పద్యం-హృద్యం

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసం ప్రశ్న:
వరదలు మేలుమేలనుచు పాడుచునాడిరి కేరళీయులే!!

గతమాసం ప్రశ్న:
రెండును రెండును గలుపగ రెండే యగురా!

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

సూర్యకుమారి  వారణాసి, మచిలీపట్నం

మండుచు  నుండగ కన్నులు
రెండును  కన నద్దమందు  రెప్పలు  తెరువన్
ఉండెనవి  యెర్ర గను యా
రెండును  రెండును  గలుపగ రెండే  యగురా!

శివప్రసాద్ చావలి, సిడ్ని
(1)
దండిగ లంచము లిచ్చుచు
పండిత పట్టాల బడసి పాఠము బడిలో
మొండిగ చెప్పగ నొప్పును
“రెండును రెండును గలుపగ రెండే యగురా!”
(2)
రెండు తనువులు కలియగ నొ
కండు; మరొక జత తనువులు కలియగ స్త్రీయున్
నిండుగ పుట్టియు జతగొన
రెండును రెండును గలుపగ రెండే యగురా!
ఇంద్రగంటి సతీష్ కుమార్, చెన్నై
రెండెద్దులివియు, రెండవి,
రెండును  రెండును గలిపిన రెండే యగురా!
బండ్లు, మరి మూడు కావలె
పెండ్లికి అందరము పోవ పెందలకడరా!

డా. రామినేని రంగారావు, పామూరు, ప్రకాశం జిల్లా

రెండగు దేహము నాత్మయు
నొండొంటితొ చేరి మనిషి యొకడగు రీతిన్
యుండరె భార్యాభర్తలు
రెండును రెండును కలసి రెండే యగురా!

పుల్లెల శ్యామసుందర్, సేన్ హోసే, కాలిఫొర్నియా

రెండిచ్చితి రెండు తడవలు
రెండెట్లగునని యడుగగ రెడ్డిట్లనియెన్
“పొండిర, లంచములందున
రెండును రెండును గలియగ రెండేయగురా!”

మైలవరపు సాయికృష్ణ, సాక్రమెంటొ, కాలిఫోర్నియా

బండికి రెండగు చక్రము
లుండిన జతయగు నొకటిగ రూఢిగ గనినన్
రెండుల నొక్కటి లెక్కన
రెండును రెండును గలియగ రెండే యగురా!
కొందరు హాస్యమాడ కడుకూరిమి తోడుతఁ బిల్తురాతనిన్
పందని, కారణంబడుగ పంట దివాకరు నామధేయమే
సుందరి పెండ్లిచేసుకుని శోభనమందున ప్రేమమీర యా
పందిని కౌగలించుకొని పంకజలోచన సంతసించెరో శంకరి పిల్లలకై కొనె
వంకాయల వంటి రూపు గలిగిన బుగ్గల్
చంకన యుండిన పాపడి
‘వంకాయన’ చెఱుకు రసము వడివడి యుబికెన్పుల్లెల

శ్యామసుందర్, శేన్ హోసే, కాలిఫోర్నియా

నానా భాషల కథలను
చైనాలో ప్రజలు కూడ చదివవి మెచ్చన్
తానొక అనువాదకుడై
చైనాలో తెలుగు నేర్చి చక్కగ బ్రదికెన్మాతామహి బయలుదేర మనుమడు ప్రీతిన్
చేతులనూపుచు ముద్దుగ
తాతా యని ప్రేమతోడ తరుణిని బిలిచెన్

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked