Month: November 2018

ఆరోగ్యమే మహాభాగ్యం

సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే | ఔషధం జాన్హవీతోయం వైద్యో నారాయణో హరిః వైద్యుడు 'నారాయణుడు 'తో సమానమని పై శ్లోకం అర్థం. మనకొచ్చే వ్యాధులు మందులతోనే నయం కావు. ఔషాథాలతో పాటు, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు కూడా చికిత్సకు దోహదం చేస్తాయి. మన జీవనశైలి, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యాంశాలే. సిలికానాంధ్ర సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయలను విస్తరింపజేస్తూ తెలుగువారి జీవనవిధానాన్ని గత పదిహేడేళ్ళుగా మెరుగుపరుస్తున్నది. ఇప్పుడు వైద్యసేవలను అందించడానికి కూచిపూడీ గ్రామంలో 'రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవనీ వైద్యాలయం' ప్రారంభించింది. ఇది ఈ రంగంలో మొదటి అడుగు మాత్రమే. ముందు ముందు వైద్యరంగంలో చాలా సేవలు చేయాలన్నది సిలికానాంధ్ర ఉద్దేశం. వివరాలకు 'ఈ మాసం సిలికానాంధ్ర ' చూడండి. అలాగే మనసుకు ఆహ్లాదపరిచే ఇతర రచనలను చదవండి. ***

పాపం! పిల్లల పాపం

కవితా స్రవంతి
- పారనంది శాంతకుమారి పుట్టకముందు దేవుడి దయ. పుట్టిన తరువాత ఆయా దయ. రెండు సంవత్సరాలోచ్చేసరికి బేబీకేర్ సెంటర్ దయ. చదువులకొచ్చేసరికి హాస్టల్ దయ. ఉద్యోగమొచ్చేక విదేశాల దయ. అలా పెరిగిన పిల్లలకు తెలియని పదం దయ. మరి వాళ్ళకెలా తెలుస్తుంది దయ? ఇక వాళ్ళెలా చూపుతారు దయ? ఐనా తాము పొందని దయను వాళ్ళెలా చూపగలరు? వాళ్ళ అమ్మానాన్నల ఆవేదనను వాళ్ళెలా బాపగలరు? అందుకే, అలాంటి పిల్లలు తల్లితండ్రులకు దూరమౌతున్నారు, వారికి అమ్మానాన్నలు భారమౌతున్నారు. అందుకే వారిని వృద్ధాశ్రమాలలో చేరుస్తున్నారు. ***

నిజమైన ప్రేమ

కవితా స్రవంతి
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు. నిజమైన ప్రేమెప్పుడూ నిదర్శనాన్నికోరదు, పదిమందిలో ప్రదర్శనాన్ని కోరదు. మెప్పును ఆశించదు, ముప్పు తలపెట్టదు. విశ్వాసంతోనే విస్తరిస్తుంది,విశ్వాసంలోనే వికసిస్తుంది. మల్లెపూలు,మంచిముత్యాలు ప్రేమకు వీక్షణానికి,ఆక్షణానికి నేస్తాలు. కానీ మంచిమనసు,మంచిమాటలు ప్రేమకు శాశ్వతంగా ప్రశస్తాలు. నిజమైన ప్రేమ పరితాపాన్నిఒర్చుకుంటుంది, ప్రతికులాలనుండి పాఠాలను నేర్చుకుంటుంది. ఒరిమినే తన కూరిమిగా,చెలిమినే తన బలిమిగా, మౌనాన్నే మేలిమిగా భావిస్తుంది. ఇచ్చినమాటనే బాటగా చేర్చుకుంటుంది. తను కొలువున్న మనసునే మధురమైన భావాల తోటగా మార్చుకుంటుంది. ****