శీర్షికలు

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసం ప్రశ్న:

“చిత్ర” కవిత్వం – ఈ క్రింది ఛాయచిత్రమునకు ఒక వ్యాఖ్యను లేదా వర్ణనను మీకు నచ్చిన ఛందస్సులో పద్యరూపములో పంపాలి

గతమాసం ప్రశ్న:

నిర్ధిష్టాక్షరి మరియు వర్ణన: “హే”, “వి”, :”ళం(లం)”, “బి” అనే అక్షరాలతో ఒకొక్క పాదము ప్రారంభిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో వసంత ఋతువర్ణన చేయాలి.

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

పోచిరాజు కామేశ్వర రావు, రాయిపూర్
హేవిళంబి విలంబన మెఱుఁగ కుండ
విరులు పూయంగఁ గూయంగఁ బిక శకున ద
ళంబులు మధుర మంజుల రాగములను
బిసరుహముల భ్రమరములు ముసర వచ్చె

సూర్యకుమారి వారణాశి, చంద్రాపూర్, మహారాష్ట్ర 
సీ              హేమమ్ము పగిది మహి మనసు  దోచుటన్
ప్రకృతి  సౌందర్యము  ప్రథమ మగును
వివి థ వర్ణమ్ముల  విలసిల్లు  వికసిత
విరులెల్ల కనువిందు విధిగ  నగును
లంబ తరువుల సలక్షణ సవ్వడు ల్
వీనుల కెల్ల గూర్చు విందు యగును
బిరబిరా మావి చిగురు తిను  శుకపిక
గళ రవళి  వసంత కళ యె యగును

తే
హేమ కాంతులు విరజిమ్ము హిమ మయూఖు
విమల చరితు   వాడి మయూఖు విరుల  మాల
లందజేయ నవవసంత లక్ష్మి భువిని
బిరబిర సుజనరంజనై ప్రీతి గెలుపు

తల్లాప్రగడ రామచంద్ర రావు, శేన్ హోసే, కాలిఫోర్నియా
తే.గీ.|| హేలవతి మించు శోభన మీ ఋతువుది!
విశ్వనాధుడు తపమున్న వేళ నంగు
ళంబు కూడ కదలకుండ శంబుడగుచు
బింకమెక్కు, వసంతపు వంక తోడ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked