ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం
స్త్రీ గురించి రాసే మరో కవయిత్రి జయప్రభ. ' స్వేచ్చకోసం కవిత్వం వ్రాస్తున్నాను, స్వేచ్చకోసం కవిత్వం రాస్తాను' అని ఈవిడ ప్రకటించుకున్నారు. ఈవిడ తన కవిత్వం ఫెమినిస్టు ధోరణికి చెందినదని చెప్పుకుంటారు. సమాజంలో తనకు జరిగిన అన్యాయాల వల్ల ఒక స్త్రీ సానిగా మరవలసి వచ్చింది. అటువంటి స్త్రీని ' సానిపాప' అనే ఖండికలో సమాజంపై తిరగబడమని చెప్తున్న సందర్భంలో -
"రగులుతున్న ఆవేశాన్ని ఆరానీకు,
చైతన్య తూరుపులా ప్రజ్వరిల్లు !
అప్పుడు
బిగిసిన నీ పిడికిలి మాటున
సూర్యుడు కూడా ఉదయిస్తాడు "32 అంటూ స్త్రీ జాతికి సూర్యోదయం కావాలని ఈవిడ కోరుకుంటున్నారు. సమాజంలో జరిగే అనేక సంఘటనలు ఈవిడకు వస్తువులుగా మారాయి. స్త్రీలపై మగవాళ్ళు చూసే చూపులను వర్ణిస్తూ, వాటిని ఎదుర్కొంటే జయం స్త్రీలదే అని ఆవిడ తెలిపారు. అందుకని -
" అప్పుడనుకుంటాను
కళ్ళకే కాదు
ఈ దేశంలోని ఆడదానికి
వాళ్ళంతా ముళ్ళుండే రోజు
ఎప్పుడొస్తుందా అని 33" ప్రతి