శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ
ఇంద్రజిత్ సంహారం
ఈ విధంగా వాళ్ళు ఎన్నో ప్రభావమహితాలైన దేవతాస్త్రాలతో పోరాడారు. ఇట్లా ఎడతెగని పోరు సలుపుతూ ఉండగా లక్ష్మణుడు ఒక తీవ్రాతితీవ్ర శరాన్ని ఇంద్రాస్త్రంతో అభిమంత్రించి -
ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథి ర్యది,
పౌరుషే చాప్రతిద్వంద్వః శరైనం జహి రావణిమ్ (యుద్ధ 01.72)
“ఓ బాణమా! దశరథమహారాజు పెద్దకొడుకు శ్రీరాముడు ధర్మాత్ముడూ, సత్యసంధుడూ, అవక్రవిక్రమపరాక్రముడూ అయితే, నీవు ఇంద్రజిత్తును తక్షణం వధించాలి'’ అని అంటూ ప్రయోగించాడు.
అప్పుడా బాణం వెళ్ళి ఇంద్రజిత్తు తలను ఖండించింది. ఆకాశంలో దేవతలు, మహర్షులు, గంధర్వులు హర్షధ్వానాలు చేశారు. లక్ష్మణుణ్ణి వానర యోధులు ఆలింగనం చేసుకొని అభినందించారు. అప్పుడిక లక్ష్మణుడు-జాంబవంతుడు, హనుమంతుడు, విభీషణుడు పక్కన తనకు ఊతమిస్తుండగా శ్రీరాముణ్ణి దర్శించటానికి వెళ్ళాడు. శ్రీరాముడు, లకష్మణుడి శిరసు నాఘ్రాణించి సంబరంతో కౌగిలించుకున్నాడు. ఇక రావణుడు య