మోడర్న్ జ్యోతిషం
-ఆర్ శర్మ దంతుర్తి
ఇన్ కం టేక్స్ డిపార్ట్ మెంట్ లోంచి రిటైరైపోయిన సుబ్బారావుకు మూడు నెలలు గడిచేసరికి ఇంట్లో కూర్చోవడం బోరు కొట్టినప్పుడు, ఇన్నేళ్లలో ఇన్ కం టేక్స్ డిపార్ట్ మెంట్ లో ఉండే పవర్, డబ్బూ, అందులో వచ్చే అదనపు పరపతీ వగైరాల వచ్చిన మనస్తత్వం తో ప్రజల్ని ఎలా దోచుకోవాలా అని ఎదురు చూస్తూంటే అప్పుడొచ్చిందో బ్రిలియంట్ ఐడియా. ఓ వారం బాగా ఆలోచించేడు ఏం చేయాలో. లెక్క చూసుకుంటే ఓ యాభై అరవై వేలు పెట్టి బిజినెస్ పెడితే రోజుకు రెండు, మూడు వేలు లాగవచ్చు – అతి సులభంగా. మహా అయితే మొదటి ఆరు నెలల్లో పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి. అయితే ఈ ఆఫీసుకి ముందు ఒక అందమైన రిసెప్షనిస్టూ, తనకో ప్రైవేట్ రూమూ, అన్ని రూముల్లోనూ వీడియో కెమెరాలూ, అసలు సిసలు బిజినెస్ జరిగడానికి పూజామందిరం అనబడే ఓ మెయిన్ రూమూ, అందులో రకరకాల దేవుళ్ళ ఫోటోలూ ఇవన్నీ చూడ్డానికీ, ఓ ఫోను కీ మిగతా అల్లాటప్పా చిల్లర ఖర్చులకి అంతా కలిప్ మొత్తం డబ్