ఈ నెల ముఖచిత్రంపై ఇద్దరు తెలుగు సాహితీ ఉద్ధండులు కొలువుదీరారు. ఇద్దరు పుట్టినరోజులు అక్టోబర్, నవంబర్ నెలల్లో వస్తాయి. ఒక మొట్టమొదటి తెలుగు ‘జ్ఞానపీఠ అవార్డు ‘ గ్రహీత కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, మరొకరు తెలుగు భావకవిత్వంలో తనకొక అధ్యాయాన్ని ఏర్పరుచుకొన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి.
వీరిరువరిని ఈ విధంగా స్మరించుకోవటం తెలుగు సాహిత్యానికి వందనం చేయటమే.
ఈ సందర్భంగా విశ్వనాథవారి కథ ‘మాక్లీదుర్గంలో కుక్క ‘ ప్రచురిస్తున్నాం. విశ్వనాథ సత్యనారయణ గారు ఎంతటి వవిధ్యమైన రచనలు చేశారో తెలియటానికి ఇదొక చిన్న ఉదాహరణ.
జై తెలుగు!
-తాటిపాముల మృత్యుంజయుడు