సంగీత రంజని

సంగీత రవళి – బాలమురళి

(బాలమురళీకృష్ణ జయంతి ఉత్సవం) SAMPADA (Silicon Andhra Music, Performing Arts, and Dance Academy) జులై 4న డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి ఉత్సవాన్ని అత్యంత ఘనంగా, శ్రవణానందకరంగా జరిపింది. ఎందరో సంగీత కళాకారులు వారి శిష్యులతో పాల్గొని, ప్రేక్షకులను అలరించి బాలమురళి జ్ఞాపకాలను, తమకున్న అనుబంధాలను మధురంగా నెమరువేసుకున్నారు. మూడు గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమాన్ని కింద ఇచ్చిన మూడు యూట్యూబ్ వీడియోల్లో వీక్షించండి. సంగీత డోలల్లో తరించండి.  

సంగీత రంజని

సిలికానాంధ్ర సంపద సంగీత విభాగం ఆచార్యులు, కర్ణాటక విద్వన్మణి డా. పద్మ సుగవనం తో ముఖాముఖీ

శ్రీరామదాసు జయంతి

విద్వాన్ DV మోహనకృష్ణ గారి సంగీత కచేరీ గంటలు 10:30:00 దగ్గరనుండి వినండి. అంతకు ముందు సంపద విద్యార్థుల సంగీతనాట్య సమ్మేళనాలను వీక్షించండి.

సంగీత రంజని మార్చి 2019

I. కళావతి రాగం: కళావతి అంటే కళలు తెలిసిన స్త్రీ. చదువుల తల్లి సరస్వతి దేవికి మరో పేరు కళావతి. పారుడు అనే ఋషికి, పుంజిక స్థల అనే అప్సరకు పుట్టిన కూతురుకు కళావతి అని పేరు పెట్టారు. పార్వతీ దేవి ఆమె సౌందర్యానికి మెచ్చి ఆమెకు పద్మినీ విద్యను ఇచ్చింది. తరువాత కళావతి స్వరోచి ని వివాహం చేసుకోంది. తుంబురుని వీణ పేరు కూడా కళావతి. కర్ణాటక సంగీతం లోని కళావతి రాగం 16 వ మేళకర్త చక్రవాక జన్యరాగం. ఉపాంగ రాగం, ఔడవ-వక్ర షాడవ రాగం. ఆరోహణలో గాంధార, నిశాధాలు వర్జ్యం. అవరోహణలో నిషాధం వర్జ్యం. అపురూపమైన రాగం, కరుణ రస ప్రధానమైన రాగం. ఈ రాగం త్యాగరాజస్వామి సృష్టి. విళంబ కాలం లో పాడితే బాగుంటుంది. ఆరోహణ: స రి మ ప ద స ..అవరోహణ: స ద ప మ గ స రి స ..శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి ధైవతం స్వర స్థానాలు. హిందుస్తానీ సంగెతం లో కూడా ఒక కళావతి రాగం ఉంది. అది కర్ణాటక సంగీతం లోని వలజి రాగానిక