Month: October 2017

భక్త ధృవ

బాలానందం
-మొదటిరంగం- [సునీతి పూజచేస్తూ ,పాటపాడుతుంటుంది [మహరాజు ఉత్తానపాదుడు వస్తాడు ] దేవీ! సునీతీ! [సునీతి పూజనుండీ లేచి వచ్చి ] -ప్రభూ దయచేశారా! రండి! ఉత్తానపాద- ఏమి చేయుచుంటివి దేవీ! సునీతి- మరేముంది ప్రభూ!మన దేశప్రజలందరినీ హాయిగా ,ఏకష్టాలూ లేకుండా ఆశీర్వదించమని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.ప్రభూ! ఉత్తాన- నీకెప్పుడూ ఆప్రార్ధనేనా !నాగురించీ ఏమాత్రమూ శ్రధ్ధ లేదా! సునీతి-ప్రభూ! అదంతా మీ గురించే! మన ప్రజలంతా హాయిగా ఉంటే మీరూ హాయిగా ఉంటారుకదా! సమస్యలోకాః సుఖినో భవంతు ఉత్తాన - [లేచి] హూ! నీవదే చేసుకపో![ కోపంగా వెళ్ళిపోతాడు] సునీతి- ప్రభూ ! ప్రభూ! -2వ రంగం- సురుచి పూలమాల అల్లుతుంటుంది. ఉత్తానపాదుడు వస్తాడు. ఉత్తాన- సురుచీ! సురుచీ! సురుచి-ప్రభూ !దయచేయండి . ఆశీనులుకండి { అంటూ పూలమాల అతడి మెడలో వేస్తుంది] ఉత్తాన _ ఆహా! ఈ పుష్పాలు ఎంత మధురమైన సువాసనతో ఉన్నాయి? ఎక్కడిది దేవీ ఈమాల? సురుచి- ప్ర

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
అష్టవిధ నాయికలు – విప్రలబ్ధ - టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య కీర్తించిన విప్రలబ్ధ శృంగార కీర్తన తెలుసుకునే ముందు విప్రలబ్ధ నాయిక గురించి కొంత తెలుసుకుందాం. “క్వచిత్సంకేత మావేద్య దయితే నాథవఞ్చితా| స్మరార్తా విప్రలబ్ధేతి కలావిద్భిః ప్రకీర్త్యతే||” అని విద్యానాథుని ప్రతాపరుద్రీయములో చెప్పాడు. "ఒకానొక సంకేతస్థలమునకు రమ్మనిన ప్రియుడు, ఆ సంకేతమునకు తాను రాకుండుటచే వంచింపబడి, స్మరార్తయైన నాయిక విప్రలబ్ధ యని కలావిదులందురు" అని అర్థము. భానుదత్తుడు రసమంజరిలో "సంకేతనికేతనే ప్రియమనవలోక్యసమాకులహృదయా విప్రలబ్ధా| అస్యాశ్చేష్టా నిర్వేద నిశ్వాస సంతాపాలాప భయ సఖీజనోపాలంభ చింతాశ్రుపాత మూర్ఛాదయః|" – అన్నాడు. ‘సంకేతనికేతనమున ప్రియుని గానక వ్యాకులమతి యగునది విప్రలబ్ధ. తత్ఫలితముగా నీమె నిర్వేదము, నిశ్వాసము, సంతాపము, ప్రలాపము, భయము, చెలులను, పరిసరములను నిందించుట, చింతించుట, ఏడ్చుట, మూర్ఛిల్లుట – అను చేష్టలను చేయు

ప్రారబ్ధ కర్మలు

సారస్వతం
-శారదాప్రసాద్(టీవీయస్.శాస్త్రి) ​ముందుగా కర్మ అంటే ఏమిటో తెలుసుకుందాం!కర్మ అంటే 'విధి' కాదు. karma is not fate!ఈ రెండిటికీ చాలా తేడా ఉంది. కర్మ అనేది ఒక పని.అది మనంతట మనం కల్పించుకున్నదే!అది మంచిది కావచ్చు లేదా చెడ్డది కావచ్చు! అంటే కర్మ వేరు, కర్మ ఫలం వేరు. కర్మ అంటే మనం ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే పనులన్నీ కర్మలే.కర్మ సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు గత జన్మ ఒకటుందని,మరణించిన తర్వాత మరొక జన్మ ఉంటుందని నమ్మి తీరాల్సిందే!అయితే,నేను దీన్ని గురించి ఇంకా డోలాయమాన పరిస్థితిలోనే ఉన్నాను.ఇంకా నాకు ఒక నిశ్చితమైన అభిప్రాయం ఏర్పడలేదు.అందుకే నా కొన్ని వ్యాసాల్లో భిన్నమైన అభిప్రాయాలు కనపడుతుంటాయి. అర్ధం చేసుకున్నవారు accept చేస్తారు. అర్ధం చేసుకోనివారు నిలకడలేని మనిషిగా నన్ను భావిస్తుంటారు. నిజానికి నేను కోరుకునేది కూడా ఈ నిలకడలేని స్థితినే! మనం వృక్షాలలాగో, కొండలలాగో ఒకేచోట