Author: Sujanaranjani

” తిండి యావ” (హాస్య కధ)

కథా భారతి
పెళ్ళి చూపుల్లో ముద్దబంతి పువ్వులా ఉన్న సుందరి అందచందాల మీద గాని వాళ్ళు జరుపుతామంటున్న పెట్టిపోతలు, కట్నాల మీద గాని ధ్యాస లేదు సుబ్బారావు కి..ఆడపెళ్ళి వారు పళ్ళాలలో పెట్టిన తినుబండారాల మీదే అతని దృష్టి మొత్తం..ఉంది.చూపులయ్యాక " ఏరా సుబ్బూ.. పిల్ల నచ్చిందా? అనడిగాడు అటు ఆడపెళ్ళి వారికి ఇటు మగ పెళ్లి వారికి మథ్యవర్తిగా వ్యవహరిస్తున్న సుబ్బారావు సొంత మేనమామ..తినబండారాలపై దృష్టి మరచలేని సుబ్బారావు నోరూరించే మైసూర్ పాక్ ఇంకా తినవేంటి అంటూ పచ్చగా హొయలు బోతూ నవ్వినట్లనిపించి అమాంతం ఒక ముక్క తీసుకొని నోట్లో వేసుకుని దాని రుచిని ఆస్వాదిస్తూ 'ఆహా'..అన్నాడు తన్మయంగా.... ఇహనేం మా వెధవాయ్ కి పిల్ల నచ్చింది ఇక శుభస్యశీఘ్రం ..పెళ్ళున నవ్వుతూ అన్నాడు మేనమామ. ఆ నవ్వు అదురుకి టేబిల్ పై నున్న పళ్ళాలలో నీటుగా సర్ది పెట్టిన తినుబండాలు చెల్లా చెదరు అయేసరికి ఆడపెళ్ళి వారు హడలిపోయారు..! ఇక పెళ్ళి చూపుల తతం

సెల్ ఫోను స్తోత్రము

కవితా స్రవంతి
- పుల్లెల శ్యామసుందర్ ఉదయంబున నిద్దుర లేవగనే నిను చూడక డే మొదలవ్వదులే దినమందున ఓ పదిమారులు నిన్ ప్రియమారగ జూడక సాగునటే సెలిఫీలను దీసెడి కేమెరవై పదిమందికి నువ్ చరవాణివియై ముఖపత్రము జూపెడి బ్రౌసరువై సమపాలున నిస్తివి సౌఖ్యములన్ పరిశోధన సల్పెడి గూగులుగా గణితమ్మును జేసెడి యంత్రముగా సమయమ్మునకై గడియారముగా అవతారము దాల్చితి వీవుభళా! సరి తిండియు తిప్పలు మానుకొనీ పనులన్నిటినీ వదిలేసి ప్రజల్ నిను వీడక యుందురు నెల్లపుడూ జగమంతయు భక్తులు నీకెగదా స్పెలియింగుల తప్పుల నన్నిటినీ సవరించుచు రక్షణ చేయవటే మరి చీకటి ద్రోలెడి దీపమువై మము కావగ నీవిట వెలసితివే వినా సెల్లు ఫోనూ ననాదో ననాద సదా స్మార్టు ఫోను స్మరామి స్మరామి భలే ఆండురాయిడ్ ప్రసిద్ధ ప్రసిద్ధ ప్రియం అయ్యి ఫోను ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రయాణాలయందున్ ప్రమోదాలయందున్ నినున్ వీడి నేనుండ లేన్సెల్లు ఫోనా ఒకస్పేరు బ్యాట్రీతొ నే నిన్

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
పైన చెప్పబడిన ప్రముఖుల భావాలు పరిశీలిస్తే భావకవితానంతర కాలంలో ప్రభవిల్లిన అభ్యుదయ కవిత్వం నియమాలకూ, నిబద్ధతకూలోనై వర్తిస్తుండగా, సామాజికావసర కారణంగానే అనుభూతి కవిత్వం పుట్టుకొచ్చిందనే తోస్తున్నది. అనుభూతి కవితావాదం విషయమై మంచి వ్యాసాన్ని ప్రభురించారు ఆర్.ఎస్. సుదర్శనంగారు. ఆ వ్యాసంలో వారు చేసిన వివేచన, విశ్లేషణ విలువైన అంశాలను అందిస్తున్నాయి. అనుభూతి కవిత్వంలోని నవ్యత హృదయానికి హత్తుకొని అనిర్వచనీయమైన, అనిర్ధిష్టమైన అనుభూతిగా మిగలాలి. ఇది పోలికల ద్వారా కానీ ఊహల అల్లికల ద్వారా కానీ ఇంద్రియ సంవేదన రేకెత్తించే వర్ణన ద్వారా కానీ కావచ్చు. ఒక ఖండిక చదివిన తర్వాత దానిలోనుంచి మనం ఎటువంటి సందేశాన్ని పొందనవసరం లేదు. అది మనకెటువంటి దృక్పథాన్నీ కల్గించాల్సిన అవసరం లేదు. ప్రాచీన కవితోద్దేశాలను పరిశీలిస్తే - “యద్వేదాత్ప్రభు సమ్మితాదధిగతం శబ్దప్రధానాచ్చిరం యచ్చేర్థ ప్రవణాత్పురాణ వచనాదిష్టం సుహృత్సమ్మి

రామాయణ సంగ్రహం

ధారావాహికలు
-డా. అక్కిరాజు రామాపతిరావు నందీశ్వరుడి శాపం నందీశ్వరుడు రావణుణ్ణి 'నా రూపాన్ని చూసి వెటకారం చేశావు కదా! నా వంటి వక్రరూపులైన కపులు నీ లంకపై దండు వెడలి నిన్ను సర్వనాశనం చేస్తారు' అని దశగ్రీవుణ్ణి శపించాడు. ‘నిన్ను ఒకే ముష్టిఘాతంతో చంపివేయగలను కాని, చచ్చిన వాణ్ణి చంపటమెందుకని ఉపేక్షిసున్నాను. ఇప్పటికే నీవు చచ్చినవాడి కింద లెక్క' అని క్రోధతామ్రాక్షుడై నంది రావణుణ్ణి నిరసించాడు. పార్వతీదేవి భయం పోగొట్టటానికి పరమశివుడు తాము కూచున్న గద్దె కిందికి తన పాదం చాచి కొండను తన కాలిబొటన వేలితో అదిమాడు. కొండ కింద రావణుడి శరీరం నలిగిపోయింది. తన భుజాలను, చేతులను దశకంఠుడు కొండ కింద నుంచి ఇవతలకు తీసుకోలేకపోయినాడు. కెవ్వుకెవ్వున కేకలు వేస్తూ కుయ్యో, మొర్రో అని ఆక్రందించాడు రావణుడు. అంగలార్చాడు. పదినోళ్ళతో మిన్నూమన్నూ ఏకమైపోయేట్లూ, ప్రచండపయోధరం గర్జించినట్లూ, ప్రళయకాలపు మబ్బులు ఉరుమురిమినట్లూ రోదించాడు. సమ

వీక్షణం సాహితీ గవాక్షం-80

వీక్షణం
-వరూధిని వీక్షణం-80 వ సమావేశం కాలిఫోర్నియా బే-ఏరియాలోని పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారింట్లో ఏప్రిల్ 14, 2019 న జరిగింది. ముందుగా పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారు, శాంత గారు సభకు ఆహ్వానం పలుకుతూ నిన్నా మొన్న ప్రథమ సభ జరిగినట్లుగా ఉందని ఇంతలోనే వీక్షణం 80 వ సమావేశం లోకి అడుగు పెట్టడం, ఈ సమావేశం తమ ఇంట్లో జరగడం తమకు అత్యంత ఆనందదాయకమని అన్నారు. ఉగాది కవి సమ్మేళనం ప్రధాన కార్యక్రమంగా జరిగిన ఈ సమావేశానికి శ్రీ రావు తల్లాప్రగడ గారు అధ్యక్షత వహించారు. ముందుగా శ్రీ చరణ్ గారు "రామ నామ శబ్ద విశిష్టత" అనే అంశమ్మీద మాట్లాడుతూ "రం" అనే ధాతువు గురించి, ఋగ్వేదంలోని శబ్ద మూలాల గురించి వివరించారు. రాముని పుట్టుకకు ముందే ఈ శబ్దం ఉన్నదనీ, అత్యంత ఆనందస్థితే ఈ శబ్దమని అంటూ రామ శబ్దానికి ఈశ్వర తత్త్వానికి ఒకటే అర్థమని వివరించారు. ఇందులో భాగంగా వేదాలు, ఇతిహాసాలు, పురాణాల గురించి వివరిస్తూ వేదాల్లో చెప్పిన విషయాలను

కలియుగ అజామిళ

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, భారద్దేశం. అప్పల్నాయుడు పుట్టినప్పుడు జాతకం చూసిన పంతులు చెప్పడం ప్రకారం నాయుడిది సింహ లగ్నం. ఎలాగైనా సరే పెద్దయ్యాక నాయకుడై తీరుతాడు. అయితే ఎందులో నాయకుడౌతాడనేది పెంపకాన్ని బట్టి ఉంటుందనీ అందుకోసం నాయుడి తండ్రి కొంచెం కష్టపడాలనీ పంతులు చెప్పాక అప్పల్నాయుడి తండ్రి ఆలోచించాడు - ఏ లైన్లో కుర్రాణ్ణి సులభంగా నాయకుణ్ణి చేయచ్చో, ఏ వృత్తిలో అయితే పెద్ద చదువు, సంధ్యా అక్కర్లేదో, ఏదైతే లక్ష్మీ కటాక్షం కురిపిస్తుందో. దీని కోసం నాయిడి తండ్రికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది. నాయుడికి సరిపోయేవి రాజకీయాలు. ఓ సారి ఊళ్ళో సర్పంచో ఏదో ఒకటి అయితే అక్కణ్ణుంచి జిల్లాకి, తర్వాత ఎమ్మెల్యే అలా పైకి పాకడం తారాజువ్వ ఆకాశంలోకి ఎగిరినట్టూ జరిగిపోతుంది. సింహ లగ్న ప్రభావమో మరోటో కానీ మూడో క్లాసులోంచే అప్పల్నాయిడు నాయకుడి లక్షణాలు చూపించడం మొదలుపెట్టేడు - పక్కింటి అమ్

అన్నమయ్య జయంతి

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు తెనాలి రామకృష్ణుడు తాళ్ళపాక కవులను ఒక పద్యములో ఇలా ప్రశస్తించెను - చిన్నన్న ద్విపదకెఱగును పన్నుగ బెదతిరుమలయ్య పదమున కెఱగన్ మిన్నంది మొరసె నరసిం గన్న కవిత్వంబు పద్యగద్యశ్రేణిన్! అన్నమాచార్యుడు, అతని వంశీయులైన నరసన్న, పెదతిరుమలయ్య, చిన్నన్న అందరూ కవులే. అన్నమయ్య తెలుగు నుడికారమున దిట్ట. సంస్కృతమున కూడా మంచి సంకీర్తనలు రచించాడు కూడా. ద్రావిడ, కర్ణాటక, తెలుగు భాషల్లో మొదటగా సంకీర్తనలు రచించిన వాడు అన్నమాచార్యుడు. అందుకే 'పదకవితాపితామహుడు ' బిరుదాంకితుడు. ఎన్నో కవితారీతుల్లో మధురంగా రచించిన అన్నమయ్య జానపద రీతులు కొన్ని ఇవి - జాజఱలు, గొబ్బి, నలుగులు, గుజ్జెనగూళ్ళు, అల్లోనేరెళ్ళు, తందనాలు. మే 25, 26, 27 తేదీల్లో జరిగే అన్నమయ్య జయంతి ఉత్సవానికి తప్పక విచ్చేయండి. ఆ సంకీర్తనాచార్యునికి గాన, నాట్య కళలతో అర్పించే నివాళిలో పాలుపంచుకోండి. వివరాలకు 'ఈ మాసం సిలికాన

ఏకాకి జీవితం

కవితా స్రవంతి
డి.నాగజ్యోతిశేఖర్ మురమళ్ళ, తూర్పుగోదావరి జిల్లా. 9492164193 కాలం గుప్పిట్లో బందీనై నిన్ను నేను ఎడబాసినప్పటికీ... నా ఒంటరి నిశీధి అంచుల్లో చెకుముకి రాళ్ళై నీ జ్ఞాపకాలు నాలో రాపాడుతూనేఉన్నాయి! వేదనకొమ్మల్లో పూలపిట్టలై నీ ఆలోచనలు నాతో సంఘర్షిస్తూనేఉన్నాయి! గతం శిథిలాల్లో స్మృతుల తీగలై నీ చేరువలు నన్ను అల్లుకోవాలని తపనపడుతూనే ఉన్నాయి! కన్నీటి కొసల్లో కొసమెరుపులై నీ సాంగత్యాలు నన్ను ఓదారుస్తూనేఉన్నాయి! గుండె పటం ఫ్రేములో వెచ్చని ముద్రలై నీ ఔన్నత్యాలు నన్ను తడుముతూనే ఉన్నాయి! నాకు తెలుసు... నేనేం కోల్పోయానో... ఇంక... నీ ఎడబాటు చీకటిని తరగడం నా తరం కావడం లేదు! నీ జంటబాసిన సమయాలను దాటాలంటే నా శ్వాసకు అడుగుసాగడం లేదు! నీవు లేని ఈ ‘ఏకాంతాన్ని’ ఏలాలంటే దహనమౌతున్న నా హృదయతనువుకు సాధ్యం కావడం లేదు! పొరలుపొరలుగా పొగిలివస్తున్న దుఃఖ సంద్రాన్ని వెలేయడానికి గుండె గొ

నిత్య సూర్యుళ్ళం!

కవితా స్రవంతి
వెన్నెల సత్యం షాద్ నగర్ 94400 32210 ఎప్పట్లాగే ఈ రోజూ ఈ రోజు కోడి కూత కన్నా ముందే నిద్ర లేచాను నా స్వేచ్ఛా ప్రపంచపు వంటింట్లోకి ఠంచనుగా అడుగు పెట్టాను! యుద్ధభూమిని తలపించే ఆ వంట గదిలో పాత్రలతో పోరు చేస్తూ కాయగూరలతో కత్తియుద్ధం చేస్తూ చెమటోడుస్తున్నాను! జిహ్వకో కూర తీరొక్క అల్పాహారాలతో తిండికీ నోచుకోని తీరిక లేని పనులు మసిబారిన మగ దురహంకారపు అంట్లన్నీ తోముతూ దుష్ట సంప్రదాయాల మురికి గుడ్డల్ని ఉతుకుతూ కసవు నిండిన మది గదులన్నీ ఊడుస్తూ తుడుస్తూ బడలిక ఎరుగని బానిసలా ఏ అర్ధరాత్రో తీసే కూసింత కునుకు మా శరీరాలకే గానీ మనసులకు మాత్రం విశ్రాంతి ఎండమావే! మున్నూట అరవై ఐదు రోజులూ సూర్యుడితో పోటీ పడుతూ శ్రమశక్తితో ప్రపంచాన్ని నడిపించే మాకు ఏడాదికోసారి మీరిచ్చే గౌరవాలు అక్కర్లేదు! మా విన్నపాన్ని మన్నించండి మమ్మల్ని దేవతల్ని చేయక్కర్లేదు సాటి మనిషిగా చూడండి