అనుభూతి – ప్రాచీన దృక్పథం (4- భాగం)
– సునీల పావులూరు
ఈ పంచకోశాల ద్వారా కలిగే సంపూర్ణమైన అనుభూతే సమగ్రానుభూతి. ఒక్కొక్క కోశం ద్వారా ఒక్కొక్క విధమైన అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి పాక్షికంగా ఉంటుంది. సమాజం పాక్షికానుభూతిని కాకుండా సమగ్రానుభూతిని కాంక్షిస్తోంది.
అనుభవం మానవసమాజానికి మూడు రకాలుగా అందించబడుతోంది. శాస్త్రపరంగానూ, తత్త్వపరంగానూ, కవిత్వపరంగానూ అనుభవ ఏకసూత్రత జరుగుతోంది.
“భూమిమీద మనిషి అడుగు పెట్టినప్పట్నించీ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికీ, ఈ ప్రపంచంతో సంధానం (adjustment) కుదుర్చుకోవటానికీ ప్రయత్నిస్తున్నాడు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవటమంటే విభిన్నమైన ప్రాపంచిక అనుభవాల్లో ఏకసూత్రతని సాదృశ్యాన్ని సాధించటమన్నమాట. ఈ ప్రయత్నం శాస్త్రం ద్వారా, తత్త్వం ద్వారా, కవిత్వం ద్వారా మూడు విధాలుగా సాగింది. భౌతిక సంఘటనల్లో ఏకసూత్రతని సాధించటానికి శాస్త్రం పూనుకుంది. వివిధ శాస్త్రాలకు చెందిన భౌతిక సూత్రా