తంజావూరు భాగవత మేళం కూచిపూడి ప్రహ్లాద – తులనాత్మక పరిశీలన
-- శ్రీమతి డా. ఉమా రామారావు
మేలట్టూరు భగవతమేళ నాటకాలు అంకితభావానికి నిదర్శనం, కాలానుగుణంగా అభిరుచులు మారుతున్నా తరతరాల సంప్రదాయాన్ని నియమనిష్ఠలతో ఆచరించడం ఇక్కడి ప్రత్యేకత. ముఖ్యంగా తమిళ భాషాభిమానం వెల్లువెత్తుతున్న వాతావరణంలో తెలుగుదనాన్ని ప్రదర్శించడం వెనుక ప్రధానంగా తెలుగు కళాకారులు మరీ ముఖ్యంగా కూచిపూడి కళాకారులను ప్రస్తావించాల్సి వుంటుంది. వివరాల్లోకి వెళితే విజయనగర సామ్రాజ్యం అంతరించేముందు, శ్రీకృష్ణదేవరాయల అనంతరం ఆంధ్రప్రాంతలో కళాపోషణ కరవై తంజావూరు నాయకరాజుల ఆశ్రయం కోరి కొంత మంది కూచిపూడి నాట్యాచార్యులు, పండితులు, కళాకారులు తరలివెళ్ళారు. క్రీ.శ. 1577-1614 మధ్య సింహాసనాన్ని అధిష్టించిన అచ్యుతప్పనాయకుడు నాట్యాచార్యులకు, కళాకారులకు భూదానం చేసి నిలువ నీడ కల్పించాడు. కళాభివృద్ధికి చేయూతనిచ్చాడు. దాదాపు 510 మంది కళాకారులకు (బ్రాహ్మణులకు) ఒక్కొక్కరికి ఒక ఇల్లు, ఒక బావితో సహా కొంత భూమిని జ