Month: October 2017

దిగ్విజయంగా ముగిసిన 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు

జగమంత కుటుంబం
దిగ్విజయంగా ముగిసిన 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు & మొట్టమొదటి అమెరికా మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం….సమగ్ర నివేదిక వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) సంయుక్త నిర్వహణలో అమెరికా రాజధాని వాషింగ్టన్ DC లో ..సెప్టెంబర్ 23-24, 2017 లలో జరిగిన 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు అఖండ విజయం సాధించింది. ఒకరా, ఇద్దరా....154 మంది ప్రతినిధులు రెండు రోజులలో సుమారు 15 గంటల సేపు తెలుగు భాష సాహిత్యానందంతో జేవిత కాలం గుర్తుంచుకునే అనుభూతి పొందారు. భారత దేశ నుంచి వచ్చిన పది మంది సాహితీవేత్తలు, అమెరికాలో అనేక నగరాల నుంచి వచ్చిన సుమారు 30 మంది అమెరికా తెలుగు రచయితలు, 30 మంది స్థానిక తెలుగు ఉపాధ్యాయులు, ఇతర భాషా ప్రియులు, సాహిత్యాభిమానులతో సభా ప్రాంగణం కళ కళ లాడింది. ముందుగా సుధారాణి కుండపు, కె. గీత మరొక గాయని ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ వేయగా సుప్రసిద్ధ అమెరిక

తెలుగు సాంస్కృతికోత్సవం 2017

ఈ మాసం సిలికానాంధ్ర
అక్టోబర్ 7న న్యూజెర్సీ నగరంలో విజయవంతంగా జరిగిన తెలుగు సాంస్కృతికోత్సవం పై ఒక ప్రేక్షకుడి అనుభూతి: నూట నలభై అక్షరాల్లో సంభాషణలు; మూడు నిమిషాల కంటే ఎక్కువగ దేని పైన దృష్టి పెట్టడం కష్టంగా వున్న ఈ రోజుల్లో; WhatsApp ఫార్వర్డ్లు; ఫేస్ బుక్ లైక్ ల మధ్య, అతి వేగంగా గడిచి పోతున్న కాలం ఇది. నిలకడగా వుండి, ఏ ఆర్భాటం లేకుండ, ఏ సెన్సేషన్ లేకుండ కేవలం మన సంస్కృతి,సాంప్రదాయం మరియు చరిత్ర ను గుర్తించి, గౌరవించాలన్న ఒకే ఒక ఉద్ధేశంతో ఒక కార్యక్రమం చెయ్యాలనుకోవడం గొప్ప ఆలోచన. ఆలోచన గొప్పగ వుంటే సరిపోదుకదా. దానిని అంతే గొప్పగా అమలుపర్చాలి. అందులోను, ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేయాలి. అసలు ఇది సాధ్యమా? ఇలాంటి సాహసమే నిన్న సిలికాన్ ఆంధ్ర మనబడి వారు చేశారు, చేసి గెలిచారు, గెలిచి మెప్పించారు. ఆరు గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమంలో, జానపద గేయాలు, నృత్యాలు, మన పండగలైన ఉగాది నుండి ముస్లింలు జరపుకునే మొహ

పాపం! పిల్లలు

కవితా స్రవంతి
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు అభం శుభం తెలియని పిల్లలను, కేర్ టేకర్స్ కు అప్పజెప్తున్నారు. దినదినగండంగా ఆ పిల్లలు, డే కేర్ సెంటర్ లో గడుపుతున్నారు. అర్ధమే తప్ప ఆత్మీయత పట్టని మనస్తత్వంతో, చదువేతప్ప సంస్కారం మనసుతలుపు తట్టని అజ్ఞానంతో ఈ కేర్ టేకర్స్, అమాయకత్వమేతప్ప వేరేదీ తెలియనిపిల్లలను, సంపాదనకోసం తల్లితండ్రులుపడే అత్యాశకి బలవటమేతప్ప వేరేమీచేయలేని బేలలను, తమదైన అజ్ఞానంతోఆడిస్తున్నారు, లాల్యాన్ని పొందాల్సిన వారిబాల్యాన్ని తమదైన నిర్లక్ష్యంతో ఓడిస్తున్నారు. బేర్ మంటూ ఈ పసిపిల్లలు పాపం కేర్ సెంటర్ లలో గడుపుతున్నారు. తల్లితండ్రుల బుద్ధిలేనితనాన్ని ఆసరాగా చేసుకొని ఈబేబీ కేర్ సెంటర్ లను నడుపుతున్నారు. ఇది మదుపులేని వ్యాపారమని, ఇది అదుపులేని వ్యవహారమని తెలిసినా, పసిపిల్లల బాల్యం నుసిఅవుతున్నా, ఎవరూ పట్టించుకోవటం లేదు, ఈ డే కేర్ సెంటర్ల ఆట కట్టించాలనుకోవటం లేదు, ఈ పసి ప

సంగీత పాఠాలు- (నాలుగవ భాగం)

సేకరణ: డా.కోదాటి సాంబయ్య గీతములలోని స్వరములు సరళంగా ఉండి, ఎక్కువ దాటు స్వరములు గానీ, క్లిష్టమైన సంచారములు గానీ లేకుండా విద్యార్థి తేలిగ్గా పాడడానికి వీలుగా ఉంటాయి. ఉదా: మలహరి రాగం లోని శ్రీ గణనాధ గీతములో పల్లవి చూడండి. మ ప | ద స స రి || రి స | ద ప మ ప || రి మ | ప ద మ ప || ద ప | మ గ రి స || శుద్ధ మధ్యమం సరళీ, జంట, వరుసలు, అలంకారములలో ఇదివరకే పాడడం అలవాటు అయింది కనుక ...ఈ గీతం మంగళకరమైన శుద్ధ మధ్యమం తో ప్రారంభించబడి వెంటనే పక్క స్వరమైన పంచమం తో ద్రుతం ముగుస్తుంది. ఇక లఘువులో దైవతం తో ప్రారంభించి పై షడ్జమం. పై రిషభం తో ముగుస్తుంది . తాళములలో రూపక తాళం సరళంగా ఉంటుంది. మొదటి ఆవృత్తం తో ఆరోహణ అయింది. ఆరోహణ లో కూడా మొదటి ఆవృత్తం లోని స్వరాలే వచ్చాయి. పల్లవి రెండో లైన్ రిషభం తో మొదలై మధ్యమం, పంచమం, దైవతం వరకు వెళ్లి మళ్ళీ మధ్యమం పంచమం కు అవరోహణ మై రెండవ ఆవృత్తం లఘువులో గాంధారం తో కలిసి మ గ

అమెరికాలో యోగీశ్వరుడు – చివరి భాగం

కథా భారతి
-ఆర్. శర్మ దంతుర్తి (జరిగిన కధ – పరమహంస గారి రెండో అమెరికా ట్రిప్పులో ఓ సర్జన్ గారింట్లో ఆయనకి పాదపూజ ఏర్పాటు చేయబడింది. ఆ పూజ తాలూకు ఫోటోలు సుబ్బారావు ఎప్పటిలాగానే ఎవరి అనుమతులూ అడక్కుండా తన వెబ్ సైట్లో పెట్టేసేడు. అయితే ఎవరికీ తెలియని మూడో పార్టీ, ఆ వెబ్ సైట్లో ఫోటోలు చూసి సర్జన్ గారింట్లో పకడ్బందీగా దొంగతనానికి పూనుకుంది. ఇంట్లో సమస్తం దోచుకోబడ్డాక సర్జన్ గారూ వాళ్ళావిడా లెంపలు వేసుకుని సుబ్బారావు శిష్యరికంలోంచి బయటపడ్డారు. దొంగతనం కేసులో జరిగినది విన్నాక పోలీసులు పరమహంస గారి వెబ్ సైటుని ఒక కంట కనిపెడుతున్నారు. సర్జన్ ని వదిలేసి మిగతా శిష్యగణం పరమహంసగారితోపాటు ఓ రిట్రీటు కి మిషిగన్ రాష్ట్రంలో “గాంగెస్” అనే ఊరికి వెళ్ళడానికి సమాయుత్తమౌతున్నారు. ఇంక చదవండి) రోజులు గడిచి రిట్రీటుకి మరో రెండు, మూడు గంటల్లో బయల్దేరుతారనగా సుబ్బారావుకి ఆ రోజు తనింకా రోజూ వెళ్ళే వాకింగ్ కు వెళ్ళలేదని అర్జెంట

శ్రీరామాయణ సంగ్రహం – యుద్ధకాండ

ధారావాహికలు
శ్రీరామరావణుల ప్రచండయుద్ధం – రావణసంహారం అప్పుడు శ్రీరాముడు భూమిమీద నిలిచి రథస్థుడై ఉన్న రావణుడితో పోరాడటం బాగాలేదని దేవతలంతా మాతలి సారథిగా ఆయన రథాన్ని రాముడికి సాయం కోసం పంపవలసిందని ఇంద్రుణ్ణి కోరారు. అప్పుడు మాతలి రాముడి దగ్గరకు ఇంద్రుడి రథాన్ని తీసుకొని వచ్చాడు. రాముడు సంతోషంతో దాని నెక్కి పరమభయంకరంగా రావణుడితో యుద్ధం చేశాడు. రావణుడు ఏ అస్త్రం ప్రయోగిస్తే మళ్ళీ ఆ అస్త్రంతోనే దాన్ని నిస్తేజం చేశాడు రాముడు. మహాసర్పసంభరితమైన రాక్షసాస్త్రాన్ని రావణుడు రాముడిపై ప్రయోగించగా రాముడు గరుడాస్త్రంతో దాన్ని రూపుమాపాడు. అప్పుడు రావణాసురుడు మహోగ్రుడైనాడు. బాణవర్షం రాముడిమీద కురిపించాడు. రాముణ్ణి ఆయన రథసారథి మాతలిని నొప్పించాడు. ఆ రథధ్వజాన్ని ఒక బాణంతో కొల్చాడు. దేవేంద్రుడి గుర్రాలకు కూడా తన ప్రతాపం చూపాడు. ఆకాశంలో దేవతలు, గంధర్వులు, చారణులు, సిద్ధులు, మహర్షులు కూడా రాముడి ఈ సంకటస్థితి చూసి విషాదం పొ

విశ్వామిత్ర 2015 – నవల ( 15వ భాగము )

ధారావాహికలు
– యస్. యస్. వి రమణారావు సిబిఐ గెస్ట్ హౌస్ లో ఎడంచేయికి, కాలుకి కట్లతో అభిషేక్ సోఫాలో, కుడిచేతికి చిన్న ప్లాస్టర్ వేసుకుని రాజు అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుని ఉన్నారు. జగదీష్ అభిషేక్ ఎదురుగుండా ఉన్న సింగిల్ సీట్ సోఫాలో కూర్చుని ఉన్నాడు. అభిషేక్ మొహం చాలా సీరియస్ గా ఉంది. అభిషేక్ అడిగాడు "జగదీష్ మీకు, నాకు రాజు, రవిబాబుకి తప్ప ఇంకెవరికీ కేసుకు సంబంధించినవాళ్ళు దాబాలో పార్టీ చేసుకుంటున్నట్టు తెలియదు.మీరెవరికైనా చెప్పారా?రాజు,రవిబాబుల దగ్గర నేను కన్ఫర్మ్ చేసుకున్నాను.వాళ్ళెవ్వరితోనూ మాట్లాడలేదు." జగదీష్ ఒక నిముషం తటపటాయించాడు."ఇంకొక్కమాట.మీరు సమాధానం చెప్పబోయేముందు చంపబడ్డ ఆ నలుగురు వ్యక్తులని గుర్తుపెట్టుకోండి"జగదీష్ మొహం ఎర్రగా మారింది. "నేను హోమ్ మినిష్టర్ గారితో మాట్లాడాను" "థాంక్యూ. అన్నట్టు, జగదీష్, నిన్న మన కస్టడీలోకి తీసుకున్నఆ గ్రాండియోర్ హోటల్ కేప్టెన్, అదే దాబ

నాన్న

కవితా స్రవంతి
- అమరవాది రాజశేఖర శర్మ కంటిరెప్పగా చేనుకు కంచె లాగ ప్రేమతో నన్ను కాపాడి పెంచెనాన్న కష్టములనెన్నొ పొందినా కలత పడక కోరు కోర్కెల నన్నిటిన్ కూర్చె నాన్న లోక రీతిని సంఘపు లోతు తెలిపి మంచి వ్యవహర్తగా నన్ను మలచె నాన్న వేలుపట్టుకు నడిపించి వెంట ద్రిప్పి మంచి చెడుల వివేకము పంచె నాన్ పండుగలు సంబరాలలో మెండు ముదము నాకు నందించి నావెంట నాడె నాన్న అలుకబూనిన ననుగని పలుకరించి కొత్త బొమ్మలు వరముగా కురిసె నాన్న నేననారోగ్యమున్ గన తాను నిద్ర భోజనము మాని దేవుళ్ళ పూజ సేయు నేను రాయు పరీక్షన నేర్పు కోరి సతతముపవాస దీక్షలన్ సలుపు నాన్న

పిల్లలు-పెద్దలు

కవితా స్రవంతి
- పారనంది శాంత కుమారి విదేశాలకు వెళ్లిపోతూ విచిత్రంగా పిల్లలు, వారిబుద్ధి నెరగలేక విచారంతో పెద్దలు. రెక్కలొచ్చి అక్కడికి ఎగిరిపోయిన పిల్లలు, ముక్కలైన మనసుతో ఇక్కడే మిగిలిపోయిన పెద్దలు. కొత్త ఉద్యోగంలో అక్కడ పిల్లలు, కొత్త ఉద్వేగంతో ఇక్కడ పెద్దలు. అక్కడ సంపాదనకై ప్రాకులాడుతూ పిల్లలు, ఇక్కడ మనోవేదనతో మగ్గిపోతూ పెద్దలు. అక్కడ సంపాదించుకున్నడబ్బులతో పిల్లల జల్సాలు, ఇక్కడ ఆపాదించుకున్నజబ్బులతో పెద్దల నీరసాలు. ఇక్కడున్న పెద్దలదృష్టి తమపిల్లల పైనే, అక్కడున్న పిల్లలదృష్టి మాత్రం వాళ్ళపిల్లల పైనే. భార్యాపిల్లలే లోకం అక్కడ పిల్లలకి, పిల్లలు దూరమై శోకం ఇక్కడ పెద్దలకి. గంటలను కేష్ చేసుకుంటూ అక్కడ పిల్లలు, నిముషాలను లెక్కపెట్టుకుంటూ ఇక్కడ పెద్దలు. అక్కడ కాస్ట్లీ ఇల్లు కొనుక్కొని పిల్లలు, ఇక్కడ కాటికి కాళ్ళు చాచుకొని పెద్దలు. అక్కడ శాశ్వత నివాసంకై ఆ దేశం గ్రీన్ కార్డు కోసం పిల్లఎదురు

ఆత్మవిశ్వాసం!!

కవితా స్రవంతి
--ఎస్.ఎస్.వి.రమణరావు వందమందైనా అబద్ధం చెబుతుంటే ఎదిరించి ఒక్కడైనా నిజం చెబితే గుర్తించి వాడి పక్క నిలబడ గలవా నువ్వు? నలుగురు కలిసి పనిచేస్తే పొరపాట్లు జరిగే అవకాశం తక్కువని ఒక్కడే అంతపనీ చేస్తే పొరపాట్లు పెరిగే అవకాశం ఎక్కువని తెలుసుగా నీకు? నువ్వు చేసిన తప్పులు ఎదుటి వాడి తప్పుల్ని క్షమాదృష్టితో చూసేందుకు నువ్వు పొందిన ఓటమి ఎదుటివాడి ఓటమిని సానుభూతితో పరిశీలించేందుకు తోడ్పడుతున్నాయా? తప్పులు చేసినవాళ్ళు తప్పించుకు తిరుగుతున్నంతకాలం తప్పులు జరుగుతూనే ఉంటాయని శిక్షా భయం లేనిదే నేరాలు తగ్గవని వేరే చెప్పక్కర్లేదుగా? స్వార్థంకొద్దే కాక సమాజం కోసం ఎంత సహనం చూపించగలుగుతున్నావు నువ్వు? ఎంత సమయం ఎంత ధనం వెచ్చించగలుగుతున్నావు నువ్వు? సుఖాలకి లొంగిపోకుండా దుఃఖాలకి కృంగిపోకుండా వర్తమానంలో కనబడుతున్న దుర్భర గతాన్ని మార్చుతూ అందమైన భవిష్యత్ సౌధాన్ని పునాద