వలస
-ఆర్ శర్మ దంతుర్తి
ఆఫీసునుంచి సాయంత్రం ఇంటికొచ్చిన రమణ లోపలికి వస్తూ అరిచేడు, “ఈ రోజు కొత్త న్యూస్; శాన్ ఆంటానియోలో నాకో మంచి ఉద్యోగం వచ్చింది మనం టెక్సాస్ వెళ్ళిపోతున్నాం.”
“అదేమిటి, మరి ఇక్కడ ఈశ్వరి చదువో? మధుని ఇప్పుడే డే-కేర్ లో చేర్పించాం. వాడు కుర్రాడు కనక ఎలాగోలా తట్టుకున్నా, అమ్మాయి అక్కడ కలవగలదా? టెక్సాస్ అంటే అక్కడ స్పానిష్ మాట్లాడే మెక్సికన్లు ఎక్కువగా ఉంటారంటారు కదా?” కల్పన అడిగింది రమణని అనుమానంగా చూస్తూ. ఈ లోపుల, నాలుగో తరగతి చదివే అమ్మాయి ఈశ్వరికి ఇది అర్ధం అయిందో లేదో కానీ వీళ్ళ మధ్యలోకి వచ్చి ఈ తతంగం ఏమిటో చూడబోయింది.
“మొన్నామధ్య ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, మొదట్లో ఉత్తి ఫేమిలీ కేర్ డాక్టర్ లా పనిచేస్తావా అని అడిగారు. ఆలోచిస్తాను అని చెప్పాను. కానీ ఈ రోజు ఫోన్ చేసి చెప్పారు మళ్ళీ, ఫేమిలీ కేర్, డయాబెటిక్ కేర్ కి కలిపి ఓ క్లినిక్ ఓపెన్ చేస్తున్నారుట. వస్తావా అని అడిగారు. వె