శ్రీరామరాజ్యం
శ్రీరామరాజ్యం గూర్చిన ప్రశంసలు సర్వకాలాల్లో జనులు చెప్పుకున్నారు. ( ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నారు). యజ్ఞయాగాలు ఎప్పుడు నిర్వహించినా బంగారు సీతాదేవి విగ్రహాన్ని తనతోపాటు ఉంచుకొని ఆ పుణ్యకార్యాలు నిర్వర్తించాడు శ్రీరాముడు.
శ్రీరామరాజ్వంలో అతివృష్టి, అనావృష్టులు ఉండేవికావు. పంటలు పుష్కలంగా పండేవి. భూమి సస్యశ్యామలంగా ఉంటూ వచ్చింది.
ఆ తరువాత కొంతకాలానికి కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకేయీదేవి పరమ పదించారు. శ్రీరాముడూ, శ్రీరామసోదరులూ వారికి భక్తిప్రపత్తులతో పితృకర్మలు నిర్వర్తించారు. పదకొండువేల సంవత్సరాలు శ్రీరాముడు రాజ్యం చేసి ప్రజలను సుఖపెట్టాడు.
భరతుడి మేనమామ యుధాజిత్తు శ్రీరాముడికి తన పురోహితుడు అయిన గార్గ్యుడితో రత్నరాశులు, శ్రేష్టమైన వేల సంఖ్యలో గుర్రాలు, వెలలేని ఆభరణాలు కానుకగా పంపించాడు. గార్గ్యుడు ఆంగిరసుడి పుత్రుడు. చాలాదూరం ఎదురు వెళ్ళి శ్రీరాముడు ఆ మహర్షిని గౌరవించి ప్రీతుణ