హనుమాన్ హేవన్
డా. తంగిరాల. మీరాసుబ్రహ్మణ్యం
శ్రీనగర్ కాలనీ లో పని ముగించుకుని బయటకు వచ్చిన సీతారాం కు బస్ స్టాప్ లో నిలబడిన ఉమాపతి కనబడ్డాడు. అసలు అతను ఉమాపతి అవునా కాదా అని కాసేపు మల్ల గుల్లాలు పడ్డాడు. ఎందుకంటే ఉమాపతి ది నల్లటి నొక్కుల క్రాపు . దూరంనుండి చూస్తే ముక్కు మొగం ఉమాపతి లాగే ఉన్నా బట్ట తల చూసి అనుమాన పడ్డాడు. ఎందుకైనా మంచిదని దగ్గరగా వెళ్ళి చూసి అతగాడు తన స్నేహితుడు ఉమాపతే అని నిర్ధారించుకుని వెనుక నుండి వెళ్ళి వీపు మీద గట్టిగా చరిచాడు. ముందుకు పడ బోయిన ఉమాపతి నిలదొక్కుకుని "ఎవడ్రా ఆది "అంటూ రౌద్రమ్ గా వెనక్కి తిరిగాడు. ముప్పై రెండు పళ్ళు కనబడేలా నవ్వాడు సీతారాం. "ఇదే మరి. ముప్పై అయిదేళ్ళ దాకా పెళ్లి చేసుకోకండా ఉంటే నొక్కుల క్రాపు పోయి బట్ట తల రాదూ ? "స్నేహితుడి భుజాల చుట్టూ చేతులు వేసి ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు సీతారాం. సీతారాం ను చూడగానే ఉమాపతి ముఖం చేట అంత అయ్యింది.
ఇంటర్ లో రెండే