‘తాడు – పాము ‘ న్యాయం
- తాటిపాముల మృత్యుంజయుడు
ఈ న్యాయం ఉపనిషత్తులలో వివరించబడింది. అయితే, దేవుడు, మతాల జోలికి పోకుండా మనం నివసిస్తున్న జాగృదావస్థ ప్రపంచానికి ఈ న్యాయాన్నిఅనువదించుకుంటే కొన్ని విషయాలు విశదమవుతాయి.
అజ్ఞానం (Ignorance) లోపానికి (Error) దారి తీస్తుంది. వాస్తవికతను (Reality) కప్పేసి ఒక భ్రమలోకి (Illusion) నెట్టేస్తుంది. అగ్రహణం (No Grasping) నుండి అన్యధా గ్రహణానికి (Wrong Grasping) కారణం అవుతుంది. అజ్ఞానం బీజం మొలకెత్తి సమస్యల వృక్షం అవుతుంది.
ఈ తప్పంతా తనకు అంతా తెలుసనుకొని అజ్ఞానమనే చీకట్లో మనిషి ఉండటమే. వెలుతురు పడితేగాని పాము అనే భ్రమ తొలగిపోనట్టు జ్ఞానం సంపాదించనంత వరకు ఇలాంటి దుస్థితి కొనసాగుతుంది. 'నాకు తెలిసిందల్లా ఒక్కటే, నాకేమీ తెలియదు ' అని సోక్రటిస్ చెప్పిన ఆణిముత్యం లాంటి మాటను మనం మరచిపోకూడదు.
మానసిక శాస్త్రం ప్రకారం ఒక మనిషి స్వయాన్ని (Self) నాలుగు భాగాలుగా విభజించవచ్చు. క్రింద ఇ