కవితా స్రవంతి

ఎవరు?!

కవితా స్రవంతి
-సముద్రాల హరిక్రృష్ణ. దాశరధి!! తా శరధి! శరధి మద విదారి! ఆశల కాదని,సతిని విడచిన,వింత దారి!! ఎవడన్న వీడు, కఠిన శాసకుడొ ఎవడమ్మ వీడు లలిత నాయకుడొ?! (1) సుదతి వీడెనని వగచి సోలినాడే కుదురె కానని కపి సేన కూర్చినాడే ఎదురెలేని నీరధికి వారధి కట్టినాడే పదితలల రాకాసిని పడగొట్టినాడే. ఇంత చేసి,సీతనే చినపుచ్చినాడే పతిగ,నా విధిగ వెత దీర్చితన్నాడే! (2) కొందరెవ్వరో రవ్వ చేసిరని, రాజునని అది విని,ఇల్లాలినే కానల విడచినాడే పది.మంది మాటయే పాడియన్నాడే ఎదిచేసిన జనవాక్యమే తుది అన్నాడే! ఆనతిచ్చి సీత నడవి దింపించినాడే తానే శిక్షల వేసి బిట్టు కుమిలినాడే!! తనవారని చూడని వాడు రాజారాముడేమో మనసార వలచిన వాడు సీతారాముడేమో అన్ని ధర్మముల నిక్కపు ఆకృతి రాముడేమో అన్ని సరిత్తుల సంద్రపు విస్త్రుతి రాముడేమో! ******

మొగ్గలు

కవితా స్రవంతి
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ సుఖదుఃఖాల ఆటుపోట్లను తట్టుకుంటున్నప్పుడల్లా కవిత్వం సాగరంలా తీరంవైపు పరుగెడుతుంటుంది బీడుగుండెలలో దాహార్తిని తడిపే ప్రవాహిని కవిత్వం సమాజగతిని నిత్యం పహరాకాస్తున్నప్పుడల్లా కవిత్వం జెండాలా రెపరెపలాడుతుంటుంది నిరంతర ఆర్తనాదాల అలల కచేరి కవిత్వం కవిత్వంతో కాసేపు ముచ్చట్లు పెడుతున్నప్పుడల్లా కర్తవ్యాన్ని బోధించమని సందేశమిస్తుంటుంది నటరాజుని పరవశ తాండవనృత్యం కవిత్వం పలుకుబడులతో అక్షరాలను పలకరిస్తున్నప్పుడల్లా మాండలిక మాధుర్యం పల్లెగానాన్ని వినిపిస్తుంటుంది పల్లెపదాలను అభిషేకించే అందమైన చిత్రం కవిత్వం సమాజ సంఘర్షణలను నిత్యం చిత్రిస్తున్నప్పుడల్లా ఆలోచనల ఘర్షణలు రగులుకుంటూనే ఉంటాయి అనేక వ్యధల రోదనల ఆవేదనా వీచిక కవిత్వం

వెకిలి బుద్ధులెందుకు ?

కవితా స్రవంతి
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజ రావు. వేదమంత్రాలతో ఒక్కటైన వారికి వెకిలి బుద్ధులెందుకు? పెద్దల ఆశీస్సులతో ప్రేమను పండించుకున్నవారికి పంతాలెందుకు? కాదనకుండా మీ కోరికలన్నిటిని తీరుస్తున్న ఇంటిపెద్దలపై అనవసరపు అలకలెందుకు? బంధుసముహంలో బంధమేర్పరుచుకున్నవారికి విడిగా ఉందామన్న ఆలోచనలెందుకు? ఉమ్మడి కుటుంబంలోని ఉన్నతత్వాన్ని ఉరితీద్దామన్న ఊసులెందుకు? కలివిడితనం లోని కమనీయతను కర్కశంగా కాలరాస్తారెందుకు? వైవాహిక జీవితంలో ఓర్పులేని,ఓర్వలేని మీకు విరివిగా ఈ వైరాలెందుకు?

ఏది నిజం

కవితా స్రవంతి
 -- తాటిపర్తి బాలకృష్ణా రెడ్డి నీదే ఇజం నాదే ఇజం ఏది నిజం? ఈ ఇజాల మధ్య నలిగేదే నిజం మనుషుల్లో పోయిన మానవత్వం జనాల కొచ్చిన జడత్వం తంత్రాలతో కుతంత్రం వ్యాకోచిస్తున్న సంకుచితత్వం సుత్తి కొడవలి నెత్తిన టోపీ ఖాకి నిక్కరు చేతిన లాఠీ బొడ్లో కత్తి బుగ్గన గాటు మెడలో మాల చేతిన శంఖం చంకన గ్రంధం వక్తలు ప్రవక్తలు ఇజాలు వేరట నిజాలు వేరట వారిదో ఇజం వీరిదో ఇజం ఏది నిజం? ఈ ఇజాల మధ్య నలిగేదే నిజం మసిదు మాటున నక్కే ముష్కరులు గుడి నీడన చేరిన గాడ్సేలు చర్చి చావిట్లో చైల్డ్ యభ్యుసర్స్ అడవుల్లో అతివాదులు మన మధ్య మితవాదులు ఎవరివాదనలు వారివి నిజవాదం నేడో వివాదం నీదే ఇజం నాదే ఇజం ఏది నిజం? ఈ ఇజాల మధ్య నలిగేదే నిజం ఇజాల నీడలో నిజాలు దాగవు నిజాల వెలుగులో ఇజాలు ఇమడవు నిజాన్ని చూడలేని అంధులు సాటి మనిషిలో శత్రువుని చూడగా మానవత్వం ఎండమావే మనుషులంతా ఒక్కటనే మిద్య మన మ

అతడు – ఆవిడ

కవితా స్రవంతి
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు. కలలు కనేది అతని కనులు, ఆ కలలకు ఆవిడ జ్ఞాపకాలే ఆధారం. ఇష్టపడేది అతని మనసు, ఆ ఇష్టానికి ఆవిడ ఒకప్పటి సాహచర్యమే ఆధారం. అతని నిదురలో ఆవిడ కల, అతని మెలకువలో ఆవిడ ఇల. అతని చేష్టలలో అవిడ నిష్ఠ, అతను ద్రష్ట .... ఆవిడ స్రష్ట. అతను దాసుడు ...ఆవిడ దేవత, అతడు వ్యాసుడు ఆవిడ భారత. అతను వెన్నెల...ఆవిడ చంద్రం, అతను కిరణం....ఆవిడ రవి. ఆవిడే అతని ఉహలకు మేలుకొలుపు, ఆవిడే అతనికొక తీయని పిలుపు. ఆవిడే అతని జీవితానికి ఒక మలుపు, ఆవిడే అతనికి ఒక మాయని కొలుపు.

ఆమె చేసిన తప్పు

కవితా స్రవంతి
ఆమె చేసిన తప్పు ఆమె తన పెళ్ళయిన మరు క్షణం నుంచే అతను ప్రతి చిన్న విషయానికి తనపై ఆధారపడేలా చేసింది. నిన్న మాత్రం అతనికి చెప్పకుండానే, గుట్టుచప్పుడు కాకుండా అతన్ని విడిచిపెట్టి తన దారి తను చూసుకుని వెళ్ళిపోయింది. తను లేకుండా తరువాత అతనెలా బ్రతుకుతాడనే ఆలోచన ఆమెకు ముందులో లేకపోయింది. ఇన్నాళ్ళు ఆమే లోకంగా బ్రతికిన అతనికి ఇప్పుడు లోకమంతా శున్యంగా అనిపిస్తోంది. ఇన్నేళ్ళు ఆమెపై పూర్తిగా ఆధారపడిన అతనికి ఇప్పుడు బ్రతుకు భారంగా అనిపిస్తోంది. అతనిక కోలుకోలేడు, ఈ ఒంటరి సామ్రాజ్యాన్ని ఏలుకోలేడు. ఇప్పటికి ఆమె చేసిన తప్పేమిటో అతనికి అర్ధం అయింది, అది ఇప్పుడు అతనిపాలిటి తీరని శాపమయింది. పారనంది శాంత కుమారి

అద్దం

కవితా స్రవంతి
-రచన : శ్రీధరరెడ్డి బిల్లా -తేటగీతులు- ఉన్నదేదియో ఉన్నట్లు జూపెడితివి . అద్దమా! నీవెరుగవు అబద్దమంటె! రంగు లేపనములనద్ది రాసుకుంటె, ముసిముసిగ నవ్వుకుంటివా మూగసాక్షి ? స్కూళ్ళు, కాలేజిలకు వెళ్ళు కుర్రవాళ్ళు, పూసుకొచ్చిన అమ్మాయి ముఖము జూచి బుర్ర తిరిగి క్రిందపడిరి గిర్రుమంటు! నిలువుటద్దమా! నిజమేదొ నీకు తెలుసు! తండ్రి గళ్ళజేబుల నుంచి ధనము తీసి సుతుడు, ఫ్రెండ్సుతోటి సినిమా జూసి వచ్చి, పలవరించె హీరోయినందాల దలఁచి! వెక్కిరించితివా వాని వెఱ్ఱి జూచి? పెళ్లి కెళ్దామనుచు భర్త వేచియుండ అద్ద మెదుట కూర్చున్నది అతని భార్య! ఎంతసేపైన రాదయ్యె; ఏమి మాయ? అరిచిన మొగుడు సోఫాలొ జారగిల్లె! పెళ్లి జరుగు సమయమున కెళ్ళ లేక పెళ్లి జూడకక్షింతలు జల్లకుండ, “కూడు కోసమా?” యని భర్త కూత లేసె! పగలబడి నవ్వుచుంటివా మగని జూచి ! పరమ లోభిని కూడా అపార దాత వనుచు, పొగుడుచుందురు జనుల్, పనుల కొరకు! దుర్గుణములు మెం

జీవన ప్రశ్నావళి

కవితా స్రవంతి
-అర్చన కె కన్న తల్లి స్పర్శకి పరిచయమనేదవసరమా కురుస్తున్న మేఘానికి ఛత్రమొకటి అవసరమాx వెలుగుతున్న సూర్యునికి దీపమొకటి అవసరమా కదులుతున్న కాలానికి యుగములతో అవసరమా పచ్చటి బయలున్న పుడమికి ఆఛ్ఛాదనమవసరమా చక్కనైన చంద్రునిలో మచ్చలెతుకుటవసరమా హరి కాంచను, హృదయానికి హద్దులెన్న అవసరమా వేడుకొన హరుని కష్టసుఖాలనేవవసరమా భజియించగ భగవంతు సంకీర్తనలే అవసరమా నీ మదినే నివేదించ నైవేద్యం అవసరమా లోతెరుగని కడలికి తీరమొకటి అవసరమా మిణుకుమన్న తారల దూరమెన్న అవసరమా మెచ్చుకోలు వ్యక్తపరచ భాష ఒకటి అవసరమా మధువులొలుకు నాదానికి భావమొకటి అవసరమా స్వచ్ఛమైన క్షీరానికి గోవునెన్న అవసరమా అల్లుకున్న బంధాలకు హెచ్చుతగ్గులవసరమా తరచి తరచి మనసులలో మలినమెన్న అవసరమా సాయమడుగు చేతి, కులమతములెన్న అవసరమా ద్రవ్యానికి పేద గొప్ప భేదములెన్న అవసరమా మనుషులంత ఒక్కటైతె సరిహద్ధులన్నవవసరమా మతమన్న మత్తు వదిలి కులమన్న మన్ను