కొప్పరపు కవులు
-టీవీయస్.శాస్త్రి
భారతీయ భాషా సాహిత్యాలలో మరే భాషకు లేని విలక్షణమైన స్థానాన్ని తెలుగు భాషా సాహిత్యాలకు తెచ్చిపెట్టిన ప్రక్రియ అవధానం. పద్య విద్యకు పట్టంగట్టిన సాహిత్య ప్రదర్శన కళగా అవధాన ప్రక్రియ ప్రత్యేక గుర్తింపును పొందింది నాటి తిరుపతి వెంకటకవులు, కొప్పరపు సోదర కవులు మొదలుకుని ఆధునిక కవుల వరకు పద్యాన్ని అవధాన వేదికలపై ఊరేగించిన మహాకవులెందరో ఉన్నారు. కాళిదాసు కావ్యాలకు సంజీవనీ వ్యాఖ్య రాసి విశ్వవిఖ్యాతి గడించిన మల్లినాథసూరి మెదక్ జిల్లావాడే. వీరి తాతగారైన మల్లినాథుడు కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుని ఆస్థానంలో శతావధానం నిర్వహించి కనకాభిషేక సత్కారాన్ని పొందాడని ప్రతీతి. బహుశా వీరే మొట్టమొదటి అవధాని అయి ఉంటారు. ఈ విషయమై విస్తృతమైన పరిశోధన చేయవలసి ఉంది.కొప్పరపు సోదర కవులు తెలుగు సాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన జంట సోదరకవులు. కొప్పరపు కవులుగా ప్రఖ్యాతులైన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, కొప్పరప