నిశ్శబ్ద ఘోష
-G.S.S. కళ్యాణి
"ఒరేయ్ శంకరం! నాకు 'క్షేమంకరి' సంస్థలో ఉద్యోగం వచ్చిందిరా! వాళ్ళు నెలనెలా నాకు బోలెడు జీతం ఇస్తారట! నిన్ను నేనిక రాజాలా చూసుకుంటానురా! నీకు కావలసినవన్నీ కొనిపెడతా! నిన్ను బాగా చదివిస్తాను కూడా!", అంటూ తన పదేళ్ల మనవడు శంకరాన్ని ముద్దు పెట్టుకున్నాడు ధర్మయ్య.
"తాతా! మరి రేపటినుండి మన పొలంలో పనులెవరు చేస్తారూ??", అమాయకంగా అడిగాడు శంకరం.
"నాకు ఇప్పుడు వ్యవసాయం చేసేందుకు ఓపిక సరిపోవట్లేదురా! అందుకే వ్యవసాయం వదిలి ఉద్యోగంలో చేరిపోయాను! ఆ పొలంలో కొంత భాగంలో మనం పెద్ద ఇల్లు కట్టుకుందాం. మిగతాది నువ్వు ఆడుకునేందుకు ఉయ్యాల, జారుడుబండాలాంటి ఆటవస్తువులతో నింపేద్దాం! సరేనా?", శంకరం కళ్ళల్లో కళ్ళుపెట్టి చూస్తూ అడిగాడు ధర్మయ్య.
"ఆయ్! భలే! భలే! అప్పుడు నేను రోజంతా ఎంచక్కా ఆడుకోవచ్చు!", ఆనందంతో చప్పట్లు చరుస్తూ అన్నాడు శంకరం.
"నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలిరా!", అంటూ శంకరాన్ని గట్టి