Author: Sujanaranjani
శ్రీ రామ సంగ్రహం
రాక్షసులు దేవలోకంపై దండెత్టటం
-అక్కిరాజు రామాపతి రావు
రాక్షసులకప్పుడు అనేక దుర్నిమిత్తాలు, దుశ్శకునాలు ఎదురైనా వాళ్ళు జంకలేదు. ముగ్గురు అన్నదమ్ములు అశేష రాక్షససేనతో పోయి దేవతలతో తలపడ్డారు. ఈ విషయం విష్ణుమూర్తికి మొర పెట్టుకోవటానికి దేవతలు, దూతలను పంపారు. శ్రీమహావిష్ణువు యుద్ధసన్నద్ధుడైనాడు. సుపర్ణు ఆయనను విక్రమోత్సాహంతో తనపై అధిష్టింప చేసుకున్నాడు. రాక్షసులకూ, విష్ణుమూర్తికీ మహా భయంకరమైన యుద్ధం జరిగింది. కొండమీద పెనువర్షం కురుస్తున్నట్లుగా మహావిష్ణువుపై రాక్షసులు బాణవర్షం కురిపించారు. అయినా విష్ణుమూర్తి ఏమీ చలించలేదు. ఆయన కూడా వజ్రసమానమైన బాణాలను రాక్షసులపై ప్రయోగించాడు. తన పాంచజన్యాన్ని పూరించి రాక్షసులపై విజృంచాడు. ఆ శంఖ ధ్వనికే గుండెలు పగిలి చాలామంది రాక్షసులు హతులైనారు. ఇట్లా వేల సంఖ్యలో రాక్షసులు యుద్ధంలో నిహతులైనారు.
రాక్షస సంహారం
శ్రీమావిష్ణువు ఆ రాక్షసులను శరభమృగం సింహాలనువలెను
ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం
-సునీత పావులూరి
1966 లో తెలుగు సాహిత్య విమర్శలోకి ప్రవేశించిన "అనుభూతివాదం" అనే మాట ఈనాటికి ఆధునిక తెలుగు సాహిత్య అధ్యయనంలో ఒక ప్రముఖ సిద్ధాంతంగా స్థిరపడింది. 1966 నవంబర్ సృజనలో "అనుభూతివాది తిలక్" అనే వ్యాసంలో అద్దేపల్లి రామమోహనరావుగారు మొట్టమొదటిసారిగా 'అనుభూతివాది' అనే పదాన్ని ప్రయోగించారు. ఆ తరువాత క్రమక్రమంగా అనుభూతికవిత్వం, అనుభూతివాదం లాంటి పదాలు పారిభాషికపదాలుగా సాహిత్య విమర్శలో ప్రచురంగా వ్యాప్తిలోకి వచ్చాయి. అయితే తెలుగు సాహిత్య విమర్శలోని అనేక పారిభాషిక పదాలలాగానే ఈ పదాల విషయంలో కూడా ఒక స్పష్టమైన నిర్వచనం, అవగాహన ఇంతవరకూ రూపొందలేదు. ఉదాహరణకు కొందరు విమర్శకులు తిలక్ కవిత్వం విషయంలో మాత్రమే అనుభూతి కవిత్వం అనే పేరును ఉపయోగిస్తారు. మరికొందరు గుడిపాటి వెంకటచలం, అరిపిరాల విశ్వం, వేగుంట మోహనప్రసాద్, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, ఇస్మాయిల్, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, పొట్లపల్లి రామారావు,
అన్నమయ్య శృంగార నీరాజనం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య
“చిత్తగించి చూడవయ్య - సిగ్గువడ నీకేటికి”
అన్నమయ్య తానే చెలికత్తె పాత్ర ధరించి "చిత్తగించి చూడవయ్య సిగ్గువడ నీకేఁటికి" అంటూ స్వామి వారు అమ్మవారిని చూసి సిగ్గుపడే సన్నివేశాన్ని హృద్యంగా వర్ణిస్తున్నాడు. ఆ ముచ్చటేదో మనమూ విందాం.
కీర్తన:
పల్లవి: చిత్తగించి చూడవయ్య సిగ్గువడ నీకేఁటికి
బత్తిసేసీ నాకె నీపై భావించవయ్యా ॥పల్లవి॥
చ.1. సెలవుల నవ్వుతాను చేరి మాఁటలాడుతాను
పలువరుసలు చూపీఁ బడఁతి నీకు
నిలుగునివ్వెరగుతో నిండుసింగారములెల్లాఁ
బలుమారు నీముందరఁ బచరించీని ॥చిత్తగించి॥
చ.2. కొప్పు చక్కఁబెట్టుకొంటా కొలువులు సేసుకొంటా
నెప్పునఁ జన్నుల నొ త్తీ నెలఁత నిన్ను
వుప్పతిల్లుఁగళలతో నుడివోనిజవ్వనాన
కుప్పళించి వలపులు గురిసీ నీయెదుట ॥చిత్తగించి॥
చ.3. సరులు దిద్దుకొనుచు చవులెల్లా మోవిఁ జూపి
మరిగించీ నల మేలుమంగ నిన్నును
ఇరవై శ్రీ వేంకటేశ యిటు నన్ను నేలితివి
వురముపై
సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్
-సిహెచ్.నాగార్జునశర్మ
Cell No. 8978504127
ఈ రోజుల్లొ నెల జీతం వచ్చే ఉద్యోగం లేకపొతే మద్య తరగతి కుటుంబాలు బ్రతకడం కష్టం. అందుక్కారణం తమ పూర్వీకులు సంపాదించిన ఆస్థి పాస్థులు ఏమీ లేక పోవడమే. ఆ కోవలోకి చెందినదే రఘు పరిస్థితి.
రఘు నాన్న జిల్లా పరిషత్ హైస్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఆయన మరో అయిదెళ్ళలో పదవీ విరమణ పొందుతారు. అతడికి తను ఉద్యోగం చేస్తున్న ఊళ్ళో సొంత ఇల్లు తప్ప వేరే ఆస్థిపాస్థులేమీ లేవు. అది కూడా వాళ్ళ నాన్నగారు సంపాదించి పెట్టినదే.
రఘుకు ఒక తోడ బుట్టిన చెల్లెలుంది. పేరు శిరీష. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నది. రఘు పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా చదువుకున్నాడు. మంచి తెలివి తేటలు గలవాడు. మితభాషి. చదువులొ అన్నింటా ఫస్ట్ మార్కులతోనే పాసయ్యాడు. ప్రస్తుతం అతడి ముందున్న లక్ష్యం తండ్రి ఉద్యోగం నుండీ రిటైరయ్యే లోపల తను ఉద్యోగస్థుడవ్వాలని. రఘు తన డిగ్రీ పూర్తి అయిన దగ్గర
వీక్షణం 74వ సమావేశం- సమీక్ష
- విద్యార్థి
వీక్షణం 74వ సమావేశం శా.శ. ౧౯౪0 ఆశ్వీయుజ పంచమి నాడు, ( అక్టోబరు 14, 2018) నాడు, శ్రీ పెద్దిభొట్ల ఇందు శేఖర్, లావణ్య గార్ల గృహము నందు జరిగినది. ఈ సభకు అధ్యక్షత వహించిన ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు ప్రసంగిస్తూ Myth అనే మాటకు తెలుగులో మిథ్య అనే మాటకు సరి పోలికలున్నవి. హిందీలో మిథిక అనే వాడుక ఉంది. ప్రపంచములోని ఎక్కడి మిథాలజీ కథలు అయినా, మనిషి ఎక్కడ ఉన్నా ఆలోచనలు ఒక్కటే అనేటట్లు ఋజువు చేస్తాయి. గ్రీకు మిథాలజీ కథలు కూడా అటువంటివే" అని చెప్పి, ప్రాచీన గ్రీకు కావ్యాలను సభకు పరిచయం చేయటానికి ఆసూరి వేణు గారిని ఆహ్వానించారు. వేణు గారి ప్రసంగ విశేషాలు - "ప్రాచీన గ్రీకు కావ్యాలు ఇలియడ్, ఒడిస్సేలు మన రామాయణ మహాభారతాలని పోలి ఉంటాయి. వీటి రచయిత హోమర్. షుమారు సామాన్య శక పూర్వం 6వ శతాబ్ది కి చెందినవాడు. హోమర్ అనాథ, పైగా అంధుడు. వాల్మీకిలాగా ఆనాటి కుల వ్యవస్థలో ఉన్న కష్టాలును అధిగమించి,
ఆత్మవిశ్వాసం
అమరనాథ్. జగర్లపూడి
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
9849545257
ఆత్మన్యూనత వద్దు ఆత్మవిశ్వాసమే ముద్దు
(Inferiority to Self Confidence)
మానవ జీవన అభివృద్ధి సోపానాలకు ఆత్మవిశ్వాసమే పునాది. ఆత్మవిశ్వాసం కొరవడిన జీవితం సంక్లిష్టంగా, బరువుగా నడుస్తుంది. ఇది కేవలం విద్యార్థులకో యువతకో పరిమితమైనది కాదు సమస్త మానవాళికి ఇది ఆవశ్యకమైనది.మనపై మనకున్న నమ్మకమే మనల్ని జీవిత వైకుంఠపాళి లో పరమపద సోఫానాన్ని అధిరోహింప చేస్తోంది. వైకుంఠపాళి లో క్రిందకు లాగే పాములే కాదు పైకి చేర్చే నిచ్చెనలు కూడా వుంటాయని అవగాహన మనలో ఉన్నంత వరకు ఆత్మన్యూనతా (Inferiority) తో కాదు ఆత్మవిశ్వాసం (Self Confidence) తో మన అభివృద్ధికి విఘాతం కలిగించే ఏ విషయాన్నైనా ధైర్యంతో ఎదుర్కోగలం!
జీవన గమనంలో సామాజికంగా,సాంఘికంగా,సాంకేతికంగా జరిగే మార్పులు అనుక్షణం మన ముందు అనేకానేక కొత్త కొత్త సవాళ్ళను తెస్తుంటాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా జరుగ