Month: December 2018

సుజననీయం

సుజననీయం
"సంస్కృతి అంటే?" - తాటిపాముల మృత్యుంజయుడు సంస్కృతి అంటే జీవన విధానం, నాగరికత, భాష, సాహిత్యం, కళలు ఇలా కలగలుపుతూ ఎన్ని విధాలుగానైనా చెప్పుకోవచ్చు. సంసృతి అంటే ముందు కాలం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని భావితరాలకు భద్రంగా అందించే సంపద అనుకోవచ్చు. కళలు 64 (చతుషష్టి) విధాలు. వెనువెంటనే మనకు తట్టేవి సంగీతం, సాహిత్యం, నాట్యం, చిత్రలేఖనం మొదలుగాగల జనసామాన్యమైనవి. సర్వే లెక్కల ప్రకారం, ఉత్తర అమెరికాలో గత కొన్నేళ్ళుగా అత్యంత గణనీయంగా పెరుగుతున్న జాతి తెలుగు మాట్లాడే కుటుంబాలు. ఈ విషయాన్ని ముందస్తుగానే గమనించి అనుకుంటాను, సిలికానాంధ్ర 17 ఏళ్ళ క్రితం ఆవిర్భవించి తెలుగు సంసృతిని ముందు తరాలకు అందజేయాలనే ఉద్దేశంతో నిర్విరామంగా కృషి చేస్తున్నది. అదే విధంగా సుజనరంజని మాసపత్రిక కూడా రచనల రూపంలో తెలుగు సంస్కృతిని వెల్లడించడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇందుకు సహకరిస్తున్న మీకందరికి సాహితీ వందనాలు!  

నిర్వాణ షట్కం

సారస్వతం
-శారదాప్రసాద్ ఆది శంకరాచార్య (వేదాంతపరంగా చాలా గొప్ప భావన ఇది! అందరూ జాతి,కుల,మత బేధాలు లేకుండా తప్పకుండా కంఠతా చెయ్యగలరు,అర్ధంతో సహా!ఎందుకంటే,ఆత్మతత్త్వం అందరికీ ఒకే విధంగా ఉంటుంది కనుక!నిర్వాణం అంటే సూక్ష్మంగా చెప్పాలంటే మోక్షం! ఆరు శ్లోకాలలో ఆత్మ స్వరూపాన్ని గురించి అద్భుతంగా బోధచేసారు ఆదిశంకరులు. ఈ శ్లోకాలు ఆత్మతత్వాన్ని గురించి చక్కగా తెలియచేశాయి కనుక, ఈ ఆరు శ్లోకాలని ఆత్మషట్కం అని కూడా కొందరు అంటారు.షట్కం అంటే ఆరు! ప్రపంచ సాహిత్యం మొత్తం మీద ఇలా వేదాంత సారాన్ని ఇంత సరళంగా,క్లుప్తంగా చెప్పిన జ్ఞాని మరెవ్వరూ ఉండకపోవచ్చు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ! వేదాంత సారమంతా ఈ ఆరు శ్లోకాలలో నిక్షిప్తం చేసిన ఆది శంకరులకు ప్రణమిల్లుతున్నాను!) 1.మనోబుధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్త్రే న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయు: చిదానంద రూప: శివోహం శివోహం అర్ధం-మనస్సు,బుద్ధి,

వీక్షణం-76 సమీక్ష

వీక్షణం
-వరూధిని వీక్షణం-76 వ సమావేశం ఫ్రీ మౌంట్ లోని షర్మిలా గారింట్లో ఆద్యంతం రసవత్తరంగా జరిగింది.ఈ సభకు శ్రీ తాటిపామల మృత్యుంజయుడు అధ్యక్షత వహించారు.ముందుగా సభలో వీరేశలింగం గారి గురించి ప్రసంగిస్తూ శ్రీ అక్కిరాజు రమాపతిరావు వారి రచనలపై తన డాక్టరేట్ రోజుల్ని గుర్తు తెచ్చుకున్నారు.వీరేశలింగం గారి విశిష్టతను సభకు పరిచయం చేస్తూ ఆధునిక ఆంధ్ర దేశం గోదావరి అయితే వీరేశలింగం నాసికాత్ర్యయంబకం అన్నారు. తెలుగు సాహిత్యంలో ఆధునిక ప్రక్రియలైన నవల, కథ, నాటిక మొ.న అన్నిటికీ ఆయనే ఆద్యుడని పేర్కొన్నారు. ఆయన వితంతువులకి ఉచిత విద్యని అందించాడు.ఆయనను గురించి చిలకమర్తి "అటువంటి సంఘసంస్కర్త, అటువంటి రచయిత మరి కొన్ని వందల ఏళ్లకు గాని మళ్లీ పుట్టడు" అన్నారని అన్నారు.వీరేశలింగం "వివేకవర్థిని" పత్రికను నడిపారు, అనేక ప్రహసనాలు రాసేరు, ఆధునిక భావాల్ని విస్తరింపజేసారు. తన స్వీయ చరిత్రను తన శ్రీమతి రాజ్యలక్ష్మికి అంకితం

సంగీత రంజని జనవరి 2019

కేదార గౌళ \ దేశ్ -డా. కోదాటి సాంబయ్య కేదారగౌళ 28 వ మేళకర్త హరికాంభోజి జన్యం...భక్తీ, శృంగార రసాలు పలికించే రాగం. ఔడవ-సంపూర్ణ రాగం. ఉపాంగ రాగం, వర్జ్య రాగం. ఆరోహణ: స రి మ ప ని స ....అవరోహణ: స ని ద ప మ గ రి స...చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి ధైవతం, కైశిక నిషాధం. ని ద పా అన్నప్పుడు ని ద దానిప అనీ...మ గ రీ అన్నప్పుడు మ గ గామరీ అనీ పలుకుతుంది. ఈ రెండు ప్రయోగాలలో దానిప, గామరీ అనే గమకాలు కేదారగౌళ రాగం యొక్క ముఖ్యమైన గమకాలు . సురటి, నారాయణ గౌళ రాగాలు ఇంచుమించు కేదారగౌళ స్వరస్థానాలు ఒక్కటే. పాడేప్పుడు జాగ్రత్తగా పాడాలి. గమకాల తోటే మూడు రాగాలనూ పోల్చవచ్చు. ఉదయం పూట పాడవలసిన రాగం. కేదారగౌళ లో కొన్ని ముఖ్యమైన రచనలు: సామి దయ జూడ-ఆది తాళ వర్ణం-తిరువట్టియూర్ త్యాగయ్య; వేణుగానలోలుని గన, తులసీ బిల్వ, కరుణా జలధి -త్యాగయ్య; సరగున పాలింప-రామనాధపురం ( పూచి)శ్రీనివాస అయ్యంగార్ ; ఏమ

విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

ఈ మాసం సిలికానాంధ్ర
University of Silicon Andhra First Convocation Sunday January 27, 2019 Namaskaram! The University of Silicon Andhra (UofSA) made a historic beginning two years ago offering first time the Certificate, Diploma and Masters courses in Indian Fine Arts & Languages in USA. I cordially invite you to join with your family and friends the FIRST CONVOCATION of the University of Silicon Andhra on Sunday January 27, 2019 at 10 AM Campbell Heritage Theater 1 W Campbell Avenue, Campbell, CA 95008 Travel and Hotel Details: Nearby Airports: San Jose (SJC), San Francisco (SFO), Oakland (OAK) Hotel: Residence Inn by Marriott, Milpitas Reservation Link for discount price (Last date to book: 1/5/19) For Weekdays: Book your group rate for Graduation Ceremony Weekday For Weekends: Book...

గజల్

కవితా స్రవంతి
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ కవిత్వమే ఎప్పుడూ రాయాలని ఉంటుంది వాస్తవాన్ని కళ్లముందు పెట్టాలని ఉంటుంది నీతిని,నిజాయితిని ఉరి వేసి చంపుతుంటే నిప్పులా,అగ్గిరవ్వలా మండాలని ఉంటుంది న్యాయానికి సంకెళ్లు వేసి తిప్పుతుంటే ధర్మం వైపు ఎప్పుడూ నిలబడాలని ఉంటుంది సంకుచితమే సమాజంలో ఏలుతూ ఉంటే మానవతా జెండా ఎగరేయాలని ఉంటుంది మనసుకు గాయాలు తగులుతూ ఉంటే నిస్సహాయంగా ఉండిపోవాలని ఉంటుంది తడిలేని పదాలను పలుకుతూ ఉంటే మనిషిపై జాలి చూపాలని ఉంటుంది కోరికలు ఎప్పుడూ జనిస్తూ ఉంటే భీంపల్లి మనసును అదుపులో పెట్టాలని ఉంటుంది ****

ఆభరణాలు

కవితా స్రవంతి
- పారనంది శాంతకుమారి. అజ్ఞానం,అమాయకత్వం బాల్యానికి ఆభరణాలు. ప్రేమ,ద్వేషం యవ్వనానికి ఆభరణాలు. సుఖ దుఃఖాలు జీవితానికి ఆభరణాలు. జపతపాలు జ్ఞానానికిఆభరణాలు. మందులు,మాత్రలు ఆర్యోగ్యానికి ఆభరణాలు. తీర్ధయాత్రలు మనో వికాసానికి ఆభరణాలు. గుళ్ళు,గోపురాలు సచ్ఛీలతకు ఆభరణాలు. ***