Author: Sujanaranjani
ఎవరవయా నీవెవరవయా?
-డా.బి.బాలకృష్ణ
నిలకడ నేర్వని నా నడకలకు జీవితమింకా సుదూరంగానే తోస్తున్నది
నరాల దారులలో ధారలుధారలుగా ప్రవహిస్తున్న చైతన్యం
తన మూలాలను వెతుక్కుంటున్నది
తల్లికడుపులో, చీకటిలో, చీమూనెత్తురుల అశుద్ధంలో
అణువుగానో, పరమాణువుగానో ప్రవేశించి
రక్తపు బంతినై, మాంసపు ముద్దనై ఎదుగుతున్నప్పుడు
ఎక్కడినుండో ఓ కదలిక
నా అస్తిత్వానికి ఊపిరూలుదుతుంది
మూసలో దాచబడిన ఈ జీవం
తరతరలా ఆలోచనలకు తెరతీస్తుంది
నేను ఎవరు? నా గమ్యమేమిటి?
నా అస్తిత్వమెక్కడిది?ఇప్పుడున్న స్పృహ ఏనాటిది?
ఉలి, శిలను తొలిచినట్లు ఏవేవో ప్రశ్నలు
నన్ను తొలుస్తూనే ఉంటాయి
సంద్రంలో ఎగసిన అల విసురుగా
తీరాన్ని తాకి, వెనుతిరిగినట్టు
అడుగంటిన నీటిబొట్టు ఆవిరై గాలిలో కలసినట్టు
ఎందుకో పుట్టి, ఎందుకో గిట్టి
ఉన్నన్నినాళ్ళు ఏదేదో వెలగబెట్టి
అన్నీ నావనుకొని, అన్నింటినీ వదిలేసి
రిక్త హస్తాలతో ఏ శూన్యాలకో సాగే పయనంలో
ఒక్కోసారి నిన్ను గుర్తు చ
తోడు-నీడ వారికి వారే!
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు
నాన్నలేని అమ్మ ఎక్కడుంది ....ఆలోచించి చూస్తే!
అమ్మలేని నాన్న ఎక్కడున్నారు....అవలోకించి చూస్తే!
లేచినవెంటనే మంగళసూత్రాలను కళ్ళకద్దుకొంటూ అమ్మ,
అమ్మకళ్ళను సూత్రాలనుంచే చుంబిస్తూ నాన్న,
తనుకలిపిన మొదటికప్పు కాఫీని అందిస్తూఅమ్మ,
బెడ్ కాఫీని చిరునవ్వుతో అందుకుంటూ నాన్న!
అమ్మ స్నానంచేసి వచ్చేసరికి పువ్వులు కోసిఉంచిన నాన్న,
నాన్నకోసిన పువ్వులతో పూజమొదలెడుతూ అమ్మ!
అమ్మ పూజముగించుకొనివచ్చి టిఫిన్ ఇచ్చేసరికి
అమ్మ వంటకు కావాల్సిన కూరగాయలు కొనితెచ్చి,
సమయానికి అమ్మకు అందించే నాన్న!
అమ్మ అడగకుండానే పిల్లలకు కావలసినవి కొనిపెట్టమంటూ
అమ్మచేతిలో డబ్బుంచిమరీ ఆఫీసు కు వెళ్ళేనాన్న!
వస్తున్నప్పుడు ఏంతేవాలంటూ ప్రేమగా
మధ్యలోఒకసారి అమ్మకు ఫోన్చేసే నాన్న!
పిల్లల్ని అలాతిప్పివద్దాం పదండి అంటూఅమ్మ,
మారు మాట్లాడకుండా,విసుక్కోకుండా,
వచ్చినవెంటనే షికారుకు తీసుకొనివెళ్
జోస్యం
- ఆర్. శర్మ దంతుర్తి
జ్యోతిషం చెప్పే వాడికి పేరు రావాలంటే మార్గం ఆయన చెప్పేవి నిజం అవుతున్నాయని వ్యాప్తి చేయడం. ఆ వ్యాప్తికి ఉన్న అనేకానేక పద్ధతుల్లో జనా లు ఒకరి కొకరు చెప్పుకోవడం, లేకపోతే అదృష్టం ఉంటే పత్రికల్లోనో పేపర్లలోనో వార, నెల వారీగా రాశి ఫలితాలు రాయడమో అనేవన్నీ ఒకప్పటి మాట. హై టెక్ యుగానికి ఇవన్నీ అక్కర్లేదు. ఓ బ్లాగో, వెబ్ సైటో మొదలుపెట్టి అంతర్జాలం మీదో ఫేసు బుక్కులోనో వదిల్తే చాలు. గొర్రెల్లాంటి జనం పొలోమంటూ వచ్చి పడతారు.
అదిగో అలాగే అప్పారావు పండిట్ గానూ, దైవజ్ఞుడిగానూ మారిపోయేడు బ్లాగు మొదలుపెట్టి. ఇందులో ఆయన పోస్టుచేసేవి వరుసగా జరుగుతూ ఉండడంతో అప్పారావుని 'గురువుగారూ’ అని పిలిచే అభిమాన సంఘం ఒకటి మొదలైంది. ప్రతీ పోస్టుకీ 'ఆహా ఓహో' లనడం, బాజా భజంత్రీలు వాయించడం, లైకులు కొట్టడం వీళ్ల పని.
అప్పారావు మొదటి జోస్యం - మార్చ్ నెలలో రాబోయే అమావశ్య కి జనం చావడం – ఎక్కడో కాదు కానీ దే
ఆధునిక కవిత్వంలో అనుభూతి వాదం
పాండవులు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు కుంతీదేవి ద్రౌపదిని చూసి సహదేవుని విషయమై
“కాదు(బ సిబిడ్డ వీ(డొకటి గాదవునా నేఱు(గండు ముందరె
య్యెడ నొక పాటేఱుంగ(డెద యెంతయు(గోమల మెప్పుడైన నే(
గుడువ(గ బిల్తు(గాని తనకుం గల యా(కటి ప్రొద్దేఱుంగ(డీ
కొడుకిటు పోకకున్ మనము గుందెడు ని గని యూఱడిల్లెడున్"
ఈ పద్యంలో తనకు సహదేవుని పట్లగల వాత్సల్యాతిశయాన్ని హృదయద్రవీకరణంగా ద్రౌపదికి కుంతీదేవి తెలపటం కన్పిస్తుంది.
భాగవతాన్ని రచించిన పోతన్నగారి కవిత్వం అంతా రసార్ణవమే.
"నల్లనివా(డు పద్మనయనంబుల వా(డు కృపారసంబు పై(
జల్లెడు వా(డుమౌళి పరిసర్పిత పింఛమువా(డు నవ్వురా
జిల్లెడు మోమువా(డొక(డు చెల్వల మానధనంబు దెచ్చెనో
మల్లియలార! మీ పొదలమాటున లే(డు గదమ్మ! చెప్పరే"
ఈ పద్యం మనోహరమైన అనుభూతులతో నిండిన పద్యం. ఈ మహాకావ్యాలన్నీ అనుభూతికి ఉదాహరణలే అయినా, స్థాలీపులాక న్యాయంగా నేను ఈ ఉదాహరణలను ఇస్తున్నాను.
ప్రబంధయుగంలో ప్రథమ ప్రఖ
దిగ్విజయంగా ముగిసిన 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు
దిగ్విజయంగా ముగిసిన 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు & మొట్టమొదటి అమెరికా మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం….సమగ్ర నివేదిక
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) సంయుక్త నిర్వహణలో అమెరికా రాజధాని వాషింగ్టన్ DC లో ..సెప్టెంబర్ 23-24, 2017 లలో జరిగిన 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు అఖండ విజయం సాధించింది. ఒకరా, ఇద్దరా....154 మంది ప్రతినిధులు రెండు రోజులలో సుమారు 15 గంటల సేపు తెలుగు భాష సాహిత్యానందంతో జేవిత కాలం గుర్తుంచుకునే అనుభూతి పొందారు. భారత దేశ నుంచి వచ్చిన పది మంది సాహితీవేత్తలు, అమెరికాలో అనేక నగరాల నుంచి వచ్చిన సుమారు 30 మంది అమెరికా తెలుగు రచయితలు, 30 మంది స్థానిక తెలుగు ఉపాధ్యాయులు, ఇతర భాషా ప్రియులు, సాహిత్యాభిమానులతో సభా ప్రాంగణం కళ కళ లాడింది.
ముందుగా సుధారాణి కుండపు, కె. గీత మరొక గాయని ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ వేయగా సుప్రసిద్ధ అమెరిక
తెలుగు సాంస్కృతికోత్సవం 2017
అక్టోబర్ 7న న్యూజెర్సీ నగరంలో విజయవంతంగా జరిగిన తెలుగు సాంస్కృతికోత్సవం పై ఒక ప్రేక్షకుడి అనుభూతి:
నూట నలభై అక్షరాల్లో సంభాషణలు; మూడు నిమిషాల కంటే ఎక్కువగ దేని పైన దృష్టి పెట్టడం కష్టంగా వున్న ఈ రోజుల్లో; WhatsApp ఫార్వర్డ్లు; ఫేస్ బుక్ లైక్ ల మధ్య, అతి వేగంగా గడిచి పోతున్న కాలం ఇది. నిలకడగా వుండి, ఏ ఆర్భాటం లేకుండ, ఏ సెన్సేషన్ లేకుండ కేవలం మన సంస్కృతి,సాంప్రదాయం మరియు చరిత్ర ను గుర్తించి, గౌరవించాలన్న ఒకే ఒక ఉద్ధేశంతో ఒక కార్యక్రమం చెయ్యాలనుకోవడం గొప్ప ఆలోచన.
ఆలోచన గొప్పగ వుంటే సరిపోదుకదా. దానిని అంతే గొప్పగా అమలుపర్చాలి. అందులోను, ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేయాలి. అసలు ఇది సాధ్యమా?
ఇలాంటి సాహసమే నిన్న సిలికాన్ ఆంధ్ర మనబడి వారు చేశారు, చేసి గెలిచారు, గెలిచి మెప్పించారు.
ఆరు గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమంలో, జానపద గేయాలు, నృత్యాలు, మన పండగలైన ఉగాది నుండి ముస్లింలు జరపుకునే మొహ
పాపం! పిల్లలు
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు
అభం శుభం తెలియని పిల్లలను,
కేర్ టేకర్స్ కు అప్పజెప్తున్నారు.
దినదినగండంగా ఆ పిల్లలు,
డే కేర్ సెంటర్ లో గడుపుతున్నారు.
అర్ధమే తప్ప ఆత్మీయత పట్టని మనస్తత్వంతో,
చదువేతప్ప సంస్కారం మనసుతలుపు తట్టని అజ్ఞానంతో
ఈ కేర్ టేకర్స్,
అమాయకత్వమేతప్ప వేరేదీ తెలియనిపిల్లలను,
సంపాదనకోసం తల్లితండ్రులుపడే అత్యాశకి
బలవటమేతప్ప వేరేమీచేయలేని బేలలను,
తమదైన అజ్ఞానంతోఆడిస్తున్నారు,
లాల్యాన్ని పొందాల్సిన వారిబాల్యాన్ని
తమదైన నిర్లక్ష్యంతో ఓడిస్తున్నారు.
బేర్ మంటూ ఈ పసిపిల్లలు పాపం
కేర్ సెంటర్ లలో గడుపుతున్నారు.
తల్లితండ్రుల బుద్ధిలేనితనాన్ని ఆసరాగా చేసుకొని
ఈబేబీ కేర్ సెంటర్ లను నడుపుతున్నారు.
ఇది మదుపులేని వ్యాపారమని,
ఇది అదుపులేని వ్యవహారమని తెలిసినా,
పసిపిల్లల బాల్యం నుసిఅవుతున్నా,
ఎవరూ పట్టించుకోవటం లేదు,
ఈ డే కేర్ సెంటర్ల ఆట కట్టించాలనుకోవటం లేదు,
ఈ పసి ప
సంగీత పాఠాలు- (నాలుగవ భాగం)
సేకరణ: డా.కోదాటి సాంబయ్య
గీతములలోని స్వరములు సరళంగా ఉండి, ఎక్కువ దాటు స్వరములు గానీ, క్లిష్టమైన సంచారములు గానీ లేకుండా విద్యార్థి తేలిగ్గా పాడడానికి వీలుగా ఉంటాయి.
ఉదా: మలహరి రాగం లోని శ్రీ గణనాధ గీతములో పల్లవి చూడండి.
మ ప | ద స స రి || రి స | ద ప మ ప ||
రి మ | ప ద మ ప || ద ప | మ గ రి స ||
శుద్ధ మధ్యమం సరళీ, జంట, వరుసలు, అలంకారములలో ఇదివరకే పాడడం అలవాటు అయింది కనుక ...ఈ గీతం మంగళకరమైన శుద్ధ మధ్యమం తో ప్రారంభించబడి
వెంటనే పక్క స్వరమైన పంచమం తో ద్రుతం ముగుస్తుంది. ఇక లఘువులో దైవతం తో ప్రారంభించి పై షడ్జమం. పై రిషభం తో ముగుస్తుంది . తాళములలో రూపక తాళం
సరళంగా ఉంటుంది. మొదటి ఆవృత్తం తో ఆరోహణ అయింది. ఆరోహణ లో కూడా మొదటి ఆవృత్తం లోని స్వరాలే వచ్చాయి. పల్లవి రెండో లైన్ రిషభం తో మొదలై
మధ్యమం, పంచమం, దైవతం వరకు వెళ్లి మళ్ళీ మధ్యమం పంచమం కు అవరోహణ మై రెండవ ఆవృత్తం లఘువులో గాంధారం తో కలిసి మ గ
అమెరికాలో యోగీశ్వరుడు – చివరి భాగం
-ఆర్. శర్మ దంతుర్తి
(జరిగిన కధ – పరమహంస గారి రెండో అమెరికా ట్రిప్పులో ఓ సర్జన్ గారింట్లో ఆయనకి పాదపూజ ఏర్పాటు చేయబడింది. ఆ పూజ తాలూకు ఫోటోలు సుబ్బారావు ఎప్పటిలాగానే ఎవరి అనుమతులూ అడక్కుండా తన వెబ్ సైట్లో పెట్టేసేడు. అయితే ఎవరికీ తెలియని మూడో పార్టీ, ఆ వెబ్ సైట్లో ఫోటోలు చూసి సర్జన్ గారింట్లో పకడ్బందీగా దొంగతనానికి పూనుకుంది. ఇంట్లో సమస్తం దోచుకోబడ్డాక సర్జన్ గారూ వాళ్ళావిడా లెంపలు వేసుకుని సుబ్బారావు శిష్యరికంలోంచి బయటపడ్డారు. దొంగతనం కేసులో జరిగినది విన్నాక పోలీసులు పరమహంస గారి వెబ్ సైటుని ఒక కంట కనిపెడుతున్నారు. సర్జన్ ని వదిలేసి మిగతా శిష్యగణం పరమహంసగారితోపాటు ఓ రిట్రీటు కి మిషిగన్ రాష్ట్రంలో “గాంగెస్” అనే ఊరికి వెళ్ళడానికి సమాయుత్తమౌతున్నారు. ఇంక చదవండి)
రోజులు గడిచి రిట్రీటుకి మరో రెండు, మూడు గంటల్లో బయల్దేరుతారనగా సుబ్బారావుకి ఆ రోజు తనింకా రోజూ వెళ్ళే వాకింగ్ కు వెళ్ళలేదని అర్జెంట