అన్నమయ్య శృంగార నీరాజనం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య
అన్నమయ్య ఈ కీర్తనలో గాలి వీచే పద్ధతులను, మనకు ఏ ఏ ప్రదేశాలలో వీచేగాలి యింపుగా ఉంటుందో ఆ అనుభవాలను చెబుతున్నారు. మనం గమనించినట్లైతే వాస్తుశాస్త్రం ప్రకారం వీచే గాలి ఆధారంగా గాలి ఏ వైపు నుంచి ఇంట్లోకి వస్తే ఏ విధంగా ఉంటుందో తూర్పు నుంచి వచ్చే గాలి శరీరాన్ని తాకిన వెంటనే మధురానుభూతి కలుగుతుంది. అందుకే తూర్పు దిక్కున అధికంగా ద్వారాలు, కిటికీలు ఏర్పాటు చేయాలి అనేది వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాగే తూర్పు నుంచి వీచే గాలి వల్ల ఎక్కువ దాహం వేస్తుంది. అందుకే తూర్పున నీటిని అందుబాటులో ఉంచుకోవడం శ్రేయస్కరం అన్నారు. పశ్చిమ దిశ నుంచి వీచు గాలి శరీరానికి వేడిని కలుగజేస్తుంది. అందుకే పశ్చిమాన కిటికీల సంఖ్య, ద్వారాల సంఖ్యను కుదించారు. ఉత్తరం నుంచి వీచే గాలి చల్లగా ఉంటుంది. ఇది శరీరంలోని ప్రతి భాగాన్ని తాకినప్పుడు శరీరపుష్టిని కలుగజేస్తుంది. అందుకే ఉత్తరంలో ఎక్కువగా కిటికీలు, ద్వారాలు