Author: Sujanaranjani

నాన్నకే!

కవితా స్రవంతి
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు. రక్త పోటు,ఆటుపోటు నాన్నకే! గుండెపోటు,వెన్నుపోటు నాన్నకే! భంగపాటు,భ్రమల ఓటు నాన్నకే! ఉలిక్కిపాటు,నిద్ర చేటు నాన్నకే! విచారపు కాటు,వినోదపులోటు నాన్నకే! సమస్యలలో తడబాటు,నగుబాటు నాన్నకే! మధుమేహం,సంతానంపై మోహం నాన్నకే! అష్టకష్టాలు,నియమితిలేని నష్టాలు నాన్నకే! పలవరింతలు,వెక్కిరింతలు నాన్నకే! ఆలోచన,ఆవేదన నాన్నకే! ఒంటరితనం,ఓరిమిగుణం నాన్నకే!

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
అష్టవిధ నాయికలు - స్వాధీనపతిక -టేకుమళ్ళ వెంకటప్పయ్య అష్టవిధ నాయికల గురించిన ప్రస్తావన మొట్టమొదట క్రీ.పూ.2వ శతాబ్దంలో భరతముని సంస్కృతంలో రచించిన నాట్య శాస్త్రంలో పేర్కొనబడినది. 16వ శతాబ్దిలో జీవించిన కందుకూరి రుద్రకవి అష్టవిధ నాయికలను వర్ణిస్తూ జనార్ధనాష్టకం రచించాడు. అష్టవిధ నాయికలు కేవలం రచనల్లోనే కాక చిత్రకళ, శిల్పకళ మరియు శాస్త్రీయ నృత్య సాంప్రదాయాలలో తెలుపబడ్డాయి. మధ్యయుగపు చిత్రకళాఖండాలైన రాగమాల చిత్రాలు అష్టవిధ నాయికలను ప్రముఖంగా చిత్రించాయి. అన్నమయ్య రచించిన శృంగార కీర్తనల్లో ఈ నాయికల విశేష వర్ణన ఉంది. అన్నమయ్యకు ఈ ప్రేరణ వైష్ణవ భక్తి నుండి సంక్రమించినదని భావించవచ్చు. అన్నమయ్య శ్రీవైష్ణవ వేదాంత పద్ధతి ననుసరించి, శ్రీవైష్ణవ మతమునకు చెందిన పండ్రెండుమంది ఆళ్వార్ల యొక్క "నాలాయిర దివ్య ప్రబంధము"లో నున్న నాయికా భావనకు అగ్రస్థానం ఇవ్వడం జరిగింది. గురువుల యొద్ద నేర్చిన వేదాంతము, ఆళ్వారుల

జరిమానా !

కబుర్లు
-కస్తూరి ఫణిమాధవ్ తను నన్నే చూస్తోంది ఎటు పోయినా చూస్తునే ఉంది హద్దు మీరుతానేమోనని ఎదురు చూస్తోంది నేను ఎటో చూస్తున్నా తను ఓరకంటితో గమనిస్తూనే ఉంది గీత దాటబోతే తన కన్నుల్లో బంధించేసింది ప్రేమ లేఖ సంధించేసింది హద్దు దాటినందుకు ముద్దుగా జరిమానా వేసేసింది . . . . . . సిగ్నల్స్ దగ్గరి పాడు సీ సీ కెమెరా..

నరసింహ సుభాషితం

శీర్షికలు
- ఓరుగంటి వేఙ్కట లక్ష్మీ నరసింహ మూర్తి పరోపకారం - 1 శ్లోకం: परोपकाराय फलन्ति र्वुक्षाः  परोपकाराय वहन्ति नद्यः । परोपकाराय दुहन्ति गावः  परोपकारार्धमिदं शरीरम्  ।। పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి నద్యః । పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్థమిదం శరీరమ్ ॥ సంధి విగ్రహం పరోపకారాయ, ఫలన్తి, వృక్షాః, పరః, ఉపకారాయ, వహన్తి, నద్యః, పరః, ఉపకారాయ, దుహన్తి, గావః, పరోపకార, అర్థం, ఇదం, శరీరం, పరోపకారార్థమిదం శరీరమ్. శబ్దార్థం పరోపకారాయ = పరుల ఉపయోగార్థం, వృక్షాః = చెట్లు, ఫలన్తి = పండ్లని కాస్తున్నాయి, నద్యః = నదులు, వహన్తి = ప్రవహిస్తున్నాయి, గావః = ఆవులు, దుహన్తి = పాలని ఇస్తున్నాయి, పరోపకారార్థం = పరుల ఉపయోగం కొరకై, ఇదమ్ శరీరమ్ = ఈ శరీరం ఉద్దేశింపబడినది. Meaning Trees give fruits to help satisfy the hunger of humans. Rivers flow to quench the thirst of humans.

పద్యం – హృద్యం

శీర్షికలు
నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: "చిత్ర" కవిత్వం - ఈ క్రింది ఛాయచిత్రమునకు ఒక వ్యాఖ్యను లేదా వర్ణనను మీకు నచ్చిన ఛందస్సులో పద్యరూపములో పంపాలి గతమాసం ప్రశ్న: నిర్ధిష్టాక్షరి మరియు వర్ణన: "హే", "వి", :"ళం(లం)", "బి" అనే అక్షరాలతో ఒకొక్క పాదము ప్రారంభిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో వసంత ఋతువర్ణన చేయాలి. ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి. పోచిరాజు కామేశ్వర రావు, రాయిపూర్ హేవిళంబి విలంబన మె

సిలికానాంధ్ర మనబడి దశాబ్ది వేడుకలు

మనబడి
నమస్కారం! పదేళ్ళ క్రితం, ఏప్రిల్ 2007లో, ఒక కలకి అంకురార్పణ జరిగింది. ఒక మహాయజ్ఞానికి తొలి సమిధ వెలిగింది. ఒక నలుగురి భాషాభిమానుల గుండెల్లో ఒక సంకల్పం కలిగింది. మన పిల్లలతో పాటూ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందిరి పిల్లలకీ తెలుగు నేర్పే మార్గం కావాలి అన్న ఆలోచన రేకెత్తింది. ఆ నలుగురి గుండెల అభిలాష నేడు, ఎన్నో కుటుంబాలలో,వారి వంశాలలో తెలుగు వెలుగయ్యింది. ఆ వెలుగుని పంచే కాంతిపుంజం "మనబడి" అన్న పేరుతో పదేళ్ళ క్రితం పుట్టింది. జగమంత తెలుగు కుటుంబంగా, తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తితో సాగే సిలికానాంధ్ర క్షేత్రంలో ఒక మహావృక్షానికి బీజం పడింది. అలా విరిసిన మొలకకి  పాదు కట్టి, ఎరువు పెట్టి , నీరు పెట్టి  పెంచారు, ఎందరో భాషాసైనికులు. వారి సేవానిరతికి ప్రతీకగా, ప్రతి ఏటా ఊరూరా ఈ మనబడి అనే అక్షరవృక్షాలు వెలుస్తున్నాయి.వందల కొద్దీ మనబడి కేంద్రాలు తెలుగు నందనవనాలై, తెలుగు సంస్కృతికి ప్రవాస భా
పరోపకారార్థం

పరోపకారార్థం

సుజననీయం
సంపాదకవర్గం: ప్రధాన సంపాదకులు: తాటిపాముల మృత్యుంజయుడు సంపాదక బృందం: తమిరిశ జానకి కస్తూరి ఫణిమాధవ్ -తాటిపాముల మృత్యుంజయుడు   అవసానదశలోకి అడుగిడుతున్న ఒక ముదుసలి గుంతను తవ్వుతూ ఒక చిన్నమొక్కను నాటటానికి ఎంతో కష్టపడుతున్నాడు. దారిన పోయే దానయ్యలు ఆపసోపాలు పడుతున్న ఆ వృద్ధుణ్ణి చూసి నవ్వుకొంటున్నారు. ఈ వయసులో ఇలాంటి పని చెయ్యడం అవసరమా ప్రశ్నిచుకొంటున్నారు. చివరికి ఒక దానయ్య నిలబడి 'తాత, ఎనభై ఏండ్ల వయసులో ఏమి సాధిద్దామని ఈ పని చేస్తున్నావు? మొక్క ఎప్పుడు ఎదగాలి, ఎప్పుడు నీకు పండ్లు ఇవ్వాలి. అంతా నీ భ్రమగాని ' అని పరిహసించాడు. అప్పుడు తాత ముసిముసిగా నవ్వుతూ 'ఈ మొక్క చెట్టుగా ఎదిగి నాకు పడ్లను ఇవ్వాలనే దురాశతో ఈ పని చెయ్యటం లేదు. ఏదగబోయే చెట్టూ నా మనవడికో లేదా వాని కూతురు, కొడుకుకో నీడ ఇస్తుంది. వాళ్లు పళ్ళని తింటారు. పదిమందికి పంచుతారు ' పెద్ద జ్ఞానిలా మాట్లాడాడు. పైన చెప్పుకున్న కథ

సివంగి

కథా భారతి
హాస్యరసాన్ని నీళ్లల్లా చిలకరిస్తూ వ్యంగ్యం వేళాకోళం చమత్కారం సమపాళ్ళలో కలిపి ఒక రచన వండాలనిపించింది రాజేశ్వరికి. అనుకున్నదే తడవు అందుకుంది పాత్రలా పేపరుకాయితం. అడుగులో హంసపాదు అన్నట్టుగా ఆపాత్రకి గరిట కనపడలేదు అంటే అదే పెన్ను కనపడలేదు. తొలివిఘ్నం అనుకుంటూ పుత్రరత్నం పుస్తకాల దగ్గిర ఏదో ఓపెన్ను కనపడకపోదని వాడి అలమారలో చూసింది. అది ఉంది ఒక అడవిలా. దారీ తెన్నూ లేని ఆ అడవిని ఒక్క నిమిషంలో సరి చెయ్యడం కుదరదు ఎలాగో . అందుకే ఆ పని తలపెట్టకుండా తలదూర్చి పుస్తకాల కుప్పలో వెతికింది. ఆశనిరాశ కాలేదు. దొరికింది. అమ్మయ్య అనుకుంటూ సద్దుకుని కూచుంది. ట్రింగ్ ట్రింగ్ అంటూ టెలిఫోన్ మోగింది. మలివిఘ్నం పళ్ళుకొరుక్కుంటూ లేచింది . తప్పుతుందా. రిసీవర్ చెవి దగ్గిర పెట్టుకోగానే ఎవరో ఆయన హిందీలో ఏదో అడుగుతున్నాడు. అసలే హిందీలో పండితురాలు తను. ఆయన అడిగేదాన్లో వాక్యంచివర హై హై అంటూ హైరానా పడటం తప్ప ఇంకేమీ అర