” నా తెలంగాణా కోటి రతనాల వీణ”
– తాటిపాముల మృత్యుంజయుడు
ఎవరు కాకతి! ఎవరు రుద్రమ!
ఎవరు రాయలు! ఎవరు సింగన!
అంతా నేనే! అన్నీ నేనే!
అలుగు నేనే! పులుగు నేనే!
వెలుగు నేనే! తెలుగు నేనే!
పూర్తి పేరు: దాశరధి కృష్ణమాచార్యులు
తల్లిదండ్రులు: వేంకటమ్మ, వేంకటాచార్యులు
జననం: 22 జులై 1925 – ఖమ్మం జిల్లా (అప్పడు వరంగల్ జిల్లా) చిన గూడూర్ గ్రామం
మరణం: నవంబరు 5, 1987
చదువు: బి.ఎ., ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్
ఉద్యోగాలు: ఉపాధ్యాయుడు, పంచాయతీ ఇన్ స్పెక్టరు, ఆకాశవాణి ప్రయోక్త
రచనలు: గాలిబ్ గీతాలు, మహాంద్రోదయం, తిమిరంతోసమరం, అగ్నిధార, రుద్రవీణ, కవితాపుష్పకం, ఆలోచనాలోచనాలు, రుద్రవీణ, అమృతాభిషేకం
సినిమా పాటలు: ఆరుద్ర ,ఆత్రేయ ,సినారె వంటి సమకాలికులతో పనిచేస్తూ 2000 పైగా పాటలు రాసారు.
బిరుదులు, సత్కారాలు:
‘కవితాపుష్పకం’ కు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు,’తిమిరంతో సమరం’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి’కళాప్రపూర్ణ’, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టా 1971 నుండి 1984 వరకు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీరి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఓక కవికి దాశరధి పురస్కారం – ప్రముఖ కవి డా. ఎన్. గోపీకి ఈ పురస్కారం దక్కింది.