సారస్వతం

ఆధునిక కవిత్వంలో అనుభూతి వాదం

పాండవులు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు కుంతీదేవి ద్రౌపదిని చూసి సహదేవుని విషయమై

“కాదు(బ సిబిడ్డ వీ(డొకటి గాదవునా నేఱు(గండు ముందరె
య్యెడ నొక పాటేఱుంగ(డెద యెంతయు(గోమల మెప్పుడైన నే(
గుడువ(గ బిల్తు(గాని తనకుం గల యా(కటి ప్రొద్దేఱుంగ(డీ
కొడుకిటు పోకకున్ మనము గుందెడు ని గని యూఱడిల్లెడున్”

ఈ పద్యంలో తనకు సహదేవుని పట్లగల వాత్సల్యాతిశయాన్ని హృదయద్రవీకరణంగా ద్రౌపదికి కుంతీదేవి తెలపటం కన్పిస్తుంది.
భాగవతాన్ని రచించిన పోతన్నగారి కవిత్వం అంతా రసార్ణవమే.

“నల్లనివా(డు పద్మనయనంబుల వా(డు కృపారసంబు పై(
జల్లెడు వా(డుమౌళి పరిసర్పిత పింఛమువా(డు నవ్వురా
జిల్లెడు మోమువా(డొక(డు చెల్వల మానధనంబు దెచ్చెనో
మల్లియలార! మీ పొదలమాటున లే(డు గదమ్మ! చెప్పరే”

ఈ పద్యం మనోహరమైన అనుభూతులతో నిండిన పద్యం. ఈ మహాకావ్యాలన్నీ అనుభూతికి ఉదాహరణలే అయినా, స్థాలీపులాక న్యాయంగా నేను ఈ ఉదాహరణలను ఇస్తున్నాను.
ప్రబంధయుగంలో ప్రథమ ప్రఖ్యాత ప్రబంధంగా గణుతికెక్కిన స్వారోచిష మనుసంభవములో అనుభూతి లోతులు చూసిన పద్యాలు ఎన్నో కలవు. తనను కాదని వెళ్ళిపోయిన ప్రవరాఖ్యుని గురించి చింతిస్తూ వరూధిని –

“అక్కట! వా(డు నాతగుల మాఱడి సేసి దయావిహీను(డై
చిక్కక త్రోచిపోయె దరి(జేర)గరాని వియోగ సాగరం
బెక్కడ నీ(దు దాన? ని(క నీ కొఱనోములు నో చినట్టి నే
నెక్కడ? వాని కౌ(గిలది యెక్కడ? హా విధి! యేమి!”

ఈ ఘట్టం మనోజ్ఞమైనది.
క్షీణయుగానికి ముందున్న కాలంలో విజయవిలాస కావ్యంలో ప్రతిపద్యం చమత్కారమొలకునట్లుగా రచింపబడింది.

“తాసైరింప కపర్ణ యుండ(గ భావ ద్గర్భమ్మునం దాల్చి తే
జో సహ్యున్ శరజన్ము(గాంచి యలనీహార క్షమాభృత్ కుమా
రీ సాపత్న్యము ( గన్న మోహపు( బురంద్రీ రత్నమౌ దీప; కా
వే, సర్వజ్ఞు(డు నిన్ను నేల తలపై నెక్కించుకొ జాహ్నవీ”

ఇంతకూ నేను చెప్పవచ్చే విషయం ఏంటంటే, అనుభూతివాదం ఆధునికకాలంలో ఒక పక్క లేదంటూనే, మరోపక్క అనుభూతి కవిత్వం ఎప్పుడూ ఉన్నదేగా అని ఈసడిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని అనుభూతి కవిత్వపు ప్రాచీనతనీ, ప్రాముఖ్యాన్ని తడవవలసి వచ్చింది. పదిహేడవ శతాబ్దం నుంచే పిల్ల వసుచరిత్రలు, మోహశృంగార కావ్యాలు వెలయటం వల్ల నిదాఘ నదీ ప్రవాహంలా అనుభూతి అస్తినాసిచికిత్సాస్థితిలో పడిపోయింది. అయితే కవిత్వంలో అనుభూతి పోయేదీ కాదు, మరణించేదీ కాదు. ఇంతకాలం కావ్యాలను, ప్రబంధాలను ఆశ్రయించుకొని రాజ్యమేలిన అనుభూతి శతకాలను, పదకవితలను ఆశ్రయించుకొని తన ఉనికిని చాటుకొంది. శతక వాజ్మయమంతా ఉదహరించటానికి ఇది అనువైన సమయం కాదు. ‘సలలిత రామనామ జపమెరుంగను’ అనే రామదాసు కీర్తన, అలాగే పదకవితల్లో అన్నమయ్య చెప్పిన ‘బ్రహ్మ కడిగిన పాదము…’ లాంటివి ఉదాహరణలుగా చెప్పదగినవి. ఇదంతా ప్రాచీన కవిత్వానికి సంబంధించిన అనుభూతి విషయాలు.

నవ్యసాహితీ యుగకర్త అయిన వీరేశలింగం పంతులుగారి నుండి అనుభూతి కవిత్వం మరలా తన ఉనికిని చాటుకొంటూ, విరాజిల్ల నారంభించింది. ఆంగ్లసాహిత్య ప్రభావం వల్ల తెలుగు భాషాస్వరూప స్వభావాలే మారిపోయాయి. గుడ్డివాడికి కళ్ళొచ్చినంత పనయ్యింది. అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రసాహితి ఒక్కసారి విప్పారిన కళ్ళతో పలుప్రక్రియల్లో ప్రయోగాలు చేస్తూ, పరిథిని విస్తరించుకుంటూ పోయింది. మూఢాచారాల ఉక్కు సంకెళ్ళలో నలిగిపోతున్న ప్రజానీకానికి వీరేశలింగంగారి కృషి తరుణోపాయమైంది. బాల్యవివాహాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్న రోజులవి. స్త్రీ విద్యావ్యాప్తిలో లేకపోవటం, దేవదాసీ విధానం, అధికారుల లంచగొండితనం, కులాల కుమ్ములాటలు సమాజాన్ని పీడిస్తున్న తరుణంలో వీరేశలింగంగారు సాహతీరంగంపై అవతరించారు. వీరేశలింగంగారు సాహిత్యానికి చేసిన సేవకంటే సంఘ సంస్కరణోద్యమానికి ఆయన కావించిన ప్రయత్నం సుదృఢమైంది. సమకాలీన సమాజంలోని వాస్తవ విషయాలను సంఘసంస్కరణోద్యమానికి విషయాలుగా గ్రహించి ఆయన రచన కావించారు. ఆయన ప్రహసనాలు, నడిపిన పత్రికలు దేశంలో అమోఘమైన సమాజ సంస్కరణాయుధాలుగా ఉపయోగపడ్డాయి. ‘In the health of body peace of mind’ అని చెప్పబడిన ఆంగ్లోక్తికి అనుసరణీయంగా సమాజకాయానికి చుట్టూ ఉండే వాతావరణం పరిశుద్ధంగా ఉండాలని పంతులుగారు కావించిన కృషి. ఆయన చేసిన రచనలు వాస్తవ జగత్తుని ప్రతిబింబించాయి. ఇదంతా పరిశీలిస్తే, ఈ నవ్యకవిత్వ ప్రారంభకాలంలో అనుభూతి వాస్తవ జగత్తుని ఆశ్రయించి వెలిగిందని చెప్పుకోవచ్చు, ఈ నవ్యకవిత్వ ప్రారంభకాలంలో అనుభూతి వాస్తవ జగత్తుని ఆశ్రయించి వెలిగిందని చెప్పుకోవచ్చు. పంచకోశ విభాగానుసరణంగా పరిశీలిస్తే ఈనాటి సాహిత్యం ప్రముఖంగా ఇంద్రియ సాహిత్య ప్రవృత్తి (Physical Domain) నాశ్రయించి ఉందని గ్రహింపవచ్చు. అలాగే వీరేశలింగంగారి రచనలో మూఢాచార నిరసనం రూపుకట్టింది. మంత్రాలు, దెయ్యాలు, కులాచారాలు మూర్ఖత్వంతో విశ్వసిస్తున్న రోజుల్లో సమాజంలో తన సాహిత్యం ద్వారా ఆలోచనా బీజాలు వెదజల్లినవారు పంతులుగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked