సారస్వతం

జ్యోతిషము నమ్మదగినదేనా ?

-క వ న శర్మ

నా లక్ష్యం

ఒక వైపున, జ్యోతిషమును సైన్సు సమర్ధించదు అని , సైన్సు తెలిసిన కొందరు ఉద్దండ పండితులు చెప్తూ ఉంటె , హేతువాదులుగా చెలామణి అయ్యే మహామహులు జ్యోతిషము ఒక మూఢ నమ్మకం దాన్ని నమ్మ వద్దు అని ప్రచారం చేస్తూ ఉంటారు.దానికి ఎన్నో ఉదాహరణ లిస్తారు
మరో వైపు అది ఋషి ప్రోక్తమని నమ్మదగినదేనని వాదించే ఉద్దండ జోస్యులు ఉన్నారు . వారీ జోస్యం నిజమైన ఎన్నో ఉదాహరణ లిస్తారు. వీరే కాకుండా , తమ విషయం లో , లేక తమ వారి జీవితాల్లో ఫలించిన జోస్యాల గురించి చెప్పే పామరులు , విద్యావంతులు కూడా అసంఖ్యాకులు అనేకులు ఉన్నారు.
సైన్సు క్షుణ్ణం గా తెలిసిన మరి కొందరు, అది ఎందుకు నమ్మదగినదో సైన్సు పరం గా సమర్ధిస్తూ స్వానుభవ పూర్వకం గా వివిరిస్తూ ఉంటారు .
ఈ మూడింటిని సమీక్షించటం నేను చెయ్య బూనుకున్న పని . నాకంటే బాగా తెలిసిన వారు పూనుకుంటే బావుంటుంది. కాని వారికి దీనిపై సమయం వెచ్చించటానికి తీరిక ఉండక పోవటం, అనవసరం గా తగువుల్లోకి తల దూర్చటం ఎందుకు అన్న భావం ఉండటం కారణాలుగా వారు చేయటం లేదేమో. అంతవరకు నేను మిన్నకుండలేక నోరు విప్పుతిన్నాను .

2.జ్యోతిషం అంటే ఏమిటి ?

జ్యోతిషము అనే మాట జ్యోతి అనే పదం నుంచి వచ్చింది .జ్యోతి అంటే వెలుగు . జ్యోతిషం అనేది వెలిగే మూర్తుల ( శాల్తీల) కు సంబంధించిన శాస్త్రం . ఈ శాస్త్రం మనుషుల అవసరాలతో ముడి పడి , అనాదినుంచి అభివృద్ధి చెందుతూ వచ్చిన శాస్త్రం .
భారతీయులు దీన్ని ఋషి ప్రోక్తమని నమ్మి వేదాంగ భాగంగా అధ్యనం చేసారు. దీన్ని త్రి స్కంథ శాస్త్రం అంటారు 1. సిద్ధాంత భుజం ( Astronomy ) 2. ఫల (జోస్య )భుజం 3.( Predictive Astrology ) 3.ముహుర్త భుజం ( The limb of Auspicious Times )
మొదటిదాన్ని ఈ నాడు ఖగోళ విజ్ఞాన శాస్త్రం అంటున్నారు. ప్రపంచమంతటా మొదట్లో ఇది భూమిని కేంద్రంగా చేసి నిర్మించి అభి వృద్ధి చేసారు. తరవాత, సూర్యుని కేంద్రం గా చేస్తే గణనలు ,వివరణలు సులభం అవుతాయని గుర్తించారు . అందుకని సూర్యుని కేంద్రంగా చేసీ సరళం చేసారు . కొంత మంది భూమి కేంద్రం గా ఉన్న నమూనా తప్పు అనుకుంటారు. గ్రహ గమనాలని లెక్క కట్టటం , ఇప్పటికి మన పంచాంగ కర్తలు , ఆ పాత నమూనా ప్రకారమే చేస్తున్నారు. అవి, సూర్యుడు కేంద్రం గా ఉన్న నమూనాని అనుసరించ కట్టే లెక్కలకి అతి తక్కువ ప్రమాదాలతో ( Errors) సరి పోతున్నాయి. జోస్యాలు నమ్మ దగినవి కావచ్చు కాక పోవ చ్చు. కాని అవి నమ్మ దగినవి కావు అని చెప్పటానికి భూమి కేంద్రక నమూనా తో లెక్కలు కట్టడం కారణం గా చెప్పటం మాత్రం ఖచ్చితం గా తప్పు.
ఇప్పుడు జ్యోతిషం అనే పదాన్ని రెండో భుజమైన జోస్యానికి సమానార్ధకం గా వాడు తున్నారని ఈ చర్చలో మనం గుర్తు ఉంచుకోవాలి .

3.జన్మ కుండలిని

జోస్యం చెప్పటానికి ఆకాశ వృత్తాన్ని 12 భాగాలుగా విభజించారు. . అలా విభాజించటానికి , పౌర్ణమికి పౌర్ణమికి లేక అమావాస్యకి అమావాస్యకి మధ్య 30 ( 29.5) దినాలు ఉండటం, ఒక సూర్య సంవత్సరం లో సూర్యుడు మళ్లి ఆకాశం లో అక్కడే కనపడటానికి పట్టేకాలం రమారమి 360 ( 365.25 ) దినాలు అవటం , కారణాలు . ఈ 12 భాగాల్లో ఒకో భాగానికి , ఒకో రాశి గా పేరు పెట్టారు .
అదే ఆకాశ వృత్తాన్ని మళ్లి 27 భాగాలుగా విభజించి ఒకో భాగానికి ఒకో నక్షత్రం పేరు పెట్టారు . చంద్రుడు ఆకాశ వృత్తం లో మళ్లి అక్కడే కనిపించటానికి పట్టే కాలం 27 ( 27.32) దినాలు . ఇక్కడ నక్షత్రం అనేది ఆకాశ వృత్తపు 360 డిగ్రీలలో 27 వ భాగాన్ని సూచిస్తుంది. నక్షత్రాలు అనేక విధాలు .ఒక నక్షత్రం గా చెప్పేదాంట్లో ఒకటి లేక కొన్ని తారలు . తేజో మేఘా ( Nebula ) లు ఉండవచ్చు .చిత్తలో ఒక తార ఉంటె కృత్తిక లో కొన్ని తారలు ఒక తేజో మేఘం ఉన్నాయి. ( కార్తి కేయుడి ఆరుగురు తల్లుల కథకి ఇదే మూలం )
ఒక జాతకుడు( Native ) పుట్టిన సమయం లో చంద్రుడు ఉన్న రాశిని జన్మ రాశి అంటారు. క్షితిజం( Horizon) వద్ద ఉదయిస్తున్న రాశిని , లేక ఉన్న రాశిని జన్మ లగ్నం అంటారు .ఒకొక్క రాశి , క్షితిజాన్ని దాటడానికి ఉజ్జాయింపు న 2 గంటలు తీసుకుంటుంది .

4. కొంత స్పస్టత

ఇది కాక గుర్తుంచుకోవలసిన మరో విషయం Planet అనే ఇంగ్లీష్ పదానికి సమానార్ధకం గా గ్రహం అనే తెలుగు మాట వాడటం వలన కలిగే గందర గోళం ఒకటి ఉంది. Planet అనే మాటకి అర్ధం దిమ్మరి లేక తిరుగు బోతు. అది స్వయం ప్రకాశం కాదు. తార ( Star) స్వయం గా ప్రకాసశిం చేది. గ్రహం అంటే ( గురత్వాకర్షణ తో )పట్టుకునేది అని అర్ధం . అందుకని సూర్యుడు తారా ? గ్రహమా ? అనే ప్రశ్న అర్ధం లేనిది ఎందుకంటే సూర్యుడు రెండూను.
జన్మకుండలి లేక జాతక చక్రం (Horoscope) , జాతకుడు పుట్టిన సమయం లో ,సూర్యుడు , చంద్రుడు, గురుడు , శుక్రుడు, శని, కుజుడు ,బుధుడు , అనే 7 గ్రహాలు, రాహు, కేతులు అనే రెండు ఛాయా గ్రహాలు, ఆకాశం వృత్తం లో ఏ స్థానాలలో ఉన్నాయో చెప్పేది . దీని ఆధారంగా జోస్యులు , జోస్యం చెప్తారు .
సమయం తెలిస్తే జన్మ కుండలి వేయటం వరకు అనుమానం లేని సైన్సు. అయితే ఒక తార నుంచి బయలు దేరిన కాంతి మనలని చేరటానికి కొన్ని సంవత్సరాలు పట్ట వచ్చు. మనలని ఆ కాంతి చేరే సమయం లో ఆ తార కాలి పోయి ఉండ వచ్చు. జోస్యం లో తార ప్రభావంగా చెప్పేది, దాని కాంతి మనలని చేరేటప్పటి ప్రభావం గా అర్ధం చేసు కోవాలి .

పుట్ట టం అంటే ఏమిటి ? శిరోదయమా , మొదటి ఏడుపా లాంటి ప్రశ్నలు , నిర్వచనానికి సంబంధించినవి. . .జోస్యం చెప్పటానికి వాటి జవాబు అవసరమైతే కావచ్చు. కాకపోతే కాక పోవచ్చు. ( దీనిని ముహూర్తం విషయ చర్చ లో స్పృసిస్తాను ) అంతే కాని అసలు జోస్యం నమ్మదగిన శాస్త్రం అవునా కాదా ? అన్న చర్చలో కాదనటానికి దానిని కారణం గా చెప్తే . దానిని ‘ ఈ విధం గా నిర్వచిస్తే నమ్మ దగిన ఫలితాలు మాకు వచ్చాయి’ అని రెండో వర్గం వారు వాదించ వచ్చు. పైగా అతి వేగంగా తిరిగే చంద్రుడు ఒక నక్షత్ర పాదం దాటడానికి 6 గంటల వ్యవధి తీసుకుంటాడు . అందుకని పుట్టిన సమయం గుర్తించటం లో కొద్ది నిముషాల ప్రమాదం (Error) గ్రహ స్థితు ల పై అందరు అనుకునేటట్టు పెద్ద ప్రభావం చూపించదు.
ఇటువంటి పక్క దారి పట్టించే చర్చే ,నమూనా ( Model) లగురించి కూడా ఉంది. ‘పరాశ రుడి నమూనా లాంటి పాత ఋషుల నమూనాలు వరాహ మిహిరుడు ,కళ్యాణ వర్మ మొదలైన మధ్య కాలం వారి నమూనాలు, బీ. వి. రామన్ ,కృష్ణమూర్తి లాంటి నవీనుల నమూనాలు ఉన్నాయి కదా . ఇందులో ఒకటే కదా ఒప్పు అవాలి ‘ అనే వాదన ఒకటి ఉంది. ఒకప్పుడు సైన్సు లో వెలుగు కణ సముదాయమా ? అలల గుంపా ? అన్న ప్రశ్న ఉండేది. రెంటి ని సమర్ధించే సమాచారం, భంగ పరిచే సమాచారం, కూడా అందుబాటులో ఉండేది. ఇప్పుడు, విశ్వం ఏర్పడ టం విష యం లో అందరికి తెలిసిన Sring theory నమూనా యే కాక మరి కొన్ని ఉన్నాయి. . ఎక్కువ నమూనాలు ఉండటాన్ని సైన్సు వ్యతిరేకించదు . సమస్య పరిష్కారం, కోసం వెతుక్కుంటూ వేచి ఉంటుంది .
కొంతమంది హేతువాదులు ” మేం 4 గురి జాతకాలు, ఎవరివి అని చెప్పకుండా ఇస్తాం . ఏవి ఆడవారివో ఏవి మగ వారివో చెప్పగలగాలి ” అని జాతక పండితులకి సవాల్ విసురుతూ ఉంటారు . అది ఏ విధం గాను జాతకాల మీద మనుషులకున్న నమ్మకం తొలగించదు. తప్పు చెప్పిన పండితుడి మీది నమ్మకాన్నిమాత్రమే తొలగిస్తుంది. జనం మరొకర్ని వెతుక్కుంటూ పోతారు. రెండే సంభవాలున్న ప్రయోగాన్ని సంఖ్యా శాస్త్రం ( Statistics ) లో బర్నౌలి ప్రయోగం అంటారు.
ఈ మానసిక ప్రయోగాన్ని గమనించండి. నలుగురి లో ఒకరి జాతకాన్ని వెయ్యి మంది నమ్మే 100 మంది పండితులకి చూపిస్తే రమారమి 50 మంది సరిగ్గా చెప్తారు. వారి మీ ద ప్రజలకి గురి పెరుగుతుంది. ఈ 50 మందికి రెండో జాతకం చూపిస్తే ,వారిలో ఒక 24 మంది సరిగా చెప్పవచ్చు. ఆ 24 మందికి 3 వ జాతకం చూపిస్తే ఒక 12 గురు సరిగా చెప్పవచ్చు. ఈ 12 గురికి 4 వ జాతకం చూపిస్తే 6 గురు సరిగా చెప్తారనుకోవచ్చు. చివరికి జరిగేదేమిటంటే మొదట్లో 100 మంది పండితులని న నమ్మిన వెయ్యిమంది ప్రజా, ఈ పరీక్షలో చివరికి మిగిలిన ఆరుగురు పండితులకి 16 రెట్ల నమ్మకం తో అనుయాయీలు అయిపోతారు. అంతే గాని తమ నమ్మకం పోగొట్టుకోరు. వ్యాపారాల లో వచ్చేది బూమ్ /స్లంప్ అనే విషయం లో సరైన ఉహ రెండు మూడు సార్లు చేసిన ఆర్ధిక శాస్త్ర పు జోస్యులకి గిరాకి ఎక్కవగా ఉండటానికి కారణం ఇదే !
5. జ్యోతిషం ఋషి ప్రోక్తం

జ్యోతిషాన్ని చాలామంది నమ్మటానికి కారణం అది ఋషి ప్రోక్తం అని నమ్మటం . తర్కం లో యోగదృష్టి ప్రమాణం అని ఉన్నది. ఋషులు అసాధారణ స్పురణ శక్తీ ( అతి గొప్ప ఏకాగ్రతతో ఆలోచించి తెలుసుకునే శక్తీ ) కలిగి ఉంటారు కనక ఈ ప్రమాణాన్ని స్వీకరిస్తున్నాము అంటారు ,నమ్మే వారు. . ఈ పద్ధతిలో కలిగే జ్ఞానాన్ని Transcendal Perception అంటారు. న్యూటన్, శ్రీనివాస రామానుజం , ఐన్ స్టెయిన్ లకి ఈ శక్తీ ఉన్నదని మనకు తెలుసు. అందుకని, నమ్మేవారిని తప్పు పట్టలేము . అయితే ఈ ప్రమాణాన్ని నమ్మని వారు ” ప్రమాదో ధీమతామపి” అని గుర్తు చేస్తారు. మనం చెప్పుకున్న ముగ్గురు కొన్ని తప్పుడు ఉఃహాలు చేసారని కుడా మనకి తెలుసు . అందుకని నమ్మని వారిని తప్పు పట్టలేము. అంటే సామాన్య ప్రమాణం లేని కారణం గా ఈ విషయం పై చర్చ కొనసాగించలేము.
(ముగింపు వచ్చే నెలలో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked