– డా. కోదాటి సాంబయ్య
కొందరు మహానుభావులు ఏదో ఒక సత్కార్యం చేయడానికే భువిపై జన్మిస్తారు. త్యాగయ్య, అన్నమయ్య అలాంటివారు. వారినే కారణ జన్ములు అంటారు. అలాంటి కారణ జన్ములే డా. శ్రీపాద పినాకపాణి గారు. శ్రీకాకుళం జిల్లా, ప్రియ అగ్రహారంలో ప్రమాదీచ నామ సంవత్సరం శ్రావణ శుద్ధ పాడ్యమి, ఆదివారం ( 8 ఆగస్ట్ 1913 )
నాడు పుట్టిన పినాకపాణి గారు వృత్తి రీత్యా వైద్యులైనా ప్రవృత్తి రీత్యా సంగీత విద్వాంసుడు. 99 సంవత్సరాల సంపూర్ణ జీవితం గడిపి 11 మార్చ్ 2013 నాడు స్వర్గస్తులయ్యారు.
మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ నుండి సంగీతా కళానిధి అవార్డ్, కేంద్ర ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అవార్డ్ (1984 ) పొందారు.
వారి స్వీయ చరిత్ర ‘ నా సంగీత యాత్ర’ లోని చివరి పేరా చదివితే వారెంత ఉన్నతులో తెలుస్తుంది.
” పెద్దలు పాడిన రీతులలో నేను పాడ గలుగు తున్నానన్న నిజం తప్ప నన్నే ప్రశంస సంతోష పెట్టగలదు? విద్వాంసులకు తదితర పెద్దలకూ నా పాట వినగా కలిగిన యభిప్రాయములను పాఠకుల ముందుంచాను.నాకు తృప్తి కలిగింది. నన్ను నేనే సంబోధించి “doctor! you have not lived in vain; you have not wasted your time” అని అనుకున్నాను.
*****************************************************************
శ్రీపాద పినాకపాణి గారు రచించిన పుస్తకాలు:
1. సంగీత సౌరభం (నాలుగు భాగాలు)
2. పల్లవి గాన సుధ.
3. మనోధర్మ సంగీతం.
4. మేళ రాగమాలిక.
5. నా సంగీత యాత్ర (స్వీయ చరిత్ర)
*****************************************************************
శ్రీపాద పినాకపాణి గారి ముఖ్య శిష్యులు:
నేదునూరి కృష్ణమూర్తి, నూకల చినసత్యనారాయణ, శ్రీరంగం గోపాల రత్నం, వోలేటి వెంకటేశ్వర్లు, మల్లాది బ్రదర్స్ మొ. వారు