ఒత్తిడిని జయిద్దాం విజయం సాధిద్దాం
ఒత్తిడి దీన్నే మనం Stress అని కూడా అంటుంటాం. వేగంగా మారుతున్న నేటి సామాజిక ప్రభావం వలన ఈ ఒత్తిడి లేని వారు రాని వారు లేరంటే అతిశయోక్తి లేదు. అ ఆ లు చదివే (క్షమించాలి ABCD) పిల్లలనుండి ఆఫీసుకు పరుగులెత్తె పెద్దలు మరియు జీవన సమరంలో అలసి సొలసిన వృద్ధుల వరకు ఈ ఒత్తిడి నుండి మినహాయింపు లేకపోగా, నేటి సమాజంలో ఇది ఒక మానసిక రుగ్మతగా మారి మనిషి మానసిక శారీరక ఆరోగ్యాలపై సవాలు చేస్తోంది! మానవ జీవనశైలిలోనే అనేకానేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి! దాని ఫలితమే దినదినాభి వృధ్ధిగా పెరుగుతున్నాయి ఈ ఒత్తిళ్లు.వృత్తిగా చేసే పనులకు వ్యక్తిగా చేసే పనులు మధ్య సామరస్యం లేకపోవటం ఒకటైతే, వ్యక్తిగా పెంచుకున్న, పెరుగుతున్న అవసరాలు కూడా ఈ ఒత్తిడికి దోహద పడుతున్నాయి.
ప్రతిదినం చేయవలసిన పనుల పరుగులో అందుకోవాల్సిన బస్సు మొదలు ట్రాఫిక్ జాములతో చేరవలసిన చోటుకు చేరేవరకు సాగే ఈ ఉద్వేగంలో మనసు ఒత్తిడికి గురి అవుతూ మనిషి శారీ