ధారావాహికలు

విశ్వామిత్ర 2015 – నవల ( 21 వ భాగము )

-ఎస్ ఎస్ వి రమణారావు

ఎండి ప్రారంభించాడు.”ఇది ఒక్స్ మల్టీపర్పస్ ఫ్లైఓవర్ గా మనం చెప్పుకోవచ్చు.మనకు మల్టీపర్పస్ డామ్స్ గురించి తెలుసు.అవి తాగునీరు ఇస్తాయి.సాగునీరు ఇస్తాయి.విద్యుత్ తయారీకి అవసరమైన నీరుకూడా ఇస్తాయి.దీనిని నేను మల్టీపర్పస్ ఫ్లై ఓవర్ అని దేనికి పిలుస్తున్నాను అంటే,ఈఫ్లైఓవర్ ట్రాఫిక్ సమస్యలను తీర్చడమే కాకుండా,మన విద్యుత్ అవసరాలను తీరుస్తుంది.కురిసే ప్రతి వర్షం బొట్టును రక్షించి మననీటి కొరతను కూడా నివారిస్తుంది.కాబట్టి దీనినొక ఇంజనీరింగ్ ఫీట్ గా చెప్పుకోవచ్చు.ఇప్పుడు నేను మీకు ఆర్టిస్టిక్ డిజైన్ ఆఫ్ ఫ్లైఓవర్ చూపిస్తాను.”స్క్రీన్ మీద ఒక చిత్రం కనబడింది.


ఎండి ఆచిత్రాన్ని వివరించడం ప్రారంభించాడు.”.ఇది విశ్వామిత్ర మాకు మొదట చూపించిన ఆర్టిస్టిక్ పిక్చర్ ఆఫ్ ద ఫ్లైఓవర్స్.అవి రెండు ఫ్లైఓవర్ లు.ఈరెండు ఫ్లైఓవర్ లు ఆపోజిట్ స్లోప్స్ ప్రిన్సిపుల్ ఆధారంగా డిజైన్ చేయడం జరిగింది.ఒక ఫ్లైఓవర్ లెఫ్ట్ నుంచి రైట్ కి స్లోప్ అయ్యుంటే ఇంకొక రోడ్డు రైట్ నుంచి లెఫ్ట్ కి స్లోప్ అయిఉంటుంది.ఈరెండు ఫ్లైఓవర్ లు ఒకదాని పక్కన ఒకటి పెడితే,అంటే ఫోర్ లేన్ హైవే లాగ అన్నమాట,ఒక డిజైన్,ఒక దానిమీద ఇంకొకటి పెడితే ఇంకొక డిజైన్. ఈ ఫ్లైఓవర్ ని చూడగానే మీకు స్ట్రైకింగ్ గా కొన్ని విషయాలు కనబడతాయి.అందులో మొదటిది ,ఫ్లైఓవర్ వెడల్పు భాగంవైపు మనం చూస్తే అన్ని ఫ్లైఓవర్ లకుండే పిల్లర్ సపోర్ట్ మీకు కనబడుతుంది.ఈపిల్లర్స్ కాని,తత్సంబధిత డెక్స్ కాని అన్నీ చాలాభాగం ప్రీఫాబ్రికేటెడ్.అంటే ఫ్యాక్టరీలోనే అంతా దాదాపు తయారుచేసి ఇక్కడకు సైట్ కు తీసుకువస్తాం.సైట్ లో జరిగే వర్క్ తగ్గడం వల్ల,పని తొందరగా అవుతుంది.క్వాలిటీ ఉంటుంది.రెండవది,ప్రతీ ఫ్లైఓవర్ నేలమీదనుంచి పైకి లేచి మళ్ళా నేలమీదకు దిగుతుంది.అంటే రెండుచోట్ల నేలమీద టచ్ అవుతుందన్నమాట.కానీ మీరు ఇక్కడ చూస్తే రెండు పక్కల ఫ్లైఓవర్ నేలను టచ్ చేయకపోవడం మీరు గమనించవచ్చు.మరి నేలమీద టచ్ చేయని పైకి ఎలా వెళతాం అని మీరు ప్రశ్నించవచ్చు.ఎక్కువ హైట్ ఉన్న ప్రదేశంలో లిఫ్ట్ ద్వారా పైకి వెళతాం.తక్కువ హైట్ ఉన్నచోట ఎస్కలేటర్స్ ద్వారా పైకి వెళతాం. మనుషులే కాదు.ఏఎస్కలేటర్ లేదా లిఫ్ట్ ల పక్కనే ప్రొవైడ్ చేయబడిన ఈ కార్గో లిఫ్ట్ ద్వారా సైకిళ్ళు పైకి వెళతాయి”‘సైకిళ్ళా?’ అప్రయత్నంగా అన్నాడు రాజు.
“అవును, సైకిళ్ళే”చిన్న నవ్వు నవ్వాడు ఎండి.”ఈఫ్లైఓవర్ లో సైకిళ్ళు మాత్రమే నడుస్తాయి.అంటే ఓన్లీ సైకిల్ ట్రాఫిక్ అన్నమాట.దానివల్ల వాహనాల వల్ల వచ్చే కాలుష్యం ఎంతగానో తగ్గుతుంది.అదిగాక చెరోపక్క సైకిళ్ళు వెళ్ళేదారిలోనే ఒక సింగిల్ సీటర్ ఎస్కలేటర్ ఒకటి రన్ అవుతుంది.అది ఓల్డ్ పీపుల్ కోసం.కానీ ఈ ఎస్కలేటర్ విశ్వామిత్ర మొదట ఇచ్చిన ప్లాన్ లో లేదు.తరవాత ఏడ్ అయింది.లాండ్ అవాలబిలిటీని బట్టి ఈ ఎస్చలేటర్ ప్రొవైడ్ చేయగలమా లేదా అనేది నిర్ణయించబడుతుంది”ఒక క్షణం ఆగాడు ఎండి.”ఇంక ఈ ఆపోజిట్ స్లోప్స్ ప్రిన్సిపుల్ గురించి ఇంకొక మాట.ఇలా స్లోప్ ఎందుకిచ్చామంటే సైకిల్ మీద కొంచెం ఎక్కువ స్పీడ్ జనరేట్ చేయడం,పెడలింగ్ శ్రమ ఏమాత్రం లేకుండా చూడడం.ఈ స్లోప్ అనేది ఎలా ఉంటుందంటే,అప్రాక్సిమేట్ గా చెప్పాలంటే 800 ft కి 5 టు 6% స్లోప్ ఉంటుంది.తరవాత కొంచెం ఫ్లాట్ రోడ్డు,మళ్ళీ స్లోప్.టైర్ విడ్త్ ఎక్కువున్న సైకిళ్ళే వాడాలి.సో దట్ సైకిల్ బ్రేకింగ్ సిస్టం ఇఫెక్టివ్ గా పని చేస్తుంది.రోడ్డు కూడా స్లైట్ గా రఫ్ గా డిజైన్ చేయడం ద్వారా సైకిల్ స్పీడ్ ని మనం నియంత్రించగలుగుతాం. మనకి ఒక సైకిల్ మనుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉన్నట్టు మీకందరకూ తెలిసిందే.ఆ ఫ్యాక్టరీకి ఆర్డర్స్ రావడానికి కూడా ఈ డిజైన్ తోడ్పడుతుంది.బైక్స్,స్కూటర్స్ని కూడా అలౌచేసే ఉద్దేశ్యం ఉంది.కాని వాటి స్పీడ్ ని 45km/hr కి మించకుండా చేసి అప్పుడు అనుమతిస్తే బావుంటుందని మా ఉద్దేశ్యం.సిటీల్లో లాండ్ తక్కువ అవాలబిలిటీ ఉన్నప్పుడు,రెండు టూలేన్ రోడ్లు పక్కపక్కన కాకుండా ఒకదానిమీద ఒకటి ఉండే డిజైన్ ఉపయోగపడుతుందని మా ఉద్దేశ్యం.అదికూడా ఆపోజిట్ స్లోప్స్ ప్రిన్సిపల్ మీదే డిజైన్ చేయబడింది.కింద ఫ్లైఓవర్ లెఫ్ట్ నుంచి రైట్ కు స్లోప్ ఉంటే,పైన్ ఉన్న ఫ్లైఓవర్ స్లోప్ రైట్ నుంచి లెఫ్ట్ కి ఉంటుంది.అప్పుడు పిల్లర్స్ డిజైన్ కూడా మారతుంది.నేల శక్తికూడా సరిపోవాలి.హైట్ పెరుగుతున్నకొద్దీ విండ్ లోడ్ ప్రాధాన్యత పెరుగుతుంది.దానిని మనం పరిగణలోకి తీసుకోవాలి “తన ఛెయిర్ లోని మంచినీళ్ళ బాటిల్ ఓపెన్ చేసి మంచినీళ్ళు తాగి మళ్ళీ ప్రారంభించాడు”ఇక మూడవది,ఫ్లైఓవర్ మధ్యనుంచి,సైడ్స్ నుంచి సపోర్ట్ తీసుకుని ,మన డెంటిస్ట్ లు పళ్ళకి డెంటల్ బ్రేస్ వేసినట్టన్నమాట,సోలార్ పానెల్స్ వేస్తాం.ఆపానెల్స్ ద్వారా మనం అమితమైన విద్యుత్ ని ఉత్పాదన చేస్తాం.ఆవిద్యుత్ తోనే లిఫ్ట్ లు,ఎస్కలేటర్ లు నడుపుతాం.మాకాలిక్యులేషన్స్ కరెక్ట్ అయితే లిఫ్ట్ లు,ఎస్కలేటర్ లు,ఇన్సైడ్ ద ఫ్లైఓవర్ లైట్లు,వీడియో కేమెరాలు,వీటన్నిటి నిర్వహణ అవసరాలు పోగా ఇంకా విద్యుత్ మిగులుతుందనీ ,పవర్ గ్రిడ్ కి అనుసంధానం చేయడం ద్వారా సిటికి కరంట్ కూడా సప్లై చేయగలమని మేం నమ్ముతున్నాం.ఈఫ్లైఓవర్ కి కంట్రోల్ రూమ్స్ ఉంటాయి,ఫ్లైఓవర్ పొడుగునా నేలమీద అక్కడక్కడ.ఇక వర్షం పడ్డప్పుడు గాని,హెవీ విండ్ ఉన్నప్పుడు గాని సోలార్ పానెల్స్ ని,పానెల్స్ మధ్యన పైన ఉన్న గాప్ ని,ఫ్లైఓవర్ లోపలికి గాలి,వెలుతురు రావడానికి వదిలిన గాప్ ని కవర్ చేయడానికి అరేంజ్మెంట్స్ ఉన్నాయి.ప్రస్తుతానికి మాన్యుయల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి.కంట్రోల్ రూమ్ నుంచి కంట్రోల్ చేయడం ద్వారా కూడా చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాం. ఆల్రెడీ స్లోప్ ఇచ్చాము కాబట్టి,అదే స్లోప్ లోఒక చిన్న ఓపెన్ డక్ట్ ని ప్రొవైడ్ చేసి కలెక్ట్ అయిన రెయిన్ వాటర్ ని ఎండ్ ఆఫ్ ద ఫ్లైఓవర్ లోని ఒక క్లోస్డ్ పైప్ ద్వారా అండర్ గ్రౌండ్ కి పంపించే ఏర్పాట్లు చేశాం.దానివల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ ఇంప్రూవ్ అవుతుంది.”ఆగాడు ఎండి.అభిషేక్ వైపు చూస్తూ అన్నాడు.”నేనిలా ఎంతసేపైనా మాట్లాడగలను.బట్ ఐ థింక్ వాట్ ఐ స్పోక్ ఈస్ ఎనఫ్ ఫర్ అండర్ స్టాండింగ్ ద కాన్సెప్ట్”తల ఊపాడు అభిషేక్”చాలా బాగా ప్రెజెంట్ చేశారు.మీకాలిక్యులేషన్స్ అన్నీ కరెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఇంత అనుభవం,ఇంటరెస్ట్ ఉన్న మీకు ఇవ్వకుండా టెండర్ ఒక నోవిస్ కి ఇవ్వడం నాకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.డిజైన్ ఇమ్ప్లెలిమెంట్ చేయడం కష్టం అనుకున్నంత మాత్రాన కష్టనష్టాలు బేరీజు వేయకుండా రిజెక్ట్ చేయడం దేనికి?ఇంకేమైనా మాట్లాడారా అప్పటి కమీషనర్?”అడిగాడు.నవ్వాడు ఎండి.”ఆ డిజైన్ కార్పొరేషన్ వాళ్ళే చేశారు.కనస్ట్రక్షన్ కాంట్రాక్ట్ వాళ్ళవాడికి ఇచ్చుకున్నారు.వాడు డిజైన్ కూడా వాడే చేసినట్టు చూపించుకున్నాడు.దాని ప్రకారం అయితే వాళ్ళు కోట్ చేసిన ధరకంటే సగం ధరకి,సగం టైములో పూర్తి చేస్తామని చెప్పాం”నవ్వుతూనే చెప్పాడు.”మూడేళ్ళయింది.పనులు పదోశాతం కూడా పూర్తికాలేదు.చైనాలో నాలుగేళ్ళలో సముద్రం మీద బ్ర్రిడ్జ్ కట్టేశారు.”
“సముద్రంలో బ్రిడ్జ్ కి లాండ్ అక్విషన్ ప్రోబ్లమ్స్ ఉండవ్.టెక్నాలజీ ఉంటే సరిపోతుంది”అభిషేక్ కూడా నవ్వుతూనే అన్నాడు.”సరే మా వచ్చిన పని అయిపోయింది.విశ్వామిత్రే వచ్చి సరెండర్ అవుతానంటున్నాడు కాబట్టి అతని మాటకు విలువిచ్చి మూడురోజులు ఆగుతాను.లేకపోతే తరవాత సీరియస్ ఏక్షన్ తీసుకోవాల్సి వస్తుంది.కంపెనీని కూడా సీజ్ చేయాల్సి ఉంటుంది.”
అభిషేక్,జగదీష్,రాజు ముగ్గురూ ఫాక్టరీ బయటకు వచ్చారు.జగదీష్ అసంతృప్తిగా అన్నాడు”ఏంటి సార్.అంత హడావుడి చేసి తుస్సుమనిపించారు”అభిషేక్ కి చటుక్కున కోపం వచ్చింది
“అరెస్ట్ చేయడానికి కావలసింది పోలీస్ ఫోర్స్ కాదు.ఎవిడెన్స్.చేతిలో ఒక్క ఎవిడెన్స్ లేదు.ఇక్కడంతా గూండాలుంటారు,వాళ్ళందరితోనూ ఫైట్ చేయాల్సుంటుంది ,సిఎమ్ ఆర్డర్ అని ఊదరగొట్టి,ఊపుకుంటూ వచ్చింది నువ్వు.వాళ్ళు ఎంత డిగ్నిఫైడ్ గా,కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూడు.అపోజిషన్ లో ఉన్నది సిఎమ్ అని తెలిసికూడా యుద్ధంలోకి దిగారు.ఒక రాజకీయపార్టీకుండే ధైర్యం అది.ఆ మోటివేషన్ కూడా వ్యాపార కారణాల వల్ల వచ్చింది కాదు.బి కేర్ఫుల్.వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయద్దు.”
“ఎవిడెన్స్ లేకపోవడమేంటి సార్.సిటీలో జరిగిన బ్లాస్ట్ ల కన్నిటికీ తనే కారణం అని ఒప్పుకున్నాడు కదా.నాక్కూడా విశ్వామిత్ర మాటలాధారంగా ఆ ఎండిని,ఆఎక్జిక్యూటివ్ డైరెక్టర్స్ అందరినీ ,శివహైమగారిని కూడా అరెస్ట్ చేయొచ్చు అనిపిస్తోంది సార్.”అన్నాడు రాజు
అభిషేక్ షార్ప్ గా రాజువైపు చూశాడు.”విశ్వామిత్ర మాటలు రికార్డ్ చేశారా?”అడిగాడు
“చేశాను సార్”జగదీష్,రాజు ఇద్దరూ ఒకేసారన్నారు.అభిషేక్ ఇంకేమీ మాట్లాడలేదు.కారు పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకుంది.అందరూ దిగారు.అభిషేక్ చక చక తన రూమ్ లోకి వెళ్ళాడు.లాప్టాప్ ఆన్ చేసి అరెస్ట్ ఆర్డర్ లు టైప్ చేశాడు.ఒకటి శివహైమకి,ఒకటి ద్రోణాచార్యకి,ఇంకొకటి విశ్వామిత్రకి ,మరింకొకటి S&Dఫ్యాక్టరీ డైరెక్టర్స్ కి.
బెల్ కొట్టాడు.రాజు లోపలికి వచ్చాడు.”రాజూ.అరెస్ట్ ఆర్డర్స్ టైప్ చేశాను.శివహైమ,ద్రోణాచార్య ఆర్డర్స్ నేనే తీసుకు వెళతాను. S&Dఫ్యాక్టరీ డైరెక్టర్స్ కి నువ్వే తీసుకువెళ్ళు.
“సార్”అన్నాడు రాజు”అరెస్ట్ గురించి నేనే ముందు మాట్లాడాను.మీరు నన్ను అపార్థం చేసుకోలేదు కదా?”అడిగాడు.
నవ్వాడు అభిషేక్”లేదు రాజూ.కరట్టుగానే అర్థం చేసుకున్నాను.పోలీస్ స్టేషన్ లో ఉంటేనే సేఫ్ అని నీఉద్దేశ్యం.అది నిజమే.కాని పొలీస్ స్టేషన్ లో జగదీష్ ఉన్నాడు.పేరుకే పోలీస్ గాని వాడికి చాలా క్రిమినల్ రికార్డ్ ఉందని విశ్వామిత్ర చెప్పాడుగా.కాబట్టి ఇక్కడ జరిగే విషయాలన్నీ ఒక కంట కనిపెడుతూ ఉండు.నీ క్లోజ్ ఫ్ర్ండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకో.సిఎమ్ ఇన్వాల్మెంట్ చెప్పకు.భయపడతారు.కాంట్రాక్టర్ పేరు చెప్పు.నిన్ను ఈకేసులో నియమించిన ఐజిగారి మీద నీకు నమ్మకం ఉంటే ఆయనకు మొత్తం విషయం చెప్పు.నీప్రాణం కూడా జాగ్రత్తగా చూస్కో”రాజు తల ఊపాడు”నాఊహ కరట్టైతే ఐ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద కేస్ బై టుమారో అండ్ ద కేస్ విల్ బి హేండెడ్ ఓవర్ టు జగదీష్ విత్ అడిషనల్ పవర్స్.నన్ను ఈకేసునుంచి తీసేసినా నేను ఈకేసు వదలనని వాళ్ళకు తెలుసు.ఈకేసుకి సంబంధించిన వాళ్ళనెవరినీ వాళ్ళు వదలరు.శివకుమార్ కి అడిషనల్ సెక్యూరిటి ప్రొవైడ్ చేయమని రాశాను,కేసు పూర్తయ్యేవరకు.వుయ్ ఆల్రెడీ వార్న్డ్ హిం టూ”లాప్ టాప్ ఆఫ్ చేసి అభిషేక్ కుర్చీలోంచి లేచాడు.అతని చేతిలో శివహైమ,ద్రోణాచార్యుల అరెస్ట్ వారంట్ A4 సైజు పేపర్ రెప రెపలాడుతోంది.మడిచి కోటు జేబులో పెట్టుకుని రాజు నివ్వెరపోయి చూస్తూ ఉండగానే విస విసా నడుచుకుంటూ బయటకు వెళిపోయాడు.

* * * * * * * * * * * * *

అంతా అభిషేక్ ఊహించినట్టే జరిగింది.మర్నాడే అభిషేక్ ని కేసు బాధ్యతలనుంచి తప్పిస్తున్నట్టు హోంమినిష్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి.అధికార పక్షానికి చెందిన న్యూస్ పేపరే,న్యూస్ చానెలే మీడియాలో లీడింగ్ కావడం వల్ల ఆ న్యూస్ కి అంత ప్రాచుర్యం లభించలేదు.జగదీష్ కి ప్రమోషన్ తో పాటు కేసులో ఫుల్ ఛార్జ్ ఇస్తూ అవసరమైతే RAF,GREY HOUNDS సేవలు కూడా ఉపయోగించుకునే అధికారం కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఈ తతంగం అంతా జరుగుతున్న సమయంలో అభిషేక్,శివహైమతో కలిసి ద్రోణాచార్య నిలయంలో ఉన్నాడు.అక్కడ అతను మొదట అడుగు పెట్టినప్పుడు అతనికి కలిగిన ఆశ్చర్యం,ఆనందం వర్ణనాతీతం.కారణం అది ఒక ఇల్లులా లేదు.ఏదో ఒక విశ్వవిద్యాలయంలా ఉంది.దాదాపు డెబ్భై ఎకరాల విస్తీర్ణం.ఒక స్కూలు,పోలిటెక్నిక్,ఒక అనాధ శరణాలయం,ఒక హాస్పటల్,ఫోన్ చేస్తే పరుగెత్తుకొచ్చే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ లు,ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్.స్టాఫ్ క్వార్టర్స్.అక్కడ అందరి ఇళ్ళ్లోనూ కంప్యూటర్ లు ఉంటాయి గాని టివిలు ఉండవని తెలిసి అభిషేక్ ఆశ్చర్యపోయాడు.అక్కడ ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది.ద్రోణాచార్య నిలయంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలన్నీ అక్కడే జరుగుతాయి.టివిల్లో వచ్చే కొన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా అక్కడే టెలికాస్ట్ చేస్తారు.బియ్యం,పప్పులు,నూనెలు బయటనుంచి తెచ్చుకుంటారు గాని కూరగాయలు అన్నీ అక్కడే పండించుకుంటారు.ఇవన్నీ ఒక ఎత్తు.అక్కడ ఉన్న అండర్ గ్రౌండ్ మార్షల్ ఆర్ట్స్ విభాగం ఒక ఎత్తు. యోగా టీచర్ గా అంధ్రాయూనివర్సిటీలో తన జీవితం ఆరంభించిన నాన్న ద్రోణాచార్య యోగాను వ్యాప్తి చేసే భాగమైన ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ లో చైనా వెళ్ళాడనీ,తరవాత అక్కడ షావోలిన్ టెంపుల్ గురించి,భారతీయుడైన ద గ్రేట్ ‘బోధిధర్మ’శిష్యపరంపర అక్కడ ఇంకా కొనసాగుతోందనీ విని,ప్రభావితుడై ,తిరిగి చైనా వెళ్ళాడనీ,మార్షల్ ఆర్ట్స్ లో అద్భుతమైన నైపుణ్యం సంపాదించి,అక్కడ టీచర్ గా కొంతకలం తన సేవలందించి,అక్కడనుంచి అమెరికాకు వెళ్ళాడని,అక్కడ సంపాదించిన డబ్బుతోనే ఈలాండ్ అంతా కొనడం జరిగిందనీ చెప్పింది శివహైమ.
అక్కడ ఉన్న ఒక సరస్సు గట్టున కూర్చున్నారిద్దరూ.చుట్టూ అంతా చెట్లు ఉండడం వల్ల చల్ల గాలి వీస్తోంది.పైనుంచి దేవతలెవరో ‘ఇంత అందమైన ప్రదేశం ఏమిటో,అక్కడ కూర్చున్న ఆనందమైన ఆమనుషులెవరో చూద్దాం ’అనుకున్నట్టు,చెట్లచాటుల్లోంచి వెన్నెల సెలయేరు మీద ఒడ్డుమీద పడుతోంది,”డబ్బు ఉన్నవాళ్ళు అహంకారంగా ఉంటారు,అందరినీ అనుమానంతో చూస్తారు,మాపోలీస్ వాళ్ళల్లాగా”నవ్వాడు అభిషేక్”నువ్వింత పెద్ద ప్రోపర్టీ ఓనర్ వని తెలిస్తే నాకున్న ఆభిజాత్యానికి నీదగ్గరకు వచ్చేవాణ్ణి కాదేమో?”నవ్వింది శివహైమ”సింపిల్ లివింగ్,హైథింకింగ్ నాన్న కిష్టమైన పదాలు”చెప్పింది
“సరే విశ్వామిత్ర,శివకుమార్ ల గురించి చెప్పు”అడిగాడు అభిషేక్
“వాళ్ళూ ఇక్కడ అనాధ శరణాలయంలో పెరిగినవాళ్ళే.విశ్వామిత్ర గురించి నాన్న చెప్పింది ఏమిటంటే,విశ్వామిత్ర తండ్రి మొదటి భార్య సంతానం.మొదటి భార్య చనిపోయాక అతను రెండోపెళ్ళి చేసుకున్న కొంతకాలానికి అతనికి రెండో భార్య అతనిని సరిగ్గా చూడదేమోనాన్న అనుమానం వచ్చి విశ్వామిత్రని ఇక్కడ వదిలి వెళిపోయాడని.నాన్నగారు అనడమేమిటంటే అతను నిలయంలో అడుగు పెట్టిన ముహూర్తం చాలా బలమైనదని.అతని తండ్రి అంతవరకూ అతను సంపాదించిన ఆస్తి మొత్తం రాసిస్తానన్నాడుట,కాని విశ్వామిత్ర జాతకం చూసిన నాన్నగారే వద్దన్నారట.వీడే నాకు పెద్ద ఆస్తి అన్నారుట.ఇక ఈఫ్యాక్టరీలన్నీ నాన్న స్థాపించినవి కావు.నాన్న శిష్యులు స్థాపించినవి.వారందరూ కలిసి నేను నాన్న కూతుర్ని కాబట్టి నన్ను ప్రొప్రైటర్ ని చేశారు.”
“నిన్నేకాదు.నన్నుకూడా చేసేశారు.నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది,ఇలాంటి ఫ్యామిలీలోకి రాగలిగినందుకు గర్వంగాకూడా ఉంది.మనుషుల మధ్య ఇంత కోఆర్డినేషన్ సాధించడం,త్యాగాలు అవలీలగా చేయగలిగే సామర్థ్యాన్ని కలిగించడం అంత సామాన్యమైన విషయమేమీ కాదు”ఇద్దరూ సరస్సు ఒడ్డునుంచి పైకి లేచారు.డిన్నర్ హాల్ లోకి వెళుతూ అడిగాడు అభిషేక్”ఫ్లైఓవర్ మీదికి మనుషులు పైకి లిఫ్ట్ మీద వెళతారు సరే కాని బైక్స్,సైకిళ్ళు ఎలా వెళతాయి?”బైక్స్,సైకిళ్ళు ఫ్లైఓవర్ మీదే ఉంటాయి.ప్రతిరోజూ మనుషులతో పాటు పైకి వెళ్ళవు.అయినా అవసరానికి లిఫ్ట్ పక్కనే ఒక ఓపెన్ కార్గో లిఫ్ట్ కూడా ఉంటుంది.ప్రతి రెండు కిలోమీటర్లకి పది సైకిళ్ళు,పది బైకులు పట్టే స్థలం ఫ్లైఓవర్ ఫుట్ పాత్ మీద క్రియేట్ చేశాం.దానివల్ల ఫుట్ పాత్ మీద కొంచెం ఇరుకవుతుంది.కాని అలాంటి ఫెసిలిటీ బిజినెస్ రోడ్స్ లోనే క్రియేట్ చేశాం.బీచ్ రోడ్ లో ఓన్లీ సైకిల్స్.ఫుట్పాత్ మీద బెంచెస్ ప్లాన్ చేశాం.అక్కడక్కడ చిన్న చిన్న కాఫీ షాపులు,రైటింగ్ కమ్ రీడింగ్ టేబుల్స్ ప్లాన్ చేశాం.హైట్ నుంచి సముద్రం చాలా అద్భుతంగా ఉంటుందని.చాలా బిజినెస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.”
డిన్నర్ హాల్ లో డిన్నర్ పూర్తయింది.బెడ్ రూమ్ కి వెళ్ళబోతూ అడిగాడు అభిషేక్ ద్రోణాచార్యుని”మిమ్మల్ని ఒక ఫిలసాఫికల్ ప్రశ్న ఒకటి అడుగుతాను.సెలెక్టెడ్ ఫ్యూ కి మాత్రమే మార్షల్ ఆర్ట్స్ అన్నీ నేర్పుతారు అని విన్నాను.ఎందుకని?ఒక్క సెల్ఫ్ డిఫెన్స్ కి మాత్రమే కాకుండా సమాజంలో మార్పుకి వయొలెన్స్ అవసరమని,ఒక సాధనమని మీరు నమ్ముతారా?నేను సరిగ్గా అడిగానో లేదో కూడా నాకర్థం కావటం లేదు”
నవ్వాడు ద్రోణాచార్య”ప్రజలు తమ రక్షణ బాధ్యతలను పోలీసులకి వదిలేసి మిగతా పనులన్నీ చేసుకోవచ్చుగా?దేశ రక్షణ బాధ్యతలు ఆర్మీకి వదిలేసినట్టు.ఈ మార్షల్ ఆర్ట్స్ అవీ నేర్చుకోవడం అవీ దేనికి?అని అంతేగా?”ద్రోణాచార్య ఆగాడు”గాడ్సే తన కోర్ట్ రూమ్ స్పీచ్ లో ఇలా అంటాడు.‘తన అహింసా సిద్ధాంతం నాలుగు వైపులనుంచి ఓడిపోయిందన్న విషయాన్ని ఒప్పుకోగలిగే మానసిక స్థైర్యం గాంధీకి లేకపోయింది.కానీ మేం ఒక విషయం మాత్రం ఒప్పుకుంటాం. గాంధీ ప్రభావితం చేసినంతగా భారత ప్రజానీకాన్ని మేం ప్రభావితం చేయలేకపోయాం.నాన్ వయొలెన్సే సరియైన మార్గం అయితే, రాముడు,కృష్ణుడు చేసిన యుద్ధాలు కూడా తప్పే’ అని.”మళ్ళీ ఆగి సాలోచనగా అన్నాడు “ఇట్స్ నాట్ ఈజీ టు ఇన్ఫ్లుఎన్స్ ఎ లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్.గాంధీఏ కరట్టేమో,వయొలెన్స్ అనేది ఒక ఆప్షన్ గా పెట్టుకున్నంత కాలం మనం వయొలెన్స్ కి గురి అవుతూనే ఉంటామేమో? లేదా జిడ్డు క్రిష్ణమూర్తిగారన్నట్టు,‘మేన్ ఈజ్ బేసికల్లీ వయొలెంట్.అది మనం అర్థం చేసుకోకుండా,వయొలెన్స్ లోతుల్లోకి వెళ్ళి తరచి చూడకుండా నాన్ వయొలెంట్ గా ఉండాలని బండగా ఎంత ప్రయత్నించి చూసినా ప్రయోజనం ఉండదు.కామాన్ని అణచి వేయాలని,కళ్ళూ చెవులు మూసుకున్నా,కాషాయం వేసుకున్నా ఆ కామాగ్ని జ్వాలల్లోనే దగ్ధమైపోయిన వాళ్ళని ఎంతమందిని మనం చూడలేదు?’అని.అదికూడా నిజమే కదా? నా ఉద్దేశ్యం వయొలెంట్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం కాదు.వయొలెంట్ అట్మాస్ఫియర్ కి భయపడకుండా ఉండడం.సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం వల్ల ధైర్యం పెరుగుతుంది.మంచి చదువు వల్ల,మంచి ఉద్యోగం వల్ల,డబ్బు వల్ల,మంచి పని చేయడం వల్ల,తెలివైన ఆలోచనల వల్ల, కూడా ధైర్యం పెరుగుతుంది.ఇక సెలెక్టెడ్ ఫ్యూకి అడ్వాన్స్డ్ కుంగ్ ఫూ నేర్పుతాం.సెల్ఫ్ డిఫెన్స్ అందరికీ నేర్పుతాం.”తన బెడ్ రూమ్ లోకి వెళుతూ ద్రోణాచార్య చెప్పాడు.”రేపు మీడియా వస్తుంది.మేం అరెస్ట్ అయ్యామన్న విషయం ప్రజలకి ప్రముఖంగా తెలియడం కోసం,మా సేఫ్టీ కోసం.అప్పోజిషన్ పార్టీ ఛానెల్ కి,నేషనల్ ఛానెల్స్ రెండింటికి కొంత డబ్బులిచ్చాం.ఈనిలయం గురించి తెలిసి వాళ్ళుకూడా డబ్బులు డిమాండ్ చేయలేదు.నామినల్ రేట్సే ఇచ్చాం.రేపు వాళ్ళు వస్తారు.మీడియా అంటే తెలుసుగా,సూటిపోటి ప్రశ్నలు,లేని పోని ప్రశ్నలు అడుగుతారు”లోపలికి వెళ్ళిపోయాడు ద్రోణాచార్య.
మర్నాడు పొద్దున్న ద్రోణాచార్య నిలయాన్ని చుట్టుముట్టిన మీడియాతో అభిషేక్ క్లుప్తంగా చెప్పాడు”కేసుకు సంబంధం ఉన్నంత మాత్రాన,పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టినంత మాత్రాన,అందరూ నిందితులు కారు.విశాఖ నగరంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లకి,గత రెండేళ్ళుగా భారీఎత్తున జరిగిన ప్రజల స్థానభ్రంశానికి వీళ్ళకి సంబంధం ఉందని మా ఇన్వెస్టిగేషన్ లో తేలింది.అంతేగాక ఈకేసుకు సంబధించిన వాళ్ళని చంపడానికి ఒక కిల్లర్ గాంగ్ తిరుగుతోంది నగరంలో.వాళ్ళవల్ల కొందరు చంపబడ్డారు కూడా.అందువలన కేసు పూర్వాపరాలు పూర్తిగా తేలేంత వరకూ రక్షణ ఉంటుందని కూడా వీరిని తీసుకు వెళుతున్నాం”ఆ మాటలు విన్న మీడియాకి మబ్బు వెనక ఉదయిస్తున్న సూర్యుడ్ని చూసినట్టయింది. ఇక ఆ మబ్బు విడిపోవడానికి ఎంతోకాలం పట్టదని వారికర్థమైంది.

* * * * * *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked