పద్యం – హృద్యం
నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్
ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.
ఈ మాసం ప్రశ్న:
బాలలు నచ్చరని నెహ్రు బలముగ పలికెన్!
ఇంతకు ముందు యిచ్చిన ప్రశ్న:
రెండవ భార్యనేలుకొనరే పతులందరు తల్లిమెచ్చగన్
ఈ ప్రశ్నకు పూరణలు మాకు అందిన క్రమములో యిలా వున్నాయి.
ఎం.వి.యస్. రంగనాధం, హైదరాబాద్
1. ఉ.
పాండవు లందరున్ తమకు పత్నిగ కృష్ణను స్వీకరించి, లే
కుండ విభేదముల్ తమకు, నుంచిరి నీమము, వత్సరంబునన్
యుండును పత్నిగా యొకరి యోకము నందని, భోగ కాంక్షులై
రెండవ భార్య నేలుకొనరే, పతు ల