పద్యం-హృద్యం

మార్చి- 2018

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకుల నుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసం ప్రశ్న:
చైనాలో తెలుగుఁ నేర్చి చక్కగ బ్రదికెన్
గతమాసం ప్రశ్న:
చిట్టెలుకకు బెదిరి పిల్లి ఛెంగున దాగెన్

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

టేకుమళ్ళ వెంకటప్పయ్య, విజయవాడ

పట్టణ శుషిరము కాళ్ళకు
పట్టీలు కులుకు నడుమున బతివెంటన్ దా
మెట్టిన గీమును జేరన్
చిట్టెలుకకు బెదిరి పిల్లి ఛెంగున దాగెన్
(పట్నమాసపు ఎలుక కాళ్ళకు పట్టీలు ధరించి ఠీవిగా అత్తవారింట్లో అడుగిడగా, ఆ పట్టీల శబ్దానికి పిల్లి భయపడి దాగుకొన్నది)

వారణాశి .సూర్యకుమారి, మచిలీపట్నం

కొట్టుటె  యాటగ  బుడతడు
గట్టిగ  కొట్టగ ను బామ్మ  కంటికి  తగులన్
గుట్టుగ  దాగుచు  నిట్లనె
చిట్టెలుకకు బెదిరి పిల్లి  చెంగున దాగెన్

గండికోట విశ్వనాధం, హైదరాబాదు (తాత్కాలికంగా సేన్ జోస్,కాలిఫోర్నియా)

పట్టుడిగిన నేత యొకడు
“చిట్టెలుకకు బెదరి పిల్లి చెంగున దాగెన్”
గుట్టుగ యనురీతి  వడిన్
కట్టడి లేని సభనుండి కను మరుగయ్యెన్

చావలి విజయ

గుట్టుగ నేత పలుకులను
యిట్టే టి.వి లో నిశితపు వివరణ చూపన్
వట్టిదని చెప్పు రీతిది
చిట్టెలుకకు  బెదరి  పిల్లి చెంగున దాగెన్.

శివప్రసాద్  చావలి, సిడ్నీ

గుట్టుగ భార్యకు లంచము
ముట్టిన సాక్ష్యపు వివరణముల్తెలుపగనే
గుట్టుగ పరువున్దక్కన్
చిట్టెలుకకు  బెదరి  పిల్లి చెంగున దాగెన్

ఇంద్రగంటి సతీష్ కుమార్, చెన్నై

పొట్టలు చెక్కలు కార్టూన్
పెట్టిన, కడు తెలివి జెర్రి పెట్టెడి పాట్లన్
తట్టుకొన లేదు, చూడగ
చిట్టెలుకను జూచి పిల్లి చెంగున పారెన్!
మాతామహి బయలుదేర మనుమడు ప్రీతిన్
చేతులనూపుచు ముద్దుగ
తాతా యని ప్రేమతోడ తరుణిని బిలిచెన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked