పుస్తకం వనితా విత్తం
- ఆర్. శర్మ దంతుర్తి
పట్టువదలని గ్రాడ్యుయేట్ స్టూడెంట్ విక్రం ఆదిత్య ఎప్పటి లాగానే పాతబట్టలున్న లాండ్రీ బాస్కెట్ తనకున్న పాత కార్లో వేసుకుని మౌనంగా తమ ఊరిలో ఉన్న ఒకే ఒక లాండ్రోమాట్ వైపు జాగ్రత్తగా, స్పీడ్ లిమిట్ లోపునే నడపసాగాడు. ఆఖరికి రేడియో కూడా పెట్టకుండా విక్రం మౌనంగా బండి నడపడం చూసి బాస్కెట్ బట్టల్లో ఉన్న మురికి భేతాళుడు ఇలా అన్నాడు. "విక్రం నువ్వెందుకైతే ఆదివారం అయినా సరే మోరల్ గా, స్పీడ్ లిమిట్ దాటకుండా డ్రైవ్ చేస్తున్నావో నాకు తెలియదు కానీ చాలా మంది ఎన్నారైలు అమెరికాలో ఇటువంటి చిన్న చిన్న మోరల్స్ గురించి అంతగా పట్టించుకోరు. నువ్వు నడిపే ఈ స్పీడ్ లో లాండ్రోమాట్ కి వెళ్ళడానికి చాలాసేపు పడుతుంది కనక నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి రాజారావు కథ చెపుతాను, విను."
రాజారావు అమెరికా వచ్చేనాటికి ఇక్కడ అమెరికాలో అంతమంది దేశీయులుగానీ, తెలుగువాళ్ళుకానీ ఉండేవారు కాదు. ఎం. ఎస్ లో జేరడానికి వచ్చి