Tag: sangeetharanjani
సంగీతరంజని – శ్రీ రామదాసు కీర్తనల్లో సీతమ్మవారి ప్రస్తావన
- శ్రీమతి ఎమ్.వి.కమలారమణి
ఈ తెలుగు నేల మీద, మన మధ్య నడయాడిన మహనీయ వాగ్గేయకారుడు 'శ్రీ భద్రాచల రామదాసు.' రామదాసు గొప్ప రామభక్తుడు. సీతారామచంద్రులను తల్లిదండ్రులుగా ఎంచి, ఆయన ఆలపించిన ప్రతి కీర్తనలో భక్తి-జ్ఞాన-వైరాగ్యాలు, శ్రవణ-కీర్తన-స్మరణము వంటి నవవిధ భక్తిరసాలు ఉట్టిపడుతూ ఉంటాయి.
రామదాసు కీర్తనల్లో సీతమ్మవారి ప్రస్తావనను మనము రెండు విధాలుగా చెప్పుకోవచ్చు.
1. సీతమ్మవారిని నామ ప్రధానంగా గల రచనలు.
2. సీతమ్మవారిని ఉద్దేశించి రచించిన కీర్తనలు.
నామ ప్రధానంగా యనిన సీతాపతి యని, సీతానాయకయని, సీతాసమేతయని, సీతారమణ యని, సీతాహృదయ విహౄరయని, సీతారామస్వామి మొదలయిన పదాల రచన. ఇంకా, నినుబోనిచ్యెదనా సీతారామా! జైజై సీతారాం! భద్రాచలమందు సీతతో మెరయుచున్న రాముడు! యను వాక్యరచన.
''రావణ సంహారంలో సీతను పాలించిన'' అని 'సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము' అని ఇంకా ఒక విశేషమైన కీర్తన అనియు 'ఆశపుట్టెనే శ్