కవితా స్రవంతి

అమ్మ

– తమిరిశ జానకి

ప్రపంచ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో

ముత్యాలు చుట్టి వేశాను
అమ్మ మెడలో !
మంచి ముత్యాలు
అక్షరముత్యాలవి
ఆమె నా తెలుగుతల్లి !
తొలి దైవం అమ్మ
తొలి పలుకు తెలుగు పలుకు
అది ఎంతో ముద్దులొలుకు !
తొలి అడుగు తడబడినా
తల్లికి అది మురిపమే !
తొలి ప్రణామం అమ్మకి
అది విధాయకం నాకు !
ఉన్నఊరు కన్నతల్లి మాతృభాష
మరువతగని వరాలు
అవి మదిని నింపు సంతసాలు !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked