Author: Sujanaranjani
సంగీత రంజని
సిలికానాంధ్ర సంపద సంగీత విభాగం ఆచార్యులు, కర్ణాటక విద్వన్మణి డా. పద్మ సుగవనం తో ముఖాముఖీ
కీ.శే. చంద్ర గారికి సుజనరంజని నివాళి
ప్రఖ్యాత చిత్రకారుడు, కీ.శే. చంద్ర గారికి సుజనరంజని నివాళి!
కొద్ది రోజుల కాలం చేసిన చిత్రకారుడు చంద్ర గారితో సిలికానాంధ్ర సంస్థకు, సుజనరంజని మాసపత్రికకు ప్రత్యేక అనుబంధం ఉన్నది. వాటి అక్షర గుర్తింపు చిహ్నాలను (logos) తీర్చి దిద్దింది ఆ మహనీయుడే.
అలాగే, అన్నమయ్య అంటే ఇలాగుండాలి అని అన్నమయ్య ఉత్సవాల కోసం పదకవితామహుణ్ణి కో అందమైన రూపం కల్పించి ప్రపంచమంతా అందరూ ఉపయోగించుకునేలా చేసింది ఆ అపురూప శిల్పియే.
ప్రతి ఏడు వెలువడే ప్రత్యేకసంచికలలో కొన్నింటికి ముఖచిత్రం వేయటమే కాకుండా లోపలి కథలు, కవితలకి బొమ్మలు కూడా గీసారు. ఈ పనుల్లో వారితో ఫోనులో పలుసార్లు సంభాషించటం జరిగింది. వారిని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా ఆ మాటలు నెమరువేసుకుంటాను.
తెలుగు ప్రజలకు తీర్చలేని లోటు అతని మరణం.
ఓం శాంతిః
- తాటిపాముల మృత్యుంజయుడు
మనబడి – ఉగాది
సిలికానాంధ్ర మనబడి ఉగాది సందడి!
https://www.facebook.com/watch/live/?v=744735212854624&ref=watch_permalink
*******
సురవరం మొగ్గలు
అప్పటి నిజాము రాష్త్రములో సగం ప్రాతం 8 తెలుగు జిల్లాలతో విస్తరించి వుండేది. అయిననూ, తెలుగు సాహిత్యానికి తగు ప్రాధాన్యమిచ్చే తెలుగు పత్రికలు లేకుండెను. బ్రిటిష్ ఇండియాలో ఇంగ్లీషు కల్తీలాగా, నిజాం రాష్ట్రంలో తెలుగు మాట్లాడే వారి వాచకంలో కూడా ఉర్దూ సమ్మేళనం బాగా వినిపించేది. భాషయే గాక వేషధారణ యందు కూడా కల్తీ కనపడుచుండెను. సరైన ఆదరణ లేక ఆంధ్ర గ్రంథాలయములు మూసివేయబడుచుండెను. తెలుగు రైతుల పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగుగా లేకుండేను. ఇలాంటి హేయమైన జీవనస్థితిని చూసి సురవరం ప్రతాపరెడ్డి గారి మనస్సు చలించిపోయేది.
పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ఉద్యమకారుడిగా ప్రజలలో రాజకీయ, సాంఘిక చైతన్యం తీసుకు రావటానికి నిరంతరం కృషి చేసారు సురవరం. హైద్రాబాదులోని రెడ్డి హాస్టలును తీర్చిదిద్దాడు. గోలకొండ పత్రికను స్థాపించి సంపాదకీయాల ద్వారా నిజాం రాజు నిరంకుశత్వాన్ని ప్రశ్నించాడు. తెల
వీక్షణం సాహితీ గవాక్షం-104 వ సమావేశం
-వరూధిని
వీక్షణం-104 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా, అత్యంత ఆసక్తిదాయకంగా ఏప్రిల్ 11, 2021 న జరిగింది.
ఈ సమావేశంలో శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా గారు "జాషువా కవిత్వం" అనే అంశం మీద ప్రధాన ప్రసంగం చేశారు.
"సుమారు 18వ శతాబ్దం వరకు ఛందోబద్దమైన సాహిత్యమంతా దైవ స్తుతుల్లోనో, పురాణేతిహాసాల్లోనో , రాజ మందిర చరిత్రలోనో, శృంగారవర్ణనల బాహుబంధాల్లోనో చిక్కుకుపోయిదని, అక్కడక్కడా వేమన పద్యాల్లోనో, శ్రీనాథుని చాటువుల్లోనో కనిపించినా వాటిని కావ్యాలుగా పరిగణించలేం" అని అన్నారు శ్రీధర్ రెడ్డి గారు.
"సుమారు 17~18 శతాబ్దాలలో సాంఘిక, సామాజిక అంశాల పట్ల గురజాడ, కందుకూరి, విశ్వనాథ, దువ్వూరి, దాశరథి, చిలకమర్తి, జాషువా మొదలైన కవులు వ్రాయటం మొదలెట్టినా ఎక్కువమంది కవులు సాంఘిక అంశాలకు కథ, నాటక, నవలా రూపాల్ని ఎంచుకున్నారు. జాషువాగారు మాత్రం ప్రాచీన ఛందోబద్ధమైన శైలిలోనే కొనసాగించారు. జాషువా గారి రచనాశైలి ప్రాచీనం కాన
వ్యత్యాసం
-G. శ్రీ శేష కళ్యాణి.
ఇండియాలో మన తెలుగు సంప్రదాయాల మధ్య నోములూ, వ్రతాలూ, పూజలూ చేస్తూ పెరిగిన కాత్యాయనికి అమెరికాలో వైద్యుడిగా పనిచేస్తున్న గిరీష్ తో వివాహం జరిగింది. పెళ్ళైన మూడోరోజు, కాత్యాయనిని తీసుకుని అమెరికాకు వచ్చాడు గిరీష్. ఇండియాలో ట్రాఫిక్-జాంలతో నిరంతరం రద్దీగా ఉండే రోడ్లను చూసిన కళ్ళతో విశాలమైన ‘ఫ్రీ-వే’ను చూసి ఆశ్చర్యపోయింది కాత్యాయని!
కారు ఎక్కి కూర్చున్న కాసేపటికే ఇల్లు చేరేసరికి, "ఏంటండీ ఆ స్పీడూ?! గంటకు అరవై మైళ్ళ వేగంతో వెళ్లకపోతే కారును కాస్త మెల్లిగా నడపచ్చుగా?", గిరీష్ తో అంది కాత్యాయని.
"చూడు కాత్యాయనీ! ఫ్రీ-వే పైన స్పీడ్-లిమిట్ కన్నా తక్కువగా కారు నడపటం ప్రమాదకరం! అలాచేస్తే మనల్ని పోలీసు ఆపి మనకు టికెట్ ఇచ్చే అవకాశముంది!! తెలుసా?", అన్నాడు గిరీష్.
"టికెట్ అంటే?", అమాయకంగా అడిగింది కాత్యాయని.
"అంటే జరిమానా విధిస్తాడన్నమాట!", చెప్పాడు గిరీష్.
"ఆమ్మో! ఈ దేశంలో కా
ఊపిరి
-ఆర్. శర్మ దంతుర్తి
ఒకనొక రాజ్యంలో ధర్మరాజనే ఆయన రాజయ్యాడు కొత్తగా. ఈయన రాజయ్యేసరికి అనేక కష్టాలలో ఉంది రాజ్యం. హత్యలూ, మరణాలూ, మానభంగాలూ జరుగుతున్నా అడ్డుకునే నాధుడు లేడు. ఎవరిష్టానుసారం వాళ్ళు పనులు చేయడం జరుగుతోంది. వ్యాపారస్తులు డబ్బులు గుంజుతున్నా రోగాలు వస్తున్నా ఎవరికీ పట్టడం లేదు. ఇదంతా చూసి విసుగొచ్చిన ధర్మరాజు ఓ నిర్ణయానికొచ్చాడు; మంత్రులతో ఒక పాటు ఒక వారం కూలంకషంగా అంతా చర్చించాక. దేశంలో మళ్ళీ ధర్మం రావాలంటే చేతికి చేయి, కన్నుకి కన్నూ, లాభానికి లాభం, నష్టానికి నష్టం అనే సూత్రం అనుసరించి తీరవల్సిందే. దీనిప్రకారం ఎవరైనా కొంతమంది కల్సి ఒక మహిళని మానభంగం చేస్తే ఆ చేసినవాళ్లని నగరం నడిబొడ్డున అందరిముందూ మానభంగం చేసి తీరుతారు వాళ్ళకి రోగం వదిలేదాకా. అలాగే ఎవరైనా మోసం చేస్తే అదే మోసం తిరిగి చేయాలి వాళ్లకి. వైద్యులెవరైనా కావాలని చెత్త వైద్యం చేసి రోగి కన్ను పోగొడితే, వైద్యుడి కన్ను పొడ
జ్ఞానం
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు.
కులాలు, మతాలు నదుల లాంటివి!
నదులుగా చూస్తే వేరుగా కనిపించే నీరు
గంగగా చూస్తే ఒకటే అనిపిస్తాయి.
మనుషులుగా చూస్తే వేరుగా కనిపించే కులాలు,మతాలు
మానవత్వంతో చూస్తే ఒకటే అనిపిస్తాయి.
“నేను” వేరుగా ఉంటేనే బేధాలు వస్తాయి,
నేను, మీరూ మనంగా మారితే వాదాలు రావు.
నదులన్నిటిలో నీటిని దర్శిస్తే,ఒకటిగానే కనిపిస్తాయి.
కులాలు, మతాలను మానవత్వంతో స్పర్శిస్తే,
ఒకటిగానే అనిపిస్తాయి.
కులాలు నువ్వు ఏకాకివి కావని చెబుతాయి,
కొట్టుకోమని చెప్పవు.
మతాలు నీకు మానవత్వాన్ని బోధిస్తాయి,
మూర్ఖుడిగా నిన్ను మారమని చెప్పవు.
లోపం కులంలో లేదు, నీ ఆలోచనలో ఉంది,
పాపం మతంలో లేదు, నీఅజ్ఞానంలో ఉంది.
వేరు అనే భావాన్ని వీడి ఒక్కటే అనే నిజాన్ని చేరితే
మానవత్వం వికసిస్తుంది,మాధవత్వం విలసిల్లుతుంది.
పత్రం..పుష్పం..
-శ్రీధర్ రెడ్డిబిల్లా
(శాక్రమెంటో తెలుగు అసోసియేషన్ కథల పోటీ -2021 లో బహుమతి పొందిన కథ)
“యాకుందేంతు తుషార హార..” అంటూ మొదలెట్టిన సర్వస్వతీ స్తోత్రం ముగియగానే పిల్లలందరి నోటా ఒకటే కేరింత. గురుకులానికి ఈసారి సంక్రాంతి పండుగకు కూడా పదిహేను రోజులు సెలవులివ్వటంతో అందరూ ఇళ్లకు వెళ్లే రోజు అది. అందరి నాన్నలు వచ్చి తమ తమ పిల్లల్ని తీసుకెళ్తున్నారు.
నాన్న ఇంకా రావట్లేదేంది అనుకుంటూ మాటిమాటికీ గుట్ట పక్కనున్న వంక దారివైపు చూస్తున్నాడు శ్రీను. ఆరెపల్లి అడ్డరోడ్డు దగ్గర బస్సు దిగి ఎడమ వైపున్న మట్టిరోడ్డు మీద ఐదు కిలోమీటర్లు వస్తే చుట్టూ గుట్టలు, చిన్నపాటి అడవి మధ్య విశాల మైదానంతో ఉంటుందా గురుకులం.
వాళ్ళ ఊరిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చాలామంది విద్యార్థులు ఫెయిల్ అవుతుండటంతో శ్రీనును వాళ్ళ నాన్న ఆరవ తరగతిలోనే గురుకులంలో వేశాడు. ఇప్పుడు శ్రీను పదవ తరగతి.
గత ఐదేళ్ల నుంచి అదే గురుకులంలోనే చదువుతు