చెఱసాల
-నండూరి సుందరీ నాగమణి
ద్వితీయ బహుమతి పొందిన కథ
“పిల్లాడు ఫోన్ చేసాడండి, అక్కడ టార్చర్ తట్టుకోలేకపోతున్నాడట!” దీనంగా చెప్పింది రాజేశ్వరి భర్తకు కాఫీ కప్పు అందిస్తూ.
“చూడు రాజీ, ఇది పోటీ ప్రపంచం… ఇక్కడ మనమూ పోటీ పడకపోతే తప్పదు… వాడికి ఇంటిమీద బెంగ ఉండటం సహజం. కానీ... నిజానికి వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. అసలలాంటి కార్పొరేట్ కాలేజీ అయితేనే వీడిలాంటి బద్దకిష్టులకి సరియైన చోటు… నువ్వేం బెంగపడకు, వాడలాగే అంటాడు.” తాపీగా టీవీ ఛానల్ మార్చుతూ, కాఫీ సిప్ చేయసాగాడు గరళకంఠం.
“అయ్యో, మీకెలా చెప్పాలి? మొదట్లో టాప్ టెన్ లో ఉండేవాడు కనుక బాగానే ఉండేది. ఇప్పుడు వాడి రాంక్ తగ్గిపోవటంతో సెక్షన్ మార్చేసారట. వీడిని… వీడిననే కాదు వీడి క్లాసుమేట్స్ అందరినీ ఎంతో హీనంగా చూస్తారట. ఎన్నో మాటలు, సాధింపులనట… ఛ! ఏం మాస్టర్లండీ? ఎగతాళిగా మాట్లాడుతూ, పిచ్చి పిచ్చి అడల్ట్ జోక్స్ కూడా వీడిమీద వేస్తారట! ముడుకుల