Author: Sujanaranjani

శ్యామల

బాలాంత్రపు రజనీకాంతరావు గారికి నివాళులు ఫేస్ బుక్ మాధ్యమంలో బాలాంత్రపు ప్రసూన గారి పేజీలో వచ్చిన నివాళులను ప్రచురించటానికి అనుమతినిచ్చారు. వారికి నా కృతజ్ఞతలు!) రజనిగంధం (నిన్న విశాఖసాహితి వారు బాలాంత్రపు రజనీకాంతరావుగారి సాహిత్య సంగీత సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో నా ప్రసంగ సారాంశం. ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి అధ్యక్షతన, ఆచార్య ప్రసన్న కుమార్ గారి ప్రధానోపాన్యాసంతో, ఆచార్య వేదుల సుబ్రమణ్యం గారు, ఎఐఆర్ నుంచి వచ్చిన వక్తలు ఆచార్య సూర్యారావు తదితర వక్తలు ప్రసంగించి సభని సుసంపన్నం చేశారు. మండపాక శారద గారి శిష్యులు, మరియు డా. కమల, శ్రీమతి రాజేశ్వరి సరస్వతి తదితరులు రజని పాటలు పాడి శ్రోతలనలరించారు.) ఏ దృక్పధంతో చూసినా రజనీకాంతరావు గారు ఒక సంస్థ. ఒక కళ కాదు ఒక సంగీతం కాదు ఒక కవిత్వంకాదు. ఏది తల్చుకున్నా ముందుండే పేరు రజని గారిది. అరు ఏఐఆర్ విజయవాడలో వుండి చేసిన సాహితీ సేవ,

సుధాకర్

బాలాంత్రపు రజనీకాంతరావు గారికి నివాళులు (ఫేస్ బుక్ మాధ్యమంలో బాలాంత్రపు ప్రసూన గారి పేజీలో వచ్చిన నివాళులను ప్రచురించటానికి అనుమతినిచ్చారు. వారికి నా కృతజ్ఞతలు!) సంగీత గంగోత్రి ఇరవయ్యేళ్ల క్రితం సంగతి...విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో 'సంగీత గంగోత్రి' అనే విలక్షణమైన సంగీత రూపకం,'సంగీత,సాహిత్య సవ్యసాచి' డాక్టర్ బాలాంత్రపు రజనీకాంతారావు గారి నిర్వహణలో రూపుదిద్దుకుంటోంది... శివుని సద్యోజాతాది అయిదు ముఖాల నుండి సప్తస్వరాల ఆవిర్భావం ఎలా జరిగింది? డమరుక నాదం నుండి అచ్చులు,హల్లులు ఎలాపుట్టాయి? రాగ,తాళాలు,సంగీత రచనలు ఎలా ఆరంభమైనాయి? మొదలైన ఎన్నో అంశాలను సోదాహరణంగా వివరిస్తూ రజనీగారు వ్రాసిన రూపకం,రికార్డవుతోంది.నెమలి కూత,ఎద్దు రంకె,ఏనుగు ఘీకారం... వంటి ఏడు శబ్దాల నుండి సప్తస్వరాల స్థాయిలు నిర్ణయమైనాయని వ్యాఖ్యాతచే చెప్పించి, ఆ ధ్వనులను శ్రోతలకు వినిపించేందుకు ప్రఖ్యాత మిమిక్రీ కళాకారులు సిల్వెస్టర్

వంశీకృష్ణ

బాలాంత్రపు రజనీకాంతరావు గారికి నివాళులు (ఫేస్ బుక్ మాధ్యమంలో బాలాంత్రపు ప్రసూన గారి పేజీలో వచ్చిన నివాళులను ప్రచురించటానికి అనుమతినిచ్చారు. వారికి నా కృతజ్ఞతలు!) రజనీ గంధ సంగీత సాహిత్య సమలంకృతే అనే పద బంధం చాలా కొద్దిమందికే నప్పుతుంది . సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళే అని కాళిదాసు సరస్వతీ దేవిని ప్రార్ధించాడు . ఈ రెండు సమపాళ్లలో ఒకరిలోనే ఉండి ఆ ఒక్కరూ నూరు శరత్తులు వీక్షించి తన చుట్టూ వున్నా ప్రపంచాన్ని రాగ భరితము ,పరిమళ భరితము చేస్తే ఆ పుంభావ సరస్వతిని మనం బాలాంత్రపు రజని అంటాము . ఆ రజని ఇక లేరు. టి వి అనే మాధ్యమం సకల సంస్కృతులను మాయం చేయక ముందు తెలుగు వాడికి సాంస్కృతిక దారి దీపం ఆకాశవాణి . రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు ఆకాశవాణి అని నామకరణం చేస్తే దాన్ని ఇంటింటి పేరు గా మలిచింది రజని . ప్రారంభ దశలో ఆకాశవాణికి జవం ,జీవం బాలాంత్రపు రజనీ కాంత రావు గారే. పాప్ , రాక్ సంగీతాల్లాంటి స

కార్మిక కష్టం

కవితా స్రవంతి
- అభిరామ్ ఆదోని తెల్లవారగానే చద్దికట్టుకుని చకచకా నడిచి శ్రమించే స్థలం చేరుకుని చొక్కా తీసి బనీయన్ వేసి బ్రతుకుకు ఆయుష్షుపోస్తూ మెతుకులిచ్చే పనిముట్లకు మొక్కి పార గంపలు పట్టి పుప్పొడిని తలదన్నే ఇసుకను కొలిసి రాసిగా పోసి సిమెంట్ బస్తాలను భుజానమోసి మిశ్రమాన్ని కలిపి గోడమీద గోడను నిలిపి నీటితో తడిపి మేడ నిర్మించి రంగులతోటీ హంగులద్ది ఇన్నాళ్లు స్వేచ్చగా తిరిగిన భవనంపై వైరాగ్యమొచ్చినట్లు పసిపాపలా నవ్వుతూ మరో ప్రాంతానికి కదిలిపోయే కార్మిక వందనాలు నీ శ్రమకు పాదాభివందనాలు

అమ్మకి వందనం

కవితా స్రవంతి
- అన్నసముద్రం శ్రీదేవి దక్షిణ కోరని గురువుకి శాపం తెలియని దేవతకు ఆగ్రహమెరుగని నిగ్రహమూర్తి కి మాతృవందనం లోకం బిడ్డ కు చూపటానికి యుద్ధం చేసిన యోధురాలి కి ఎల్లలు ఎరుగని తల్లి ప్రేమ కి తొలి వందనం మమతను పంచి నడతను నేర్పి తడబడుతుంటే తప్పు ను దిద్దిన తొలి బడి ఐన తల్లి ఒడికిదే అభివందనం వేనవేల వందనాలు కోట్ల ల్లో కృతజ్ఞతలు చంద్రృనికో నూలుపోగు అమ్మా అను పిలుపొకటే అమ్మకి నచ్చిన పలుకు అమ్మ మెచ్చేలా పలుకు

చదువు మొగ్గలు

కవితా స్రవంతి
- - డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ పదిమందికి విద్యాగంధాన్ని పంచితేనే కదా నిరక్షరాస్యత నిర్మూలన సతతం జరిగేది చదువు ఎప్పటికీ వాడని వసంతపరిమళం జ్ఞానకుసుమాలను సదా ఆస్వాదిస్తేనే కదా మనలోని అజ్ఞానాంధకారం తొలిగిపోయేది చదువు మానవవికాసానికి విజయసోపానం మేధోమధనం నిత్యం మదిలో రగిలితేనే కదా ఆనంతమైన విజ్ఞాన అంచులను చుంబించేది చదువు పరిశోధనపూలు పూచే గంధంచెట్టు విద్యార్థులు విద్యావంతులై వికసిస్తేనే కదా అక్షరపూలు మహిలో విద్యాగంధాన్ని వెదజల్లేది చదువు భావితరానికి మార్గం చూపే చుక్కాని ఆనందాలను నిరంతరం అనుభూతిస్తేనే కదా ఉపదేశపు సంస్కారబీజాలు నాటుకుపోయేది చదువు భవిష్యత్తుకు బాటవేసే రహదారి

పద్యం-హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్ ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము. ఈ మాసం ప్రశ్న: పందినిఁ కౌగిలించుకొని పంకజలోచన సంతసించెరో గతమాసం ప్రశ్న: వంకాయన చెఱుకు రసము వడివడిఁ యుబికెన్ ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి. నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ ఇంకేమి వింతలుం డునొ సంకర జాతులు పుట్టు సంబర మందున్ వంకర టింకర యుగమిది వంకాయన చెఱకు రసము వడివడిఁ యుబికెన్ సూర్యకుమారి.  వారణాసి  .మచిలీపట్నం టెంకాయ  నీరు  త్రాగియు ఇంకా  దాహమనిపిం చి  ఇ

అన్నమాచార్య 610వ జయంతి ఉత్సవం

ఈ మాసం సిలికానాంధ్ర
610వ అన్నమయ్య జయంత్యుత్సవం - అమెరికా ప్రాంతీయ పోటీలు సిలికానాంధ్ర మే నెల 25, 26, 27 తేదీలలో కాలిఫోర్నియాలోని మిల్పీటస్ నగరంలొ 610వ అన్నమయ్య జయంత్యుత్సవాన్ని బారీగా చేయటానికి తలపెట్టింది. ఈ కార్యక్రమంలో జరుగనున్న సంగీతం, నాట్యం తుదిపోటీల్లో పాల్గొనటానికి అభ్యర్థులను అమెరికాలోని నాలుగు నగరాల్లో ప్రాంతీయ పోటీలను నిర్వహించి ఎంపిక చేసింది. ఆ నగరాల్లోని ఫోటోలు కొన్ని అందిస్తున్నాము. కాలిఫోర్నియా న్యూ జెర్సీ వర్జీనియా డాల్లస్