస్.ఎస్.వి. రమణరావు రండి రండి రండి రండి కదలి రండి రండి తరలి రండి ఇది తెలుగు మహా'దండి' భాషమీద దాడి కన్నతల్లి మీద దాడి భాష మీద కుట్ర మన ఆస్తి దోచే కుట్ర తెలుగు భాష అంత చేదా? పుట్టిన మట్టి అంత రోతా? // రండి// ఇది "హింసనచణ ధ్వంసరచన ధ్వంసనచణ హింసరచన" అర్థం కాలేదా? చొక్కాల రంగులు వేరైనా చెడ్డీల రంగులొకటే తెలుగుభాష పై దాడిలో పార్టీలన్ని ఒకటే గోముఖ వ్యాఘ్రాలన్నీ ముసుగులన్నీ తీసేశాయ్ కోరలన్నీ బార సాచి వికటంగా నవ్వుతున్నాయి ఫేను తిప్పే గాలిలో విషవాయువులే వీస్తున్నాయి పంక్చరైన సైకిల్ టైరులోంచి అపాన వాయువులే వస్తున్నాయి // రండి// భూదోపిడి సరిపోలే చెరువు కబ్జా సరిపోలే కూలగొట్టింది సరిపోలే విడగొట్టింది సరిపోలే పంచభూత దోపిడి పూర్తి సంస్కృతి దోపిడి షురూ // రండి// (ఈ కవితగానం కింద ఆడియోలో వినండి)

ఈ-అవధానం

ఈ మాసం సిలికానాంధ్ర
- అవధాని నేమాని సోమయాజులు 16 నవంబరు 2019వ తేదీ సాయంత్రం సిలికానాంధ్రావారి సంకల్పంతో అంతర్జాలమాధ్యమంలో అద్భుతమైన అష్టావధానం జరిగింది. అవధాని డా. రాంభట్ల పార్వతీశ్వరశర్మగారు. ఆయన శతావధాని మరియు అవధాని భీమ, అవధాన సుధాకర బిరుదాంకితులు. ఈ అవధానం ప్రత్యేకత ఏమిటంటే అవధాని, సంచాలకులు, పృచ్ఛకులు, లేఖకులు అందరూ వేర్వేరు ప్రదేశాలనుడి పాల్గొన్నారు. ప్రేక్షకులు కూడా వివిధ దేశాలు, ఖండఖండాంతరాలనుండి పాల్గొని ఆనందించారు, అభినందించారు కూడా. సిలికనాంధ్ర నాయక్త్వ జట్టు నుంచి రాజు చమర్తిగారి ప్రసంగంతో మొదలై, సంచాలకులు సోమయాజులుగారి పరిచయకార్యక్రమంతో అవధానం మొదలైంది. ఈ అవధానం సమస్యాపూరణము, దత్తపది, వర్ణనము, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, ఛందోభాషణము, అప్రస్తుతప్రసంగము మొదలైన అంశాలతో అలరారింది. పృచ్ఛకులు తమ ప్రశ్నల పరంపరను అవధానిగారిపై కురిపింపగా, అవధానిగారు కడు నేర్పుతో చాకచక్యంగా వాటన్నికీ మంచి సమాధానలన

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య నిచ్చలు నాబతుకెల్ల నీచేతిది ఈ కీర్తనలో అన్నమయ్య అమ్మ అలమేలుమంగమ్మ గా మారి నివేదిస్తున్నాడు. శ్రీనివాసునితో వివిధ శృంగార రీతుల వివరాలు విన్నవించింది. కొంత ప్రణయకోపాలు ప్రకటించింది. ఆ పిమ్మట స్వామికి చేరువై స్వామిని మనసారా ఏలుకొమ్మని శరణువేడింది. పలు ఉపాయాలతో ఆ స్వామికి చేరువైన అమ్మ ప్రణయ విహార విశేషాలను అంటూ సాగుతుంది ఈ కీర్తన. ఆ విశేషాలు చూద్దాం. కీర్తన: పల్లవి: నిచ్చలు నాబతుకెల్ల నీచేతిది । నీ- యిచ్చవచ్చినట్టు సేయు మెదురాడ నిఁకను ॥పల్లవి॥ చ.1 పలికితి నీతోడఁ బంతములు సారెసారె సొలసితిఁ గొంత గొంత చూపులలోను అలసితి నిఁకనోప నన్నిటా నీచిత్తమునఁ గలిగినయట్లఁ జేయు కాదన నే నిఁకను ॥నిచ్చ॥ చ.2 కక్కసించితిని నిన్ను ఘనమైనరతులను వెక్కసానఁ గొసరితి వేసరించితి మొక్కెద నిఁక నేనేర మొదల నుపాయాలు మక్కువ గలట్టే సేయు మఱఁగేల యిఁకను ॥నిచ్చ॥ చ.3 కరఁగించితి మనసు కాఁగిటిరతుల నిన్ను

*దక్షిణభారత సంస్కృతి తీర్థయాత్ర*

శీర్షికలు
---పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు [ 🔯తరింపచేసేది తీర్థం... ఆ "తరించామనే భావం" ఒక అందమైన ప్రదేశం చూసిన అనుభవంతో రావచ్చు. ఒక శక్తివంతమైన చోట కాలు మోపడం వల్ల కావచ్చు... ఈ రెంటినీ కలుపుకొన్నప్పటికీ, ఇదీ అని స్పష్టంగా విప్పి చెప్పలేని, 'ఆధ్యాత్మిక' అనుభవం వల్ల కావచ్చు.. బయటకు అలా విప్పి చెప్పలేక ఆత్మ పరిధిని 'అధి' గమించే అనుభవాన్నే ఆధ్యాత్మికత అంటాం.. భారతీయ సంస్కృతి లోని ప్రత్యేకతే అది! మన సంస్కృతిలో ప్రతి చోటా ఒక చరిత్ర ఉంది. మనసుపెట్టి చూస్తే, ఒక ఆత్మను స్పృశించి, పైకి నడిపించే ఒక ఆధ్యాత్మికత ఉంది. అందుకే భారత దేశంలో ఏ యాత్ర చేసినా, అది కేవలం తీర్థ యాత్ర కాదు; అదో సంస్కృతి యాత్ర! అదో ఆధ్యాత్మిక అనుభవ యాత్ర! అలాటి ఓ యాత్ర సతీసమేతంగా చేసి వచ్చిన కాలిఫోర్నియా ఫ్రెమాంట్ వాస్తవ్యులు పిల్లలమర్రి కృష్ణకుమార్ గారి అనుభవాన్ని వారి మాటల్లో రోజూ చూద్దాం.... ― సంపాదకుడు👏] 2019 మే మాసంలో నే

*మనిషి జాడ*

కవితా స్రవంతి
~ సాగర్ల సత్తయ్య కసాయిల పడగ నీడన కాలం వెళ్లదీయడమంటే అనుక్షణం బతుకుతూ చావడమే మృత్యువు ఏ రూపాన మనల్ని కాటేస్తుందో ఉహలకందని విషయమిపుడు మనిషిని పశుత్వం నిలువెల్లా ఆవహించినప్పుడు చంపటం చావడం ఓ క్రీడ తండ్రిని కొడుకు చంపడం అన్నను తమ్ముడు చంపడం తల్లిని బిడ్డ చంపడం భర్తను భార్య చంపడం భార్యను భర్త చంపడం తన మాట వినలేదని అధికారినే తగలబెట్టడం వినీ వినీ మనసు మొద్దుబారుతోంది కరెన్సీ కల్చర్ స్వార్ధంతో సహవాసం చేస్తూ మనిషితనాన్ని సమాధి చేస్తుంది మానవ విలువలను వెతకడమంటే ఎండమావిలో నీటిని వెతకడమివాళ ఆర్థిక సంబంధాలే మనల్ని శాసిస్తున్నపుడు మానవ సంబంధాలెక్కడివి మన పిచ్చి గాని మృగ్యమవుతున్న మనిషి జాడను వెదకిపట్టగలిగే పాతాళ గరిగె కోసం అన్వేషిస్తున్నా...