జగమంత కుటుంబం
ప్రమీలాదేవి హఠాన్మరణం
-తమిరిశ జానకి
నవంబర్ ఒకటి 2018 వ తేదీన డా.మంగళగిరి ప్రమీలాదేవి గారు దివంగతులయ్యారు. ఆవిడ వయసు 75 సంవత్సరాలు. మచిలీపట్నంలో హిందూకాలేజ్ లో తెలుగులెక్చరర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు.చిన్నవయసులోనే సంగీతం లో డిగ్రీ పొందడమేకాక సాహిత్యంలో కూడా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. నలభైగ్రంధాలు రచించారు.
తెలుగు, హిందీ, సంస్కృతం భాషలలో పాండిత్యంఉన్న వ్యక్తి. పదసాహిత్యంలో పరిశోధనలు చేసి పి.హెచ్.డి.పట్టా పొందారు.పదసాహిత్యపరిషత్ అనే
సంస్థ స్థాపించి అనేక సాహిత్య సభలు మచిలీపట్నం లోనూ, హైదరాబాద్ లోనూ ఘనంగా నిర్వహించారు. ఆవిడ రాసిన పద్యగేయనాటికలకు 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.ఈమధ్య మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు ఆవిడకు సరస్వతీ సమ్మాన్ పురస్కారం ఇచ్చి సత్కరించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారం ఇచ్చి గౌరవించింది. సుమారు నలభై సంవత్సరాలుగా ఆవిడ నాకు మంచి స్నేహితురాలు.
స
కథల కవితల పోటీ
TAGS ఆధ్వరంలో “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ”
విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస తెలుగువారి రచనలకు TAGS ఆహ్వానం
(మీ రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: డిసెంబర్ 15, 2018)
రాబోయే సంక్రాంతి 2019 సందర్భంగా అమెరికా లో కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి శాక్రమెంటో లో నెలకొనిఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ “ నిర్వహిస్థుంది. భారత దేశం మినహా విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలందరినీ (ప్రవాస తెలుగు వారు) ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని సవినయంగా కోరుతున్నాం. మూడు వేలమందికి పైగా స్థానిక సభ్యులను కలిగి ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం తెలుగు భాష, తెలుగు సంస్కృతి వ్యాప్తి కి 2003 సంవత్సరం నుండి శాక్రమెంటో లో విశేష కృషి చేస్తుంది. అమెరికా, కెనడా, యూరోప్ మరియూ ఇతర విదేశాలల్లొ నివసిస్థున్న తెలుగు రచయితలకు ఇదే మా ఆహ్వానం. స్నేహపూర్వకమైన ఈ రచన