సారస్వతం

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

పొలాలనన్నీ,
హలాల దున్నీ,
ఇలాతలంలో హేమం పిండగ-
జగానికంతా సౌఖ్యం నిండగ-
విరామ మెరుగక పరిశ్రమించే,
బలం ధరిత్రికి బలికావించే,
కర్షక వీరులకాయం నిండా
కాలువకట్టే ఘర్మ జాలానికి,
ఘర్మ జాలానికి,
ధర్మ జాలానికి,
ఘర్మజలానికి ఖరీదు లేదోయ్!
నరాల బిగువూ,
కరాల సత్తువ
వారాల వర్షం కురిపించాలని,
ప్రపంచభాగ్యం వర్థిల్లాలని-
గనిలో, పనిలో, కార్ఖానాలో
పరిక్లమిస్తూ,
వరివ్లవిస్తూ,
ధనిక స్వామికి దాన్యం చేసే,
యంత్రభూతముల కోరలు తోమే,
కార్మికధీరుల కన్నులనిండా
కణకణమండే,
గలగల తొణకే
విలాపాగ్నులకు, విషాదాశ్రులకు
ఖరీదు కట్టే షరాబు లేడోయ్!
లోకపుటన్యాయాలూ,
కాల్చే ఆకలి, కూల్చేవేదన,
దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ
పరిష్కరించే, బహిష్కరించే
బాటలుతీస్తూ,
పాటలు వ్రాస్తూ,
నాలో కదలే నవ్యకవిత్వం
కార్మికలోకపు కల్యాణానికి,
శ్రామికలోకపు సౌభాగ్యానికి,
సమర్పణంగా,
సమర్చనంగా
వాస్తవ జగత్తుని మనోజ్ఞంగా చిత్రించటంలో అనుభూతికి కొరవేముంది?
నిజంగానే నిఖిలలోకం
నిండుహర్షం వహిస్తుందా?
మానవాళికి నిజంగానే
మంచికాలం రహిస్తుందా?
దారుణ ద్వేషాగ్ని పెంచే
దానవత్వం నశిస్తుందా?
అని చెప్పిన కవితలో ఉద్రేకంతో పాటు ఉపదేశం కూడా ఉంది కదా! ఈ వర్గం కవులు తమ తిరుగుబాటు కవిత్వానికి అభ్యుదయ కవిత్వమని పేరు పెట్టుకోవటంలోనే ఎంతో అభ్యుదయం గోచరిస్తుంది. అభ్యుదయ

కవులు భావకవులను ఎంత ఈసడించినా వారు భావం లేని కవిత్వం రాయలేరు కదా! ఉన్న తేడా ఒక్కటే భావకవులు భావప్రదానంగా రాస్తే, అభ్యుదయ కవులు అభ్యుదయ ప్రదానంగా రాస్తారు. కాల్పనిక వాతావరణంలో రాయబడ్డ్డ
“గుణములేని వానిదే కులమైతే నేమి
తృణమైతేనేమి శ్రీచరణమంటునేని
ఏ కౌటిల్యము వీని నేర్పరిచిందోకాని
చీకటి గదులన్నే జగదీశ్వరాలయములోనే
అన్న గేయంలో అభ్యుదయ భావన లేకుండా పోయిందా? అలాగే అభ్యుదయం కోసమే అంకితమైపోయామని అనుకున్నవారు – అనుకున్న రచన ఈ కింద పరిశీలిద్దాం. దేశస్వాతంత్ర్యం కోసం యుద్ధరంగానికి వెళ్ళిన ప్రియుని ఉద్దేశించి, అతని ప్రియురాలు రాసిన ఉత్తరం గంగినేని వేంకటేశ్వర్లుగారి రచనలో ఈ కిందివిధంగా ఉంది.
ఉత్తరాలు ప్రతిరోజూ వ్రాస్తూ వుండు
అక్షర అక్షరంలోని నీ మధురస్వర ఆలాపన వింటాను
పంక్తి పంక్తిలో నీ జీవన దృక్కోణం స్పర్శిస్తాను
లేఖలో నీవు కనపడతావు, కరిగిస్తావు
గరళం త్రాగే శక్తినిస్తావు.

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked