-స్వర వీణాపాణి
(ఇచ్చిన సాహిత్యానికి కోరిన వివాదిరాగంలోవెంటనే స్వర కల్పన)
1. సప్త స్వర అవధానము .. 7 గురి తో /14 మంది తో
పైన పేర్కొనబడిన ప్రక్రియకు క్రింద వివరించిన నియమ నిబంధనలు.
ప్రతి ఒక్కరు కేవలం 4 పంక్తుల గేయ/వచన/బాల సాహిత్యాన్ని ఏ భావానికి సంబంధించినదయినా స్వయముగా రచించుకొని ఈ ప్రక్రియకు హాజరు కావలెను .
లేదా వేరెవరి సాహిత్యాన్నయినా తెచ్చుకొని, సాహిత్యాన్ని చదవ బోయేముందు వారి పేరును చెప్పవలెను.
తీసుకు రాకూడని అంశములు :
పద్యం
సినిమా పాటలు
ఇంతకు ముందు ధ్వని ముద్రణ/రికార్డు కాబడిన/స్వర పరచ బడిన ఏ అంశమైనా
సంగీతబోధనాంశములు, కృతులు, కీర్తనలు మొదలగునవి
అసభ్యకరమైన, అశ్లీలకరమైన, అమర్యాదకరమైన అంశములు
వివరణ: ఇది 72 మేళకర్త రాగములలో చాలా తక్కువగా వాడబడుతున్న 40 వివాది రాగాలనూ ప్రపంచానికి తెలియ పరచడానికి, విద్యార్ధులకు అవగాహనకల్పించడానికి, సామాన్య ప్రేక్షకులకుకూడా విషయ అవగాహన కల్పించి, మన భారతీయ సంగీత వైభవ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేయడానికి,సంగీత సాహితీ మాధుర్యాన్ని ఆస్వాదింపజేయడానికి రూపొందించబడిన వినూత్న విద్యా వినోద ప్రక్రియ.
సంగీతశాస్త్రంలో నిష్ణాతులు, అధ్యాపకులు, విద్యార్ధులు ఎవరైనా పృచ్ఛకులు గా వ్యవహరించే ఈ ప్రక్రియలో వేదికపై వాళ్ళ పేర్లు ఈ విధంగా ఉంటాయి. 72 మేళకర్త రాగాలకు మొత్తం స్వరాలు 16. వాటిని ప్రతిబింబించడానికి ఈ ప్రయత్నం .
1. షడ్జమం
2. శుద్ధ రిషభం
3. చతుశ్రుతి రిషభం
4. షట్ శృతి రిషభం
5. శుద్ధ గాంధారం
6. సాధారణ గాంధారం
7. అంతర గాంధారం
8. శుద్ధ మధ్యమం
9. ప్రతి మధ్యమం
10. పంచమం
11. శుద్ధ దైవతం
12. చతుశృతి దైవతం
13. షట్ శృతి దైవతం
14. శుద్ధ నిషాదం
15. కైసిక నిషాదం
16. కాకలి నిషాదం
వేదికపై వుండే 7గురు సాహితీమూర్తుల, 7గురు సంగీతమూర్తుల పేర్లు
సాహితీమూర్తులు:
1.ఓం 2. న 3. మః 4. శి 5. వా 6. యః 7. సి
సంగీతమూర్తులు:
8. స 9. రి 10. గ 11. మ 12. ప 13. ద 14. ని
సాహితీ కారుడు సాహిత్యాన్ని చదువగానే, సంగీతకారుడు తనకు ఇవ్వబడిన 40 వివాది రాగాల పత్రాన్ని చూస్తూ అందులో తనకు ఇష్టమైన రాగంలో ఆ సాహిత్యాన్ని స్వర పరచమని అడుగవలెను. ఇదంతా వరుస క్రమంలో జరుగుతుంది.
ప్రతి పాటను అడిగిన రాగంలో ఇచ్చిన సాహిత్యాన్ని అవధాని స్వరపరచి పాడగానే సంగీతo లో అపారమైన ఖ్యాతి గడించిన ఒక విశిష్ట వ్యక్తి అవధాని ఆ సాహిత్యాన్ని ఆ రాగంలో స్వర పరచిన తీరును గూర్చి విశ్లేషిస్తారు.
ప్రతి పృచ్ఛకుడు అడిగే సాహిత్యాన్ని నిర్వాహకులు ముందుగానే తీసుకొని తప్పులు దొర్లకుండా స్పష్టంగా పెద్ద అక్షరాలతో కంప్యూటర్ కాపీ ని తీసి అవధానికి అందుబాటులో ఉంచాలి. వాటిపై అడిగినవారి వివరాలు పేరు, మొబైల్ నెంబరు కూడా పొందు పరచాలి. దీనివల్ల సమయం వృధా కాకుండా చాలా కలిసి వస్తుంది .
ఈకార్యక్రమం ముందు స్వరనిధి డాక్యుమెంటరీ వీడియో ప్రదర్శన ఉంటుంది.దీనివల్ల అసలు ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతున్నది, స్వరనిధి లక్ష్యాలు, ఆశయ సాధన అన్ని విషయాలు ప్రేక్షకులకు తెలుస్తాయి. ఆ వీడియో ప్రదర్శనకు తగిన ఏర్పాట్లు ముందుగానే నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకోవాలి.
చివరిగా పాల్గొన్న పృచ్ఛకులందరికి స్వరనిధి సంస్థ సర్తిఫికేట్స్ అవధాని ద్వారా అందజేయ బడతాయి.
పూర్తి వివరముల కొరకు సంప్రదించండి …… Ph.No. 9848498344
72 మేళకర్త రాగములలోని 40 వివాది రాగముల పట్టిక
1. కనకాంగి
2. రత్నాంగి
3. గాన మూర్తి
4. వనస్పతి
5. మానవతి
6. తానరూపి
7. సేనావతి
8. రూపవతి
9. గాయక ప్రియ
10. హాటకాంబరి
11. ఝంకార ధ్వని
12. వరుణ ప్రియ
13. మార రంజని
14. నాగా నందిని
15. యాగ ప్రియ
16. రాగ వర్ధని
17. గాంగేయ భూషణి
18. వాగధీశ్వరి
19. శూలిని
20. చలనాట
21. సాలగం
22. జలార్నవం
23. ఝాలవరాళి
24. నవనీతం
25. పావని
26. రఘు ప్రియ
27. గవాంబోధి
28. దివ్యమణి
29. ధవళాoబరి
30. విశ్వంభరి
31. శ్యామలాంగి
32. నీతిమతి
33. కాంతామణి
34. చిత్రాంబరి
35. సుచరిత్ర
36. జ్యోతి స్వరూపిణి
37. ధాతు వర్ధని
38. నాసికా భూషణి
39. కోసలం
40. రసిక ప్రియ
స్వరనిధి
SWARANIDHI
Visit https://youtu.be/powFcuomp9w www.swaranidhi.org Ph.No. 9848498344
72 మేళకర్త రాగముల పట్టిక
I. ఇందు చక్రము:
1. కనకాంగి
2. రత్నాంగి
3. గానమూర్తి
4. వనస్పతి
5. మానవతి
6. తానరూపి
II. నేత్రచక్రము:
7. సేనావతి
8. హనుమతోడి
9. ధేనుక
10. నాటక ప్రియ
11. కోకిల ప్రియ
12. రూపవతి
III. అగ్ని చక్రము:
13. గాయక ప్రియ
14. వకుళా భరణం
15. మాయా మాళవగౌళ
16. చక్రవాకం
17. సూర్యకాంతం
18. హాటకాంబరి
IV. వేద చక్రము:
19. ఝంకార ధ్వని
2౦. నట భైరవి
21. కీరవాణి
22. ఖరహర ప్రియ
23. గౌరీ మనోహరి
24. వరుణ ప్రియ
V. బాణ చక్రము:
25. మార రంజని
26. చారుకేశి
27. సరసాంగి
28. హరి కాంభోజి
29. ధీర శంకరాభరణము
30. నాగా నందిని
VI. ఋతు చక్రము:
31. యాగ ప్రియ
32. రాగ వర్ధని
33. గాంగేయ భూషణి
34. వాగధీశ్వరి
35. శూలిని
36. చలనాట
VII. ఋషి చక్రము:
37. సాలగం
38. జలార్నవం
39. ఝాల వరాళి
40. నవనీతం
41. పావని
42. రఘుప్రియ
VIII. వసు చక్రము:
43. గవాంబోధి
44. భవ ప్రియ
45. శుభ పంతువరాళి
46. షడ్విధ మార్గిణి
47. సువర్ణా౦గి
48. దివ్యమణి
IX. బ్రహ్మచక్రము:
49. ధవళాoబరి
5౦. నామ నారాయణి
51. కామవర్ధని
52. రామ ప్రియ
53. గమనశ్రమ
54.వి శ్వంభరి
X. దిశి చక్రము:
55. శ్యామలాంగి
56. షణ్ముఖ ప్రియ
57. సింహేంద్ర మధ్యమం
58. హేమవతి
59. ధర్మవతి
6౦. నీతిమతి
XI. రుద్ర చక్రము:
61. కాంతామణి
62. రి షభ ప్రియ
63. లతాంగి
64. వాచస్పతి
65. మేచ కల్యాణి
66. చిత్రాంబరి
XII. ఆదిత్య చక్రము:
67. సుచరిత్ర
68. జ్యోతి స్వరూపిణి
69. ధాతు వర్ధని
70. నాసికా భూషణి
71. కోసలం
72. రసిక ప్రియ
స్వరనిధి
SWARANIDHI
Visit: https://youtu.be/powFcuomp9w www.swaranidhi.org Ph.No. 9848498344