– తాటిపాముల మృత్యుంజయుడు
ప్రప్రధమ వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు అన్నమయ్య 610 జయంతుత్సవం సంధర్భంగా సిలికానాంధ్ర మీ కందరికీ మా శుభాభినందనలు తెలియచేసుకొంటూన్నాము. తాళ్ళపాకవాసి విరచితమైన వేల పదకవితలు తామ్రపత్రాల ద్వారా దాదాపు 4 శతాబ్ధుల తర్వాత వెలుగులోకి రావడము, వివిధ మాధ్యమాల ద్వార ఇంటింటా పరిచయం కావడం ఒక యెత్తైతే, అన్నమయ్య లక్ష గళార్చన, అఖిల భారత అన్నమయ్య జయంతి మొదలైన కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగ వాటికి ఒక సమోన్నత స్థానాన్ని సాధించడానికి ఇతోధికంగా కృషి చేసింది మాత్రం ఒక్క సిలికానాంధ్ర మాత్రమే అని చెప్పవచ్చు.
అన్నమయ్య కీర్తనలోని సాహిత్యాన్ని, చూసిన అసమాన వైవిధ్యాల్ని, చేసిన ప్రయోగాల్ని, ప్రక్రియల్ని ఒక మహాసాగరంతో పోల్చవచ్చు. ఐతే, సిలికానాంధ్ర చేసే ప్రయత్నాలు, ఆ సముద్రంలోని నీటిని తీరాన నిలబడిదోసిలితో పట్టుకోడానికి చేస్తున్న చిన్న కృషి మాత్రమే కావచ్చు. కాని, మొక్కవోని ఈ సంకల్పం భావితరాలకు పనికి రావలన్నదే మా తపన, మా తపస్సు.