-జ్వలిత
‘ద హౌస్ ఆఫ్ స్పిరిట్స్’ నవలా పరిచయం
(ప్రపంచ సాహిత్యంలో చదవదగిన నవలలు)
ద హౌస్ ఆఫ్ ది స్పిరిట్ అనే నవల 1982లో ఇసాబెల్ అలెండా అని ఒక జర్నలిస్ట్ మరియు టెలివిజన్ హోస్ట్ అయిన మహిళ యొక్క రచన. ఆమె చైనా నుండి రాజకీయ బహిష్కృతురాలు.
1981 జనవరి 8 వ తేదీన వెనిజులాలో కూర్చొని దాదాపు వంద సంవత్సరాల వృద్ధుడైన తన తాతకు లేఖ రాయడం ప్రారంభించింది. అందులో ఆమె తన వర్తమానానికి తన కుటుంబం యొక్క గతానికి మధ్య ఉన్న దూరాన్ని అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది.
తన చిన్నతనంలో విన్న ఒక పిట్ట కథతో నవల మొదలవుతుంది. రోజా అనే ఒక స్త్రీ తన గురించి చెప్పినట్టుగా. రోజా పొరపాటున విషపూరితమైనట్టు రాసింది. ‘పోస్ట్ చేయని ఉత్తరాలు’ అనే నవల చేతి ప్రతి ” the house of the spirit”గా మారి ఒక ఉత్తమ నవలగా రూపుదిద్దుకున్నది.
ఒక స్త్రీ యొక్క మూడు తరాలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను గురించి స్పష్టంగా చిత్రించింది రచయిత్రి ఈ నవలలో. స్త్రీలకు వ్యతిరేకంగా చిలీదేశం యొక్క అస్థిరత వెనుకబాటుతనాన్ని, 20వ శతాబ్ది యొక్క హింసాత్మక రాజకీయ దృక్పధాన్న, ఈ పుస్తకం పరిచయం చేస్తుంది మనకు.
ఏడు సంవత్సరాల వయసున్న క్లారా భవిష్యత్తు అదృష్టం యోగం వంటి విషయాలను, తల్లిదండ్రుల అతి దుర్మార్గాలను వాటి పరిణామాలకు బాధపడుతూ షాక్ కు గురవుతుంది, ఆ కుటుంబంలోని బాలిక. క్లారా అక్క అందమైన రోజా ఒకరోజు అకస్మాత్తుగా చనిపోతుంది. అప్పటినుండి తొమ్మిది సంవత్సరాలు మాటన కోల్పోయి మూగగా గడుపుతుంది. తన అక్క వరుడినే వివాహమాడుతానని చెప్పేందుకు, తిరిగి మౌనాన్ని వీడుతుంది. అక్క యొక్క వరుడు ఎస్టాబెన్ ట్రూబా. ఆ దేశపు పితృస్వామ్య సమాజంలో దుర్మార్గాలు దురాక్రమణలతో దోచబడుతున్న క్లారా భవిష్యత్తును ఆమె బిడ్డ బ్లాంక్, ఆమె మనమరాలు ఆల్బా అదృష్టాన్ని కూడా మార్పుకు లోను చేస్తుంది. రచయిత్రి వారి స్థితిగతులకు వారి అభిరుచి – ప్రేమ – రాజకీయ నిబద్ధతతో ఎస్టాబెన్ సాయంతో ఏ విధంగా వెలుగు తాయో సంగ్రహంగా స్పష్టంగా వివరించబడింది, కొందరు వ్యక్తుల కథగా నవల మొదలై, శక్తివంతమైన ఆధారాలతో “మ్యాజిక్ రియలిజం” అభివృద్ధి చెంది రొమాన్స్, మోసం, ప్రతీకారం, సాంఘిక తిరుగుబాటు సయోధ్య వంటి అన్నింటిని తుడిచేసింది.
“పుస్తకాల గృహం”(ద హౌస్ ఆఫ్ బుక్స్) అనే పేరుతో క్లారా కోసం ఎస్టాబెన్ ఒక భవనాన్ని నిర్మిస్తాడు. అది విస్తృతంగా ఎదిగి కుటుంబానికి స్నేహితులకు, ఆధ్యాత్మిక వేత్తలకు, కళాకారులకు, రాజకీయ వాదులకు, పిల్లలకు, దశాబ్దాల నవలలకు డ్రామాలకు ఆశ్రయాన్ని కలిగిస్తుంది. నవల తనంతట తాను అన్ని కలిగి ఉన్నట్టే క్షమా గుణానికి కలిగిన గది వలె కనిపిస్తుంది.
గాబ్రియల్ రచన ‘హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్’ వలె ‘ద హౌజ్ ఆఫ్ స్పిరిట్స్’ కూడా స్పానిష్ నవలా సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడానికి సందేహం లేదు.
**** *** *** ***
నవల పేరు – ద హౌస్ ఆఫ్ స్పిరిట్స్
రచయిత్రి – ఇసాబెల్ అల్లెండా (1942లో జన్మించారు)
సంవత్సరం – 1982
ఆంగ్లానువాదం – మాగ్డాబోగిన్ – 1985