జ్యోతిషము నమ్మదగినదేనా ?
-క వ న శర్మ
నా లక్ష్యం
ఒక వైపున, జ్యోతిషమును సైన్సు సమర్ధించదు అని , సైన్సు తెలిసిన కొందరు ఉద్దండ పండితులు చెప్తూ ఉంటె , హేతువాదులుగా చెలామణి అయ్యే మహామహులు జ్యోతిషము ఒక మూఢ నమ్మకం దాన్ని నమ్మ వద్దు అని ప్రచారం చేస్తూ ఉంటారు.దానికి ఎన్నో ఉదాహరణ లిస్తారు
మరో వైపు అది ఋషి ప్రోక్తమని నమ్మదగినదేనని వాదించే ఉద్దండ జోస్యులు ఉన్నారు . వారీ జోస్యం నిజమైన ఎన్నో ఉదాహరణ లిస్తారు. వీరే కాకుండా , తమ విషయం లో , లేక తమ వారి జీవితాల్లో ఫలించిన జోస్యాల గురించి చెప్పే పామరులు , విద్యావంతులు కూడా అసంఖ్యాకులు అనేకులు ఉన్నారు.
సైన్సు క్షుణ్ణం గా తెలిసిన మరి కొందరు, అది ఎందుకు నమ్మదగినదో సైన్సు పరం గా సమర్ధిస్తూ స్వానుభవ పూర్వకం గా వివిరిస్తూ ఉంటారు .
ఈ మూడింటిని సమీక్షించటం నేను చెయ్య బూనుకున్న పని . నాకంటే బాగా తెలిసిన వారు పూనుకుంటే బావుంటుంది. కాని వారికి దీనిపై సమయం వెచ్చించటానికి తీరిక ఉండక పోవటం,