Author: Sujanaranjani

అన్నమయ్య శృంగార నీరాజనం

సారస్వతం
“చాలు జాలు నీతోడి సరసాలు” -టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య తానే నాయిక పాత్ర ధరించి "చాలుఁ జాలు నీతోడి సరసాలు" అంటూ స్వామి వారి శృంగార చేష్టలకు కోపం ప్రదర్శిస్తున్నాడు ఈ కీర్తనలో.. ఆ ముచ్చట మనమూ చూద్దాం రండి. కీర్తన: పల్లవి: చాలు జాలు నీతోడి సరసాలు యిట్టె పాలిండ్ల కొంగుజారి బయటఁ బడితిమి చ.1. సిగ్గువడితిమిర నీ చేసిన చేతలకు నగ్గమైతిమిర మరునమ్ములకును దగ్గరి నీకాకల దగులఁబట్టి నేఁడు బగ్గన నిందరిలోన బలచనైతిమి || చాలు జాలు || చ.2. నొగిలితిమిర నేము నోచిన నోములకు పొగిలితిమిర నీ పొందులకును తెగి నీవు నన్ను రతి దేలించి తేలించి నాకు పగటు బిగువులెల్ల బచ్చిగా జేసితివి || చాలు జాలు || చ.3. దప్పి బడితిమిర నీతాలిములనే కడు నొప్పి బడితిమీర నీ నొక్కు జేతల ఇప్పుడిట్టె తిరువేంకటేశుడ నీవు నా కొప్పు సవరము దీసి కొల్లగొంటి మానము || చాలు జాలు || (రాగం: రామక్రియ; రేకు సం: 92, కీర్తన; 5-364) విశ

జగమంత కుటుంబం అక్టోబర్ 2018

జగమంత కుటుంబం
Dallas Area Telangana Association (DATA)   Greetings, DATA cordially invites you, your family and friends to attend 2018 DATA Bathukamma & Dasara Panduga on Saturday, 13th October 2018 4:00 PM to 11:00 PM Registration starts at 4:00 Location: Frisco Flyers Event Center Address: 6300 Flyers Way, Frisco, TX 75034 For cultural participation, Dasara veshalu, vendor booths, please contact us @ data.telangana@gmail.com Forward Email

ఆకాశంలో ఆశల ‘హరివిల్లు’

కథా భారతి
-డా.పి.కె. జయలక్ష్మి విశాఖపట్టణం “హేయ్ హరీ వాటే సర్ప్రైజ్ ?” ఆప్యాయంగా పలకరిస్తున్న చిరకాల మిత్రురాల్ని ప్రేమతో వాటేసుకుంటూ “ఓ మై గాడ్! ఎన్నాళ్ళకి కలిసామే” అంది హరిణి సంతోషంగా. “అవునా ఇంకో సర్ప్రైజ్ చూడు ఇక్కడ” అంటూ అంతసేపూ తన వెనకలే నించున్న విరి ని ముందుకు లాగింది చెయ్యి పట్టి. “వావ్ విరీ ఎలా ఉన్నావే?” అంటూ దగ్గరికి తీసుకుంది హరిణి ఇద్దర్ని ఆత్మీయంగా. “చికాగో యూనివర్సిటీ లో చదువులయ్యాక మళ్ళీ ఇప్పుడేగా కలవడం. గ్రాడ్యుయేషన్ కి కూడా కలవలేకపోయాం కదే!” అంది సిరి బాధగా. “ఇంతకీ ఎలా ఉందే లైఫ్ ?” కాఫ్టేరియా లో వేడి కాఫీ సిప్ చేస్తూ అడిగింది హరి. “ఎదోలేవే చల్తా హై”. అంది సిరి. “అదేంటే అంత నీరసం?మనం చదువుకొనే రోజుల్లో ఎంత చురుగ్గా ఉండేదానివి?ఎంత బాగా డాన్స్ చేసేదానివి?అన్నట్టు ఇప్పుడూ డాన్స్ చేస్తున్నావా?” అడిగింది కుతూహలంగా హరి. “దాని వొళ్ళు చూస్తూ కూడా డాన్స్ చేస్తున్నావా అని అడుగుతా వేంటే హ

నీతి లేని…మానవ జాతి

కవితా స్రవంతి
🌷నీతి లేని...మానవ జాతి🌷 - కొప్పోలు యాదయ్య ముక్కు పచ్ఛలారని పక్షుల నిష్కల్మష ప్రేమకు కుల బురద అంటింది ఆ బురద ఎవరికి కనిపించదు ఆ బురద చూసే కళ్ళ దురదకు తప్ప.. ఆ బురద ఎన్ని రకాలుగా శుద్దిచేసుకున్నా, మూలాలు ఎదుటి వాడి మెదడులో దూలాలై దూరినవి జీవుల్లో మనిషి ఓ జంతువే మరి ఏ జంతువుకు లేని కుల వర్గాలు ఈ మనషికే ఎందుకో.. ఒక రకం చెట్టు ఒకే రకమైన పళ్ళనిస్తవి. ఒక జాతి పక్షులు ఒకే పద్ధతి న జీవిస్తాయి. సృష్టిలో ప్రతి జీవి తమ జీవన ధర్మాలను పాటిస్తూ మనుగడ సాగిస్తున్నాయి కానీ... తెలివైన , మానవతా, నాగరిక జీవిగా చెలామని అవుతున్న మనిషికే ఏ జీవన విధానం లేదు.. లేని కులాల మూఢత్వంలో ప్రకృతికి విరుద్ధంగా మనిషి కొత్త మృగమై రాక్షస క్రీఢలో మానవతా విలువలను మంటగలుపుతున్నాడు ఎవడో అంటించిన ఈ రంగుల రావణకాష్ట మనిషి రక్తం మాంసాలతో మండుతూనే ఉంది. ఇది మానవ అనాగరిక రాక్షసత్వనికి పరాకాష్ట ****

శ్రీ రామ సంగ్రహం

ధారావాహికలు
రావణుడి తాతతండ్రులు -అక్కిరాజు రామాపతి రావు సుకేశుడు ధర్మమార్గావలంబి అయినాడే కాని రాక్షస ప్రవృత్తినిస్వీస్వేకరించలేదు. గ్రామణి అనే గంధర్వుడు సుకేశుణ్ణి చూసి ఎంతో ముచ్చటపడి తన కూతురు దేవవతినిచ్చి అతడికి పెళ్ళి చేశాడు. సుకేశుడు దేవవతితో అభీష్టసుఖాలు పొందుతూ ఆనందంగా కాలం గడుపుతుండగా ఆ దంపతులకు క్రమంగా ముగ్గురు కొడుకులు పుట్టారు. వాళ్ళు ఆ సంతానానికి మాల్యవంతుడు, సుమాలి, మాలి అని పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళు మహాదేవుడి వరప్రభావం వల్ల జన్మించారని ఆ తండ్రి ఎంతో మురిసిపోయినాడు. అయితే వీళ్ళకి తండ్రి తాతల సత్త్వగుణసంపద అబ్బలేదు. తమ తండ్రికి, శివానుగ్రహం ఉన్నదని తెలుసుకొని తాము కూడా అత్యంత బలపరాక్రమాలతో, లోకాలన్నిటినీ శాసించే శక్తిసామర్థ్యాలతో విలసిల్లాలని బ్రహ్మదేవుణ్ణి గూర్చి వాళ్ళు ముగ్గురూ ఘోరతపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమై వాళ్ళకు వారు కోరిన వరాలిచ్చాడు. ఇక వాళ్ళు అహంకరించి, తమకు ఎవరూ ఎదురు