Month: March 2019

వీక్షణం- 79

వీక్షణం
-వరూధిని వీక్షణం 79 వ సమావేశం మిల్పిటాస్ లోని తాటిపామల మృత్యుంజయుడు గారింట్లో జరిగింది. ఈ సమావేశానికి శ్రీ సుభాష్ పెద్దు అధ్యక్షత వహించారు. ముందుగా చలం గారి కథ "యముడితో చలం" కథను డా||కె.గీత, శ్రీమతి కె. శారద గార్లు చలం, యముని పాత్రలుగా కథను చదివి వినిపించి అందరినీ అలరించారు.కథా పథనం తర్వాత సభలో రసవత్తరమైన చర్చ జరిగింది. ఈ కథ 1958 లో చలం గారు పూర్వ జీవితానికీ, ఆశ్రమ జీవితానికీ మధ్య కాలంలో రాసినదని, కథలో తత్త్వ విచారం సరిగా జరలేదని, కొన్ని ప్రశ్నలకు అర్థం లేనిదని, తప్పు చేస్తేనే శిక్షా?, స్వరం, నరకం అంటే ఏవిటి? పాప పుణ్యాలకు అర్థాలు ఏవిటి? చదువరుల విశ్లేషణ ఎలా ఉంది? అసలు ప్రశ్నలు కథ ముగిసేక మొదలవుతాయి, యముణ్ణి విమర్శిస్తే ఎక్కడా ఎందుకు ప్రతి చర్చ ఉండదు? యముడు, చలం ఇద్దరూ చలమే. చలం గారి ఆత్మాన్వేషణే ఈ కథ..." అంటూ విభిన్న అభిప్రాయల్ని వెలిబుచ్చారు.ఆ తర్వాత కిరణ్ ప్రభ గారు "చలం జీవితం లో

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య సిగ్గుతోడ గొంకితేను చిక్కునా మగవాడు అన్నమయ్య తానో చెలికత్తెగా మారి అమ్మ పద్మావతీ దేవికి శృంగారం విషయంలో సలహాలిస్తున్నాడు. ఆ వింతలు విశేషాలు మనమూ విని తరిద్దాం రండి. కీర్తన: పల్లవి: సిగ్గుతోడ గొంకితేను చిక్కునా మగవాడు బిగ్గె గాగిలించుకొని పెనగినగాక చ.1. పెదవిపై మాటల బ్రియములు పుట్టునా వుదుటు గుబ్బల బతి నూదిన గాక సదరపు జెనకుల చవులు పుట్టీనా సదమదముగ రతి సలిపిన గాక || సిగ్గుతోడ || చ.2. సెలవుల నవ్వితేనే చిత్తము గరగునా సొలయుచు మోవిచవి చూపిన గాక ములువాడి చూపుల మోహములు పుట్టునా లలిదమ్ములము పొత్తు గలసిన గాక || సిగ్గుతోడ || చ.3. సరసములాడితేనే సంగాతాలెనయునా సరుస దనువు లొక్కజటైన గాక యిరవై శ్రీవేంకటేశుడింతలోనె నిన్నుగూడె పరపుపైనే చాలునా వురమెక్కిన గాక || సిగ్గుతోడ || (రాగం: సాళంగనాట; రేకు సం: 827, కీర్తన; 18-162) విశ్లేషణ: సిగ్గుతోడ గొంకితేను చిక్కునా మ

అమెరికా ఉద్యోగ విజయాలు – 4

ధారావాహికలు
సత్యం మందపాటి చెబుతున్న అమెరికా ఉద్యోగ విజయాలు - 4 శతకాలతో శతకాలు మొత్తం మూడు ఇంటర్వూలకు వెళ్ళిన అర్జున్ని, ఒక కంపెనీ వెంటనే పిలిచి ఉద్యోగంలో చేరమన్నది. అదే కృష్ణతో అంటే, ‘మన భారతదేశంలో కక్కొచ్చినా, కల్యాణమొచ్చినా ఆగవు అనే ఒక సామెత వుంది. అలగే అమెరికాలో వుంటే, ఉద్యోగమొచ్చినా ఆగదు. శుభం. వెంటనే చేరు’ అన్నాడు. ‘అంతేకాదు బావా, ఉద్యోగం కూడా మీ వూళ్లోనే. వచ్చే సోమవారమే చేరమన్నారు’ అన్నాడు అర్జున్. ‘మరింకేం? తంతే గారెల బుట్టలో పడ్డావన్నమాట. మా ఇంట్లోనే వుండి మీ కంపెనీకి దగ్గరలోనే ఒక ఎపార్ట్మెంట్ ఎతుక్కోవచ్చు’ అన్నాడు కృష్ణ. ‘అది కూడా మా కంపెనీ వాళ్ళే చేశారు. పక్కనే వున్న ఎపార్ట్మెంట్ బుక్ చేశారు. నడిచి వెళ్ళొచ్చు. మా హెచ్చార్ వాళ్ళు ఇలాటి సహాయాలన్నీ చేస్తారు’ అన్నాడు అర్జున్. శనివారం మధ్యాహ్నం అర్జున్ అక్కడ ఎపార్ట్మెంటులో చేరాడు. కృష్ణ కారులో అతన్ని తీసుకువెళ్ళి అతనికి రోజువారీ కావలసినవన

విశ్వనాథ గారి సినిమా సమీక్ష

సారస్వతం
పేరడీ రచన -- శ్రీరమణ సేకరణ--శారదాప్రసాద్   పేరడీ అనేది ఆంగ్ల సాహిత్యం నుండి మనం దిగుమతి చేసుకున్న ఒక సాహితీ ప్రక్రియ . సూక్ష్మంగా చెప్పాలంటే ఒక విధంగా అనుకరణను ​పేరడీ అనవచ్చు.​పేరడీలు వ్రాయటం కష్టతరమైన పని. చాలామంది అనుకున్నట్లుగా మూలాన్ని వ్రాసిన కవిని ఎగతాళి చేయటం కాదు ​పేరడీ అంటే!మూలాన్ని వ్రాసిన రచయితను దగ్గరగా చూసి,ఆయన రచనా శైలిని క్షుణ్ణంగా అనుక(స)రించి వ్రాయటమే ​పేరడీ. కాకపోతే మూలంలో భావగర్భితంగా,గంభీరంగా ఉన్న దానికి కొద్దిగా హాస్యాన్ని, వ్యంగ్యాన్ని జోడించి వ్రాస్తుంటారు ​పేరడీలు వ్రాసే కవులు. శ్రీశ్రీ మొదలుకొని శ్రీ రమణ గారి దాకా ఎందరో ఈ ​పేరడీ ప్రక్రియతో పాఠకులను రంజింపచేసారు. ఈ ​పేరడీకి వన్నె తెచ్చిన వాడు శ్రీ జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి గారు. వీరు శ్రీశ్రీ కి అత్యంత ఆప్తులు. శ్రీ జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి గారు వ్రాసిన ఈ పేరడీనిని చూడండి! నేను సైతం కిళ్ళీకొట్

లావయిన కథ

కథా భారతి
-భారతీనాథ్ చెన్నంశెట్టి చక్కనమ్మ చిక్కినా అందమే, అని, నాలో నేను అనుకుందామనుకుని, పైకే అనేశాను. అది విన్న, మా ఆవిడ ఖయ్యిమంటూ, నా మీద, అగ్గి మీద గుగ్గిలం పొగలా లేచింది. నాకు, నా సతిని, ఆవిడ  అని అంటే, పెరుగు ఆవడ తిన్నంత సంతోషంగా ఉంటుంది. అదే, భార్య అంటే, భారము మీద పడినట్టై,  మనసుకు నచ్చదు. అసలు విషయం వదిలి,  పక్క దోవ పట్టాను. రామాయణంలో పిడకల వేట అంటే ఇదేనేమో. అసలు విషయానికి వచ్చేద్దాం, ఇక. ఎవరా చక్కనమ్మ , ఏమిటా కథ అంటూ విరుచుకు పడింది, మా ఆవిడ. వీధి చివర మూడో మేడ, ఆరో అంతస్తులోని, చుక్కమ్మ గారి గురించేనా, అంటున్నారు, అంది. హవ్వ, ఆవిడ మా అమ్మమ్మ ఆఖరి చెల్లెలు, నూరుకు, ఆరు నెలలు దూరంలో ఉందావిడ, అన్నాను. అయితే, తప్పని సరిగా, ఆరో ఇంట్లో మూడో అంతస్తులోని, జేష్టమ్మ గారి గురించే అయ్యుంటుంది, అంది మా ఆవిడ. ఆవిడకు, వాళ్ళ అమెరికా మనవరాలు, క్రితం నెలలోనే, స్కైపులో, తొంభైవ పుట్