Author: Sujanaranjani

ఒత్తిడిని జయిద్దాం విజయం సాధిద్దాం

శీర్షికలు
ఒత్తిడి దీన్నే మనం Stress అని కూడా అంటుంటాం. వేగంగా మారుతున్న నేటి సామాజిక ప్రభావం వలన ఈ ఒత్తిడి లేని వారు రాని వారు లేరంటే అతిశయోక్తి లేదు. అ ఆ లు చదివే (క్షమించాలి ABCD) పిల్లలనుండి ఆఫీసుకు పరుగులెత్తె పెద్దలు మరియు జీవన సమరంలో అలసి సొలసిన వృద్ధుల వరకు ఈ ఒత్తిడి నుండి మినహాయింపు లేకపోగా, నేటి సమాజంలో ఇది ఒక మానసిక రుగ్మతగా మారి మనిషి మానసిక శారీరక ఆరోగ్యాలపై సవాలు చేస్తోంది! మానవ జీవనశైలిలోనే అనేకానేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి! దాని ఫలితమే దినదినాభి వృధ్ధిగా పెరుగుతున్నాయి ఈ ఒత్తిళ్లు.వృత్తిగా చేసే పనులకు వ్యక్తిగా చేసే పనులు మధ్య సామరస్యం లేకపోవటం ఒకటైతే, వ్యక్తిగా పెంచుకున్న, పెరుగుతున్న అవసరాలు కూడా ఈ ఒత్తిడికి దోహద పడుతున్నాయి. ప్రతిదినం చేయవలసిన పనుల పరుగులో అందుకోవాల్సిన బస్సు మొదలు ట్రాఫిక్ జాములతో చేరవలసిన చోటుకు చేరేవరకు సాగే ఈ ఉద్వేగంలో మనసు ఒత్తిడికి గురి అవుతూ మనిషి శారీ

ఉపమన్యు ,ధౌమ్య మహర్షులు

సారస్వతం
-శారదాప్రసాద్  (​పాము పాదము పతంజలి మరియు పులి పాదముల వ్యాఘ్రపాద మహర్షి కలసి నటరాజస్వామి రూపములో ఉన్న శివునికి నమస్కరిస్తున్న దృశ్యం) వ్యాఘ్రపాద లేదా వ్యాఘ్రపాద మహర్షి లేదా వ్యాఘ్రపాదుడు అనగా వ్యాఘ్రము వలె చరించువాడు అని అర్ధము. పాదములు వ్యాఘ్రము యొక్క పాదములు వలె ఉండును కాన వ్యాఘ్రపాదుడు అని, వ్యాఘ్రము వలె చరించువాడు అని అర్ధము చెబుతారు .కృతయుగము నందు ధర్మ ప్రవచన దక్షుడు, వేద వేదంగ విదుడు, జంతువుల యెడల భయంకరముగా చరించు వాడు, అయిన ఒక మహా ముని పేరు వ్యాఘ్రపాద లేదా వ్యాఘ్రపాదుడు.పురాణాలలో వ్యాఘ్రపాదుడు అనే ఒక ఋషి ఉన్నట్లు చెప్పబడింది. వ్యాఘ్రపాదునకు ,భారతదేశం యొక్క తమిళనాడు నందలి చిదంబరంలో ఆలయ ప్రాంగణంలో నటరాజుగా ఉన్న శివుడు యొక్క నిత్య పూజ అందించటం కోసం, తేనెటీగచే తాకబడని తాజా పుష్పాలు సేకరించే యొక్క పని అప్పగించబడుతుంది. అయితే, పువ్వులు కోసి సేకరించే సమయములో వ్యాఘ్రపాదుడు ముళ్ళు మరియు

కవితా మొగ్గలు

కవితా స్రవంతి
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ కవిత్వం మనసును పులకింపచేస్తేనే కదా అక్షరలతలు నలుదిశలా పరిమళించేది కవిత్వం సాహితీ కుసుమాల సౌరభం కవిత్వం తరంగమై ప్రవహిస్తేనే కదా కొత్తదారులను లోకానికి పరిచయం చేసేది కవిత్వం నవరాగాల నవరససమ్మేళనం కవిత్వం సాగరమై పోటెత్తితేనే కదా గుండెలోని బాధల దుఃఖాన్ని ఒంపుకునేది కవిత్వం కనిపించని రహస్యనేత్రం కవిత్వం నదీప్రవాహమై పారితేనే కదా కవితావింజామరలు వికసించి నాట్యమాడేది కవిత్వం నవపల్లవుల మృదంగనాదం కవిత్వం అక్షరసౌరభాలను వెదజల్లితేనే కదా తెలుగు సాహిత్యం కలకాలం నిలిచిపోయేది కవిత్వం వెలుగుపంచే సహస్ర రవికిరణం

శ్రీరామాయణ సంగ్రహం

ధారావాహికలు
ఉత్తరాకాండ శ్రీరామచంద్రుడు రావణసంహారం చేసి అయోధ్యలో పట్టాభిషిక్తుడై సకల సంవత్సమృద్ధంగా జనరంజకంగా పరిపాలిస్తుండడం చూసి ఇలలోని నాలుగు దిక్కుల నుంచి పరమఋషులు ఎంతో సంతోషంతో ఆ శ్రీరామప్రభువును అభినందించటానికీ, తమ అభిమానం తెలియజేయటానికీ అయోధ్యకు వచ్చారు. తూర్పుదిక్కు నుంచి వచ్చిన వారిలో కౌశికుడు, యవక్రీతుడు, గార్గ్యుడు, మేధాతిథి కుమారుడు కణ్వుడు మొదలైన వారున్నారు. దక్షిణం నుంచి వచ్చిన వారిలో ఆత్రేయుడు, నముచి, ప్రముచి, ఋషులందరిలోనూ సర్వశ్రేష్టుడూ, మహాప్రభావసంపన్నుడూ అయిన అగస్త్యుడూ ఉన్నారు. పడమటి నుంచి కవషుడు, ధౌమ్యుడు, రౌద్రేయుడు అనే వారు తమ శిష్యులతో కూడా వచ్చారు. ఉత్తరదిక్కు నుంచి వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు అను సప్తర్షులు వచ్చారు. ఇట్లా వీళ్ళంతా రాచనగరు సింహద్వారం సమీపించి అక్కడి ద్వారపాలకుడితో తమ రాక శ్రీరామచంద్రుడికి తెలియజేయవలసిందిగా అగస్త్యుడ

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి సమాజానుభూతి దృష్టితో గమనిస్తే విశ్వనాథ రచనా పరమార్థం మరింత స్పష్టంగా గోచరిస్తుంది. పంచవిధ ప్రవృత్తుల ద్వారా సమాజం పొందగలిగే అనుభూతి విశేషాలను వివిధ ప్రక్రియల ద్వారా, వివిధ కవులు సాహితీ ప్రపంచంలో ప్రచలింపచేస్తున్న ప్రయోగాల ద్వారా పరిచ్చిన్నంగా పొందగలిగే వికీర్ణ స్థితిని విశ్వనాథ సమీకించి, వాటినన్నింటిని సమాజానికి సమాహార రూపంగా అందింపగలిగిన ఒక మహాకావ్యాన్ని రచించటానికి పూనుకొన్నాడు. రామాయణ కల్పవృక్షం పేరుకు తగ్గట్టు సమాజం ఆకాంక్షించే వాస్తవిక, కాల్పనిక, వైజ్ఞానిక, జీవచైతన్య, ఆధ్యాత్మికానుభవాల సంపుటిని అందింపగలిగిన విశిష్ట రచన. ఆయన జీవుని వేదన సమగ్ర కళానుభూతి కోసం సమాజ జీవచైతన్యం అర్రులు సాచే ఆవేదన. పంచజిహ్వల సమాజ చేతనకు విశ్వనాథవారు అందించిన అమృతనైవేద్యమే, అనుభవకోశమే రామాయణ కల్పవృక్షం. ఆ కావ్యంలోని సన్నివేశాలు పాత్రస్వభావాలు సమాజంలో కానవచ్చే వాస్తవజీవిత ప్రతిబింబాలుగా ఉండటం

వెళ్ళిపోయిన సూర్యనారాయణుడు

సుజననీయం
-తాటిపాముల మృత్యుంజయుడు 'మాదీ స్వతంత్ర  దేశం, మాదీ స్వతంత్ర జాతి ', 'మేలుకో హరి సూర్యనారాయణా' పాటల పేర్లు చెప్పుకోగానే ఠక్కున గుర్తుకు వచ్చేది బాలాంత్రపు రజనీకాంతరావు గారు. 1941 నుండి తన సంగీత, సాహిత్య, గాన మాధుర్యాలతో ఆకాశవాణిలో తెలుగుజాతిని ఓలలాడించిన ప్రముఖుడు బాలాంత్రపు రజనీకాంతరావు గారు 22 ఏప్రిల్ న మనలను వీడిపోయారు. సరిగ్గా తేదీ గుర్తులేదు కాని, నాకు ఆ సంఘటనలు మాత్రం బాగా గుర్తు. కొద్ది సంవత్సరాల క్రితం సిలికానాంధ్ర నిర్వహించిన ఉగాది ఉత్సవంలో రజనీ గారి పాటలు కొన్ని నేర్చుకొని కార్యక్రమం ఇవ్వదలిచాం. అప్పుడు నేను ఉత్సుకతతో వారి గురించి ఇంటర్నెట్లో వెదుకుతుంటే వారి గురించిన సమాచారం ఎంతగానో లభించింది. వారి చేసిన ఎనలేని సేవలను ఆ సమయంలో తెలుసుకొన్నాను. సిలికానాంధ్ర చైర్మన్, శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారు రజనీకాంతరావు గారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అపూడు వారు మాతో పంచుకొన్న మాటలివి. "

వీక్షణం సాహితీ గవాక్షం- 68

శీర్షికలు
వీక్షణం 68 వ సమావేశం కాలిఫోర్నియాలోని ప్లెసంటన్ లో శ్రీ వేమూరి వెంకటేశ్వర్రావు గారింట్లో జరిగింది. శ్రీ సి.బి.రావు గారు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ముందుగా కాళీ పట్నం రామారావు గారి "యజ్ఞం" కథ మీద సుదీర్ఘమైన చర్చా కార్యక్రమం జరిగింది. ఇందులో సభలోని వారంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా ఈ కథ గురించి సి. ఎస్. రావు గారు రాసిన ఈ- మాట లోని పరిశీలనా వ్యాసం లోని కొన్ని భాగాలను యథాతథంగా తెలియజేస్తూ  ఈ చర్చలో కథ ను, కథా సందర్భాన్ని  సూక్ష్మంగా డా||కె.గీత వివరించారు. "కథావేదిక సుందరపాలెం అనే గ్రామం.  కథావిషయం అప్పల్రాముడి కుటుంబం గోపన్నకి బాకీగా ఉన్న అప్పుకు సంబంధించి, దేవాలయం దగ్గరి ధర్మమండపం పంచాయితీ వేదికగా జరుగుతున్న సమావేశంలో పడే తర్జన భర్జనలు. మండపానికి చుట్టూరా, వీధికి ఆ చివరి నుండి ఈ చివరి దనుకా హాజరై కూర్చున్న జనంలో మనం కలిసి పోతాము. సంక్షిప్తంగా కథ: దశాబ్దాల క్రింద తాను మధ్యవయస

మరికొన్ని నివాళులు

బాలాంత్రపు రజనీకాంతరావు గారికి నివాళులు (ఫేస్ బుక్ మాధ్యమంలో బాలాంత్రపు ప్రసూన గారి పేజీలో వచ్చిన నివాళులను ప్రచురించటానికి అనుమతినిచ్చారు. వారికి నా కృతజ్ఞతలు!) జేజి మావయ్యా తిరిగి రావూ ? -వీర నరసింహ రాజు జేజి మావయ్యా … నేను దిబ్బ రొట్టి అబ్బాయిని. ప్రొద్దున్నే మీరు రేడియో లో ఆరంభించిన భక్తి రంజని వింటే బోలెడు భక్తి వస్తుందని మా జేజమ్మ చెప్పేది . అందులోనూ ఆదివారం వస్తే శ్రీ సూర్య నారాయణా మేలుకో హరి సూర్యనారాయణా వింటుంటే భలే భలే ఈ రోజు ఆదివారం స్కూల్ కి సెలవు దినం అని గుర్తుకు వచ్చి ఎంచక్కా ఆడుకోవచ్చని అనిపించి సూర్యదేవుడికి మొక్కేసి మళ్ళీ జేజమ్మ వచ్చి అరిచే దాక ముసుగు కప్పేసేవాడిని తెలుసా. ఇంతలో "రారే రారే పిల్లలారా " అనే పాట వింటే ఉత్సాహం పొంగుకొచ్చెదనుకో . అమ్మ , జేజమ్మో మాకు తాయిలం పెడుతుంటే "తాయిలం పాట" గుర్తొస్తుంది .చిన్నపుడు జేజమ్మ వాళ్లకు కూడా తెలియని ధర్మ సందేహాలు తీర్చేట్ట

కె.ఎన్.మల్లీశ్వరి

బాలాంత్రపు రజనీకాంతరావు గారికి నివాళులు (ఫేస్ బుక్ మాధ్యమంలో బాలాంత్రపు ప్రసూన గారి పేజీలో వచ్చిన నివాళులను ప్రచురించటానికి అనుమతినిచ్చారు. వారికి నా కృతజ్ఞతలు!) శతపత్ర సుందరుడు (శతపత్ర సుందరునికి వీడ్కోలు, వదిలివెళ్ళిన సంగీత సాహిత్య సంపదలకి జేజేలు.'ధరణీతల చంద్రశిల తరళ మంటపమున నిలచి యుగములుగ పరిభ్రమింతుమిక' రజనీ, విభావరీ వీడ్కోలు. హేమచంద్ర గారూ, ప్రసూన గారూ శిశువు చిత్రనిద్రలోకి జారుకున్నాడు. ఆయన మలి బాల్యానికి మీరు తల్లిదండ్రులయ్యి కాలాన్ని మీ చేతిలోకి తీసుకుని, మృత్యువు అంచుల నుంచి వెనక్కి తెచ్చి,దశాబ్దంపైన ఆ పెన్నిధిని కాపాడారు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు, ఇపుడిక ఈ వెల్తి, ఖాళీ పూడ్చలేనిది. మీతో మేమున్నాము.) దాదాపు పాతికేళ్ళ కిందట తెలుగు యూనివర్సిటీ లో సంప్రదాయ నవ్యసాహిత్యం పాఠాలు చెప్పిన బాలాంత్రపు రజని కాంతారావు గారు,ఎంతటి వారో కూపస్థ మండూకాల వంటి మాకేమి తెలుసు ! ఓ పెద్ద వయసు