Author: Sujanaranjani
భక్తి వ్యసనంగా మారకూడదు!
(కార్టూన్ సౌజన్యం --మిత్రుడు శ్రీ రామకృష్ణ గారు)
-శారదాప్రసాద్(టీవీయస్.శాస్త్రి)
నాకొక మిత్రుడున్నాడు.నా కన్నా వయసులో చాలా చిన్నవాడే!24 గంటలూ భక్తి టీవీ చూస్తుంటాడు.అన్ని భక్తి కార్యక్రమాలకు వెళ్లుతాడు. వివిధ యాత్రాస్ధలాలు చూస్తుంటాడు. కుటుంబం కోసం కన్నా ఎక్కువ కాలాన్ని భక్తి కార్యక్రమాలకు కేటాయిస్తాడు. అడ్డూ, అదుపు లేకుండా ధనాన్ని భక్తి కార్యక్రమాలకోసమే విపరీతంగా ఖర్చు చేస్తాడు.ఎన్నో గ్రంధాలను కొంటాడు.నిజానికి అతనొక మధ్యతరగతి కుటుంబీకుడు. పైకి రావలసిన పిల్లలున్నారు.కుటుంబ బాధ్యతలను సరిగా నిర్వహించలేక పోతున్నాడేమోననిపిస్తుంది!ఒక్కొక్కసారి తాదాత్మ్యం చెంది ,"నాకు శివుడిలో లీనం కావాలనిపిస్తుందని అంటాడు!శివైక్యం చెందని జీవితం వృధా" అని అంటాడు. నిజం చెబితే బాధపడుతారేమో కానీ ఇవన్నీ histrionic లక్షణాలు. సాధారణంగా ఈ లక్షణాలు ఆడవారిలో ఎక్కువగా ఉంటాయి. దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు కూడా చాలామంది
అన్నమయ్యకు ఆరాధనా నివాళి
- దీప్తి కోడూరు
భగవంతుని గుణకీర్తనం చేసి తరించిన భక్తులు ఎందరో మన దేశంలో ఉద్భవించారు. వీరినే భక్త కవులంటారు. భక్త కవుల గురించి సుదీర్ఘ వివరణలు చెప్పుకునేకంటే ఒక్క సంఘటనను స్మరిస్తే వారి అంతరంగం స్పష్టమవుతుంది.
ఒకనాడు ఒక భక్తురాలు భగవాన్ శ్రీ రమణ మహర్షి వద్ద ఇలా అడిగింది,"నాయనా త్యాగయ్య అన్నమయ్య రామదాసు వీరంతా గానం చేసి తరించారు కదా! అది అందరికీ సాధ్యమవుతుందా?" అని. దానికి మహర్షి చిన్న చిరునవ్వుతో ఇలా జవాబిచ్చారు, "అమ్మా వారంతా గానంతో తరించలేదే, తరించాకే ఆ అనుభవాన్ని గానం చేశారు. "
ఒక మహాత్ముని అంతరంగాన్ని ఇంకొక మహాత్ముడు తప్ప సామాన్యులు ఎలా అర్ధం చేసుకోగలరు?!!
మీరాబాయి, గోదాదేవి, అక్కమహాదేవి, అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, పురందరదాసు, తులసీదాసు, కబీరుదాసు, నామదేవుడు, రామానందుడు, సూరదాసు, బసవన్న, అల్లమప్రభువు, రవి దాసు, తుకారాం , చైతన్య ప్రభు చెప్పుకుంటూ పోతే మన దేశంలో మహానుభావులు ఉదయించ
అనుభూతి – ప్రాచీన దృక్పథం (5వ- భాగం)
– సునీల పావులూరు
వ.క్ర.
ప్రవృత్తి
కోశం
అనుభూతి
1
ఇంద్రియచైతన్య ప్రవృత్తి
అన్నమయకోశం
వాస్తవికానుభూతి
2
భావచైతన్య ప్రవృత్తి
మనోమయకోశం
కాల్పనికానుభూతి
3
జ్ఞానచైతన్య ప్రవృత్తి
విజ్ఞానమయకోశం
జ్ఞానానుభూతి
4
జీవచైతన్య ప్రవృత్తి
ప్రాణమయకోశం
పూర్ణచైతన్యాంశం
5
ఆధ్యాత్మికచైతన్య ప్రవృత్తి
ఆనందమయకోశం
తాత్త్వికానుభూతి
“ఈ అయిదు కోశాలద్వారా పొందే అనుభవం సమాజంలో ఉంది. దానితో సహజీవనం చేయటం సామాజిక జీవితం; ఆ సహజీవనంలో వ్యక్తి సహజ ప్రవృత్తికి శక్తిగా వ్యక్తమౌతాడు. సామాజికానుభూతిని రికార్డుచేసే సాత్త్వికసాధనం మనిషి. రికార్డుచేసి ఊరుకుంటే సామాజికుడు. దాన్నే ఉద్దీపనం చ్బెసి సాహిత్యరూపంగా అభివ్యక్తీకరిస్తే రచయిత. సమాజంలో భుక్తమౌతున్న అనుభ
కవివరేణ్యుడు, సాహితీ దురంధరుడు – సినారే
- తాటిపాముల మృత్యుంజయుడు
కవిత్వమంటే
కర్రుమొనలోంచి మట్టి పలికినట్టుండాలి
చెమట ఆవిరిలోంచి మబ్బుపట్టినట్టే ఉండాలి
కరీం నగర్ జిల్లా హనుమాజీపేట వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె) తన కవిత్వంలో కూడ మట్టి వాసనను ఆఘ్రాణించాడు. పాఠశాల విద్యాభ్యాసం ఉర్దూ మీడియంలో జరిగిన సినారె కు చిన్నప్పుడు ఊళ్ళో జరిగే హరికథలు, ఒగ్గుకథలు విని, ప్రదర్శనలు చూసి తెలుగుభాష మధురిమలకు ఆకర్షితుడైనాడు.
రాస్తూ రాస్తూ పోతాను
సిరా ఇంకే వరకు
పోతూపోతూ రాస్తాను
వసుపు వాడే వరకు
అంటూ కవిత్వమే తన ఊపిరిగా చేసుకొని చివరి క్షణం వరకు బతికాడు.
గురువులు, ఆచార్యులు ఖండవల్లి లక్ష్మీరంజనం, దివాకర్ల వెంకటావధాని వంటి దిగ్గజాల మెప్పు పొంది, పాఠాలు, పరిశోధనలచే అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చి, గేయాలు, గజళ్ళు, గ్రంథాలు రాసి పాఠకుల అభిమానాన్ని చూరగొని, పాటలతో ప్రేక్షకలోక అభిమానాన్ని సంపాదించి, రాష్ట్ర,
శుభ తిథులు – శుభ కార్యాలు
-(డాǁ. దోముడాల ప్రమోద్, సంసకృతి సమితి, అలమాస్ గూడ, హైదరాబాద్ )
శుభ తిథులు,శుభ తిథులు, వేద పురాణాలశుభ తిథులు |
శుభ కార్యాలు శుభ కార్యాలు , వేద శాస్తారాలమ శుభ కార్యాలు.ǁ
గురువులను పూజించే పౌర్ణిమ, గూరు పౌర్ణిమ , గూరు పౌర్ణిమ|
యుగారంభమైన పాడామి, యుగాది, యుగాది|
యమునాతో భుజిoచిన యమ ద్వితీయ బహు బిజ౬,బహు బిజ౬|
అభివృద్ధి పొoదే తృతీయ, అక్షయ తృతీయ, అక్షయ తృతీయǁ
శుభ తిథులు,శుభ తిథులు|
శుభ కార్యాలు శుభ కార్యాలు ǁ
విఘ్న విమోచన చవతి, వినాయక చవతి, వినాయక చవతి|
వస౦తాలనుపంచె పంచమి, వసంత పంచమి ,వసంత పంచమి|
సుబ్రహ్మణ్యుని పూజించే షష్ట్టి, స్కంద షష్ట్టి, స్కంద షష్ట్టి|
సప్త కిరణాలు పొయే సప్తమి, రథ సప్తమి, రథ సప్తమి ǁ
శుభ తిథులు,శుభ తిథులు|
శుభ కార్యాలు శుభ కార్యాలు|
శ్రీ కృష్ణుడు, జన్మా౦ఛిన అషటిమి, జన్మాష్టమి జన్మాష్టమి|
శ్రీ రాముడు అవతరించిన నవమి , శ్రీ రామ నవమి, శ్రీ రామ నవమి|
విజయమలు లభి౦
బాటసారిని
-శిష్ట్లా. వి.యల్.యన్.శర్మ
నేనొక బాటసారిని
ఈ అనంత విశ్వంలో
నా వంతు పాత్ర పోషిస్తున్న నటుణ్ణి!
జీవన వేద వాదానికి
నాదమై ప్రభవిస్తున్న ప్రాణిని!
తిరోగమన పురోగమనాలలో
మునకలు వేస్తున్న అనుభూతిని!
రాగద్వేషాల రంగుల తెరపై
ఆలపిస్తున్న జీవన స్వరాన్ని!
తరాల స్వరాల నదుల అలలపై
సాగిపోతున్న పడవను!
విశ్వం అంచులు చూడాలని
అంతరిక్షాన్ని అందుకోవాలనీ
అనుక్షణం తపిస్తున్న ఆశావహుణ్ణి!
వాదాల కతీతమైన జ్ఞానమేదో
మేధస్సుతో మథిస్తున్న తాత్వికుణ్ణి!
స్వాప్నిక ప్రపంచంలో
స్నానం చేసే ఊహల వికాసాన్ని!
కర్త కర్మ క్రియల రూపాన్నై
వర్తమాన జగత్తును నడుపుతున్న మానవుణ్ణి!
నేనొక బాటసారిని!
అహం
-నసీమ షైక్
మనుషులను విడదీస్తుంది ,మనసులను దూరంచేస్తుంది,మమతలను
మసిచేస్తుంది,మంచిచెడుల తారతమ్యాలు మరిపిస్తుంది....
నీ....నా.....అంటూ తేడాలు చూపుతుంది,నేను...నాకు...అంటూ ముందుకు
సాగుతుంది,ఓటమిని అంగీకరించనివ్వదు,గెలుపును నిలబడనివ్వదు....
తెలియనిది తెలుసుకోనివ్వదు,తెలిసింది తెలుపనివ్వదు,తప్పును
ఒప్పుకోనివ్వదు,తప్పిదాన్ని మన్నించనివ్వదు ......
అన్నింటికి మూలకారణం అహమే....!!అహాన్ని జయించిన జీవితం ఆదర్శప్రాయమే.....!!!!
తండ్రి
-అన్నసముద్రం శ్రీదేవి
చిట్టి వేలితో గుట్ట నెట్లాఎత్తావయ్యా అన్నా
మిమ్మల్ని పైకి తెచ్చిన మీ తండ్రి నడగమన్నాడు
గురితప్పని రామబాణం రహస్య మేమిటన్నా
మీ లక్ష్య సాధనలో విలుకాడు నడగమన్నాడు
గండ్ర గొడ్డలిలోని గొప్పేమిటన్నా
తండ్రి తోడు గ ఉంటే తెలియదన్నాడు
కాళింది పైన ఆ తాండవమేమిటి అన్నా
కష్టాల తోటి నాన్న దోస్తీ చూడమన్నాడు
సారథి గా నీవిచ్చిన సారమేమిటన్నాను
నీ జనకుని మాటలను నెమరువేయమన్నాడు
అంత గొప్ప తనముందా నాన్న లోన అన్నాను
అన్ని ప్రశ్నలకు అయ్యే నా బదులన్నా
అయ్య మాటతో నే అట అయ్యాడొక దైవంగా
అయ్యొ మరి నేనే కద నా బదులుగ పంపాను
అన్ని అవతారాల అంశ అందున కలదన్నాడు
(Happy Fathers Day)
చిన్న నాటి గురుతులు
-భువనగిరి ఫ్రసాద్
స్వర్గాని నేలకు దించి చేతి కందిస్తానంటే వద్దు పొమ్మన్నాను!
భువిలోని సంపదలన్నీ ఓ పెద్ద మూటగా కట్టి
పెరడులో పెడతా నంటె కాదుపోమన్నాను!!
నీకు చేతనైతే చిననాటి బాల్యం తెచ్చి చిందులేసి అడ మన్న!
వాననీటి గుంటల్లో గంతులేసిన జ్ఞాపకాలూ,
కాగితపు పడవలతో మురికి నీటి పోటీలు,
సంకురాత్రి సందెల్లోఎగరేసిన గాలిపటాలు,
హరిదాసుల జోలేల్లో బిచమేసి చిట్టి చేతులు, స్వర్గాని నేలకు దించి!!
గుడి గోపురం పైకెకి పావురాలను తరిమిన రోజులు,
ఊరచేరువు మధ్యలో ఈది తెచిన కలువ పూలు,
చవితి పొద్దున్న తిట్లకోసం విసేరేసిన పల్లేరు కాయలు,
తిరిగిరాని జ్ఞాపకాలు, మరిచిపోని గురుతులు, స్వర్గాని నేలకు దించి!!